• ప్రజలు చస్తున్నా కనీసం స్పందించని నరరూప రాక్షసుడు
• కేసీఆర్ పాలనకు ట్యాగ్ లైన్ మానవత్వమని చెప్పడం సిగ్గు చేటు
• పోడు భూములకు పట్టాలపై మరో డ్రామాకు తెరదీసిన కేసీఆర్
– తక్షణమే పట్టాలియ్యకుంటే పేదలంతా ఫాంహౌజ్ ను ఆక్రమించుకుని దున్నడం ఖాయం
• ప్రశ్నించే జర్నలిస్టుల గొంతు నొక్కుతున్న ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమంలో టాప్ అనడం సిగ్గు చేటు
• 1100 మంది జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలివ్వాలని సుప్రీంకోర్టు చెప్పినా స్పందించని దుర్మార్గుడు కేసీఆర్
• మీకు చేతగాకుంటే మాకు అప్పగించండి… కేంద్రంతో మాట్లాడి జర్నలిస్టులందరికీ ఇండ్లు ఇప్పించే బాధ్యత తీసుకుంటా
• కూల్చే సంస్కృతి మీదే… సచివాలయాన్ని కూల్చిన దుర్మార్గులెవరు?
• పాతబస్తీలో విద్యుత్ చౌర్యం నిరూపిస్తా…దమ్ముంటే నాతో రావాలి
• రాష్ట్ర ప్రభుత్వంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఫైర్…
• సంజయ్ సమక్షంలో బీజేపీలో చేరిన సిరిసిల్ల మాజీ వైస్ ఛైర్మన్ లగిశెట్టి శ్రీనివాస్
కేసీఆర్ పాలన మానవత్వానికి చిరునామా అంటూ అసెంబ్లీలో మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ తీవ్రస్థాయిలో స్పందించారు. కేసీఆర్ @ మానవ మ్రుగం అంటూ అభివర్ణించారు. ఇంటర్మీడియట్ విద్యార్థులు మొదలుకుని రైతులు, నిరుద్యోగులు, ఉద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా కనీసం స్పందించని నరరూప రాక్షసుడు కేసీఆర్ అని మండిపడ్డారు. పోడు భూములకు పట్టాలివ్వకుండా 8 ఏళ్లుగా నాన్చిన కేసీఆర్ మళ్లీ అఖిలపక్షం పేరుతో కొత్త డ్రామాలకు తెరదీశారని విమర్శించారు.
ఈసారి పోడు భూములకు పట్టాలివ్వకుంటే పేదలంతా ఫాంహౌజ్ ను ఆక్రమించుకుని దున్నడం ఖాయమని హెచ్చరించారు. జర్నలిస్టు సంక్షేమంలో తెలంగాణ ప్రభుత్వం నెంబర్ వన్ అంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను ఎద్దేవా చేశారు. ప్రశ్నించే గొంతుకలను అణిచివేస్తున్న కేసీఆర్ సంక్షేమం గురించి మాట్లాడటం సిగ్గు చేటన్నారు. రాష్ట్రంలోని 1100 మంది జర్నలిస్టులకు నిజాంపేట, పేట్ బషీరాబాద్ లో తక్షణమే ఇండ్ల స్థలాలు కేటాయించాలని సుప్రీంకోర్టు తీర్పునిచ్చి 6 నెలలైనా అమలు చేయని దుర్మార్గుడు కేసీఆర్ అని మండిపడ్డారు.
రాష్ట్రంలో కూల్చే సంస్క్రుతి బీఆర్ఎస్ దేనని, సచివాలయాన్ని కూల్చిందెవరో ప్రజలకు తెలుసునన్నారు. పాతబస్తీలో విద్యుత్ బకాయిల్లేవంటూ ఎంఐఎం నేతలు, టీఆర్ఎస్ నాయకులు మాట్లాడటం విడ్డూరమన్నారు. పాతబస్తీలో ఏటా రూ.వెయ్యి కోట్ల విద్యుత్ చౌర్యం జరుగుతోందని, తనతో వస్తే నిరూపించేందుకు సిద్ధమని సవాల్ విసిరారు.
సిరిసిల్ల సెస్ మాజీ వైస్ ఛైర్మన్, శ్రీనివాస చారిటబుల్ ట్రస్ట్ అధినేత లగిశెట్టి శ్రీనివాస్ సహా వందలాది మంది అనుచరులు ఈరోజు పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బండి సంజయ్ సమక్షంలో బీజేపీలో చేరారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమదేవి, జిల్లా అధ్యక్షులు ప్రతాప రామక్రిష్ణ, రాష్ట్ర నాయకులు ఎర్రం మహేశ్ తదితరులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో బండి సంజయ్ మాట్లాడారు. అందులోని ముఖ్యాంశాలు…
సిరిసిల్లలో జరిగేది మామూలు యుద్దం కాదు. కేసీఆర్ కొడుకు సిరిసిల్లలో తిరగాలంటే బీజేపీ కార్యకర్తలను అరెస్ట్ చేస్తున్నారు. ఈసారి బీఆర్ఎస్ అధికారంలో వస్తే వాళ్లు వస్తే ఈసారి చెప్పులు నెత్తిన పెట్టుకుని తిరగాల్సిందే. బీఆర్ఎస్ అరాచకాలు భరించలేక టీఆర్ఎస్ నుండి బీజేపీలో చేరుతున్న లగిశెట్టి శ్రీనివాస్ కు హ్రుదయ పూర్వక స్వాగతం పలుకుతున్నా.
అసెంబ్లీ వేదికగా సీఎం ఏం మాట్లాడుతున్నారు? బడ్జెట్ వల్ల ఏ మేరకు ప్రయోజనం కలుగుతుందని ప్రజలంతా ఆశించారు. కానీ అందుకు భిన్నగా ప్రజా సమస్యలపై, బడ్జెట్ పై చర్చ లేకుండా చేస్తున్నారు. సీఎం ఇచ్చిన హామీలకు దిక్కు లేదు. కేసీఆర్ హామీలను పట్టించుకునే నాథుడే కరువయ్యారు. చేనేత బంధు ఇస్తానని ఇచ్చిన హామీ ఏమైంది? మగ్గాలపై పడి ఆత్మహత్య చేసుకుంటున్నరు. బతