Suryaa.co.in

Telangana

కేసీఆర్…. మీ రాజకీయ జీవితం సమాధి తథ్యం

• అట్టర్ ఫ్లాప్ సినిమాకు ఐటం సాంగ్ లాంటిదే ఆడియో టేపుల వ్యవహారం
• ఎమ్మెల్యేల కొనుగోలు డ్రామాకు సూత్రధారి కేసీఆరే…
• తప్పు చేయకుంటే లై డిటెక్టివ్ పరీక్షలకు సిద్ధమా?
• సీబీఐతో దర్యాప్తు జరిపించాలని లేఖ రాసే దమ్ముందా?
• నిజంగా ఆధారాలుంటే కోర్టుకు ఎందుకు సమర్పించలేదు?
• సీఎం కేసీఆర్ పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఫైర్
• యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంవద్ద తడిబట్టలతో ప్రమాణం చేసిన బండి సంజయ్
• 4గురు ఎమ్మెల్యేల కొనుగోలులో బీజేపీ పాత్ర లేదని స్వామివారి పాదాల సాక్షిగా ప్రమాణం
• బండి సంజయ్ సవాల్ ను స్వీకరించకుండా తోకముడిచిన సీఎం కేసీఆర్
• బండి సంజయ్ ను కలిసిన ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్ధులు
• ప్రశ్నాపత్రంలో 22 ప్రశ్నలు తప్పుల తడకగా ఉన్నప్పటికీ మార్కులు కలపలేదని ఆవేదన
• ఆ మార్కులు కలపకుండానే ఫలితాలు విడుదల చేసి ఫెయిల్ చేశారని వాపోయిన అభ్యర్థులు
• తమకు న్యాయం చేయాలని కోరిన వందలాది మంది అభ్యర్థులు
• ఆయా అభ్యర్థులకు న్యాయం జరిగే వరకు పోరాడతానని హామీ ఇచ్చిన బండి సంజయ్

‘‘ ఎమ్మెల్యేల కొనుగోలు డ్రామాలో బీజేపీ ప్రమేయం లేదని నిరూపించేందుకు ఈరోజు నేను యాదగిరిగుట్టకు వచ్చి లక్ష్మీనరసింహస్వామి సాక్షిగా ప్రమాణం చేశాను. నా సవాల్ ను స్వీకరించకుండా కేసీఆర్ పారిపోయాడు. ఈ వ్యవహారంలో కేసీఆర్ ప్రమేయం ఉంది కాబట్టే రాలేదు. ఇప్పుడు చెబుతున్నా… దేవుడి సాక్షిగా ప్రమాణం చేసిన. కేసీఆర్ చేసిన తప్పులు, దోచుకున్న, దాచుకున్న సొమ్ము పాపం ఊరికే పోదు… త్వరలోనే సీఎం కుటుంబ రాజకీయ జీవిత చరిత్ర సమాధి కాబోతోంది‘‘అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ అని పేర్కొన్నారు.

ఈ మొత్తం వ్యవహారంపై నిగ్గు తేల్చేందుకు సిట్టింగ్ జడ్జి లేదా సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంలో కేసీఆర్ కు ముమ్మాటికీ ప్రమేయం ఉందని ఆరోపించారు. ఒకవేళ కేసీఆర్ కు ప్రమేయం లేకుంటే లై డిటెక్టివ్ పరీక్షలకు సిద్ధమా? అని సవాల్ విసిరారు. కసీఆర్ తోపాటు ఈ వ్యవహారంలో ఉన్న ఎమ్మెల్యేలు సిద్ధమా? అడ్డగోలుగా మాట్లాడుతున్న మంత్రులు, కుటుంబ సభ్యులు సైతం లైడిటెక్టివ్ పరీక్షలకు సిద్ధం కావాలని సవాల్ విసిరారు. కేసీఆర్ కు దమ్ముంటే ఈ మొత్తం వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించాలని లేఖ రాయాలని డిమాండ్ చేశారు. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి పాదాల చెంత పార్టీ రాష్ట్ర ఉఫాధ్యక్షులు డాక్టర్ మనోహర్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు శ్యాంసుందర్, అధికార ప్రతినిధి జె.సంగప్ప, వీరేందర్ గౌడ్, యువమోర్చా అధ్యక్షులు భాను ప్రకాశ్ లతో కలిసి మీడియాతో మాట్లాడారు. అందులోని ముఖ్యాంశాలు…

ముఖ్యమంత్రి కేసీఆర్ తన స్థాయిని మరిచి దిగజారి సభ్యసమాజం తలదించుకునేలా వ్యవహరిస్తున్నారు. 4 గురు ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహరంలో టీఆర్ఎస్ చేసిన ఆరోపణలను ఖండిస్తూ ఇక్కడికి వచ్చాం. మేం ప్రజలను నమ్ముకున్నాం. దైవాన్ని నమ్ముకున్నాం.ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో 100 కోట్లు సీజ్ చేశామని, బీజేపీ పాత్ర ఉందంటూ తమ పార్టీని అప్రదిష్టత పాల్జేసేలా వ్యవహరించారు. ఈ విషయంలో ఎలాంటి ఆధారాల్లేవు. మునుగోడు ఎన్నికల్లో మందు, మనీ, మాంసం పంచినా, ఓటుకు రూ.40 వేలు పంచినా, ఓటుకు తులం బంగారం ఇచ్చినా ప్రజలు టీఆర్ఎస్ ను నమ్మే పరిస్థితి లేదని సర్వేలన్నీ తేల్చడంతో… కేసీఆర్ ఎమ్మెల్యేల కొనుగోలు పేరుతో కుట్రలకు తెరలేపాడు.కేసీఆర్ సొంత ఎమ్మెల్యేలను కాపాడుకోలేని దుస్ధితి. మునుగోడు ఫలితాల తరువాత టీఆర్ఎస్ దుకాణం బంద్ అయితదనే భయంతోనే కేసీఆర్ ఈ డ్రామాకు తెరలేపారు.

ఆ స్వామిజీ ఎవరో తెలవదు. ఆ గొట్టంగాళ్లు ఎవరో మాకు సంబంధం లేదు. బాధితులు టీఆర్ఎస్ పార్టీ నేతలు… పైసలకు అమ్ముడుపోయేందుకు సిద్ధమైంది వాళ్లే. ఫిర్యాదు చేసింది వాళ్లే.. డబ్బు తీసుకొచ్చిన వాహనాలు టీఆర్ఎస్ నేతలవే… ఇందులో బీజేపీకి సంబందం లేకపోయినా బురదచల్లి రాజకీయ లబ్ది పొందే కుట్రకు కేసీఆర్ తెరదీసిండు. ఆడియో టేపుల పేరుతో మరో కొత్త సినిమా చూపే యత్నం కేసీఆర్ చేసి ఫెయిలైండు. అందులో ఏమీ లేదు. అట్టర్ ఫ్లాప్ సినిమాకు ఐటమ్ సాంగ్ యాడ్ చేసినట్లుగా చిత్తయిన కేసీఆర్ డ్రామాను రక్తికట్టించేందుకు ఆడియో టేపు పేరుతో మరో కొత్త నాటకం ఆడుతున్నారు.

అసలా ఎమ్మెల్యేలు ఎటుపోయినరు? మూడు రోజులుగా మిస్సింగ్. బయటకు ఎందుకు రావడం లేదు? ప్రగతి భవన్ కు ఎందుకు పరిమితం చేశారు?నిందితులుగా పేర్కొన్న వారిని ఏసీబీ కోర్టు ముందు ప్రవేశపెడితే… ఆధారాల్లేవని రిమాండ్ ను కూడా కో ర్టు తిరస్కరించినా టీఆర్ఎస్ నేతలకు బుద్ది రావడం లేదు.నిజంగా నిజాయితీ ఉంటే 3 రోజులుగా ఆ ఎమ్మెల్యేలు బయటకు ఎందుకు రావడం లేదు? గంప కింద కోడిలా ఎందుకు కప్పి పెట్టారు. అసలు వాళ్లను ఎందుకు దాస్తున్నట్లు? దక్కన్ కిచెన్ హోటల్ వద్ద సీసీ పుటేజీ ఎందుకు బయటపెట్టడం లేదు? ఢిల్లీలో సీఎంను కలిసిన వారి సీసీ పుటేజీ వివరాలు బయటపెట్టడం లేదు ఎందుకు? అనుమానితుల, సదరు ఎమ్మెల్యేల, నిందితులుగా పిలవబడుతున్న వారి కాల్ లిస్ట్ ను ఎందుకు బయటపెట్టడం లేదు? ఈరోజు విడుదల చేసిన ఆడియో రికార్డులు దొంగవి. వాటిని రడీ చేయడానికి రెండ్రోజులు పట్టింది కేసీఆర్ కు. నిజమైన ఆడియో అయితే కేసీఆర్ స్వయంగా ఎందుకు విడుదల చేయలేదు? లక్ష కోట్ల కమీషన్లు దండుకున్న కాళేశ్వరం ప్రాజెక్టు గురించి అసెంబ్లీ, ప్రగతి భవన్ సాక్షిగా ప్రొజెక్టర్ పెట్టి విజువల్స్ చూపించినట్లుగా ఆడియో టేపులను ఎందుకు విడుదల చేయలేదు?

ఈ మొత్తం వ్యవహారంలో నిందితులుగా ఉన్న వాళ్లకు బీజేపీకి ఏం సంబంధం? ఈ వ్యవహారం ఎట్లా ఉందంటే… అట్టర్ ఫ్లాప్ సినిమాకు ఐటమ్ సాంగ్ తగిలించినట్లుగా ఉంది. అంతే తప్ప అందులో ఏమీ లేదు లొట్టపీసు తప్ప. మేం ధర్మాన్ని, న్యాయాన్ని నమ్ముకున్నాం కాబట్టే సిట్టింగ్ జడ్జి లేదా సీబీఐతో విచారణ జరిపించాలని న్యాయస్థానాన్ని ఆశ్రయించాం. ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశాం.

అంతేగాదు ఈ వ్యవహారంతో మాకు, మా పార్టీకి ఏ సంబంధమూ లేదని నేను ఈరోజు లక్ష్మీనర్సింహస్వామి పాదాల సాక్షిగా ప్రమాణం చేసిన. కేసీఆర్ కూడా రావాలని నిన్ననే సవాల్ విసిరిన. ఇంతవరకు రాలేదు. పైగా రౌడీలు, టీఆర్ఎస్ కార్యకర్తలతో కలిసి నన్ను అడ్డుకునేందుకు యత్నించి విఫలమయ్యారు.కేసీఆర్ తప్పు చేశారు కాబట్టే… ఇక్కడ ప్రమాణం చేసేందుకు రాలేదు. మేం నిజాయితీగా ఉన్నాం కాబట్టే తడిబట్టలతో ప్రమాణం చేశాను.

చేసిన ఆరోపణలను నిరూపించే దమ్ము లేని ఈ సీఎంను ఇంకా ఎన్ని రోజులు భరించాలి?ఈరోజు నేను చేసిన ప్రమాణంతో సీఎం కుటుంబ రాజకీయ జీవిత చరిత్ర సమాధి కాబోతోంది. మీరు దోచుకున్న, దాచుకున్న సొమ్ము పాపం ఊరికే పోదు… మీరెన్ని చేసినా మునుగోడులో బీజేపీ గెలుపు ఖాయం… ఆడియో టేపుల్లో చెప్పిన దాని ప్రకారం… 1 అంటే కేసీఆర్ 2 అంటే కేటీఆర్… సంతోష్ అంటే కేసీఆర్ సడ్డకుడి కొడుకు సంతోష్.. ఎందుకంటే కేసీఆర్ ఆయన కుటుంబమంతా దొంగలే. మునుగోడులో దుకాణం నడవలే… హైదరాబాద్ షిప్ట్ చేసిండు.. అక్కడా ఫెయిల్ కావడంతో ఢిల్లీ పేరుతో డ్రామా చేయబోతుండు.. పాకిస్తాన్ పోయినా మాకేం ఇబ్బంది లేదు..

కేసీఆర్ కుటుంబంతో నందు అనే వ్యక్తితో వ్యాపార సంబంధాలున్నాయి. డాక్యుమెంట్స్ కూడా బయటకొస్తున్నాయి. ట్విట్టర్ టిల్లు… మొరిగే కుక్క… కాబట్టే ఆయనకు అందరూ కుక్కల్లా కన్పిస్తున్నరు…లిక్కర్ దందాలో తన బిడ్డను ఎట్లా కాపాడాలి? అవినీతి సొమ్మును ఎలా కాపాడుకోవాలన్నదే సీఎం తపన తప్ప ఇంకేమీ లేదు. ఎమ్మెల్యేల వ్యవహారంలో ప్రభుత్వం వద్ధ ఆధారాలుంటే ఇప్పటి వరకు కోర్టు ఎదుట ఎందుకు ప్రవేశపెట్టలేకపోయారు? కోర్టులో చెల్లని ఆధారాలతో ప్రజలను మభ్యపెట్టే యత్నం చేశారు.

నేను దేవుడిని నమ్ముకున్న… కేసీఆర్ దయ్యాలను, అవినీతి సొమ్ముతో, కుట్రలు కుతంత్రాలను నమ్ముకుని రాజకీయాలు చేస్తున్నారు. సీఎం.. నీ ప్రమేయం లేకుంటే లై డిటెక్టివ్ పరీక్షలకు సిద్ధమా? నీ ఎమ్మెల్యేలు సిద్ధమా? మొరుగుతున్న నీ మంత్రులు, నీ కుటుంబ సభ్యులు సిద్ధమా? స్పష్టం చేయాలి. కేసీఆర్ కు దమ్ముంటే ఈ మొత్తం వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించాలని లేఖ రాయాలి.

– యాదగిరిగుట్ట వెళుతుండగా మార్గమధ్యలో చిల్లపురం వద్ద బండి సంజయ్ ను కలిసిన మేకల కాశయ్య
“అన్నా…. నాపేరు మేకల కాశయ్య. కమ్యూనిస్టు కార్యకర్తను. మీ నాయకత్వంలో మాలాంటి పేదల కోసం బీజేపీ చేస్తున్న పోరాటాలు భేష్.మా కమ్యూనిస్టులు కేసీఆర్ కు అమ్ముడుపోయారు. కేసీఆర్ దుర్మార్గపు పాలనలో పేదలు, దళితులంతా అల్లడిపోతున్నారు. అందుకే మునుగోడు ఎన్నికల్లో మేమంతా బీజేపీకే ఓటేస్తం.” అని పేర్కొన్నారు. ఈ సందర్బంగా బండి సంజయ్ తో కలిసి ఫోటో దిగారు.కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆపదలో ఆదుకుంటారని ఇంటింటా ప్రచారం చేసి గెలిపించుకుంటామని హామీ.ఈ సందర్బంగా మేకల కాశయ్య కు కాషాయ కండువా కప్పిన బండి సంజయ్.

LEAVE A RESPONSE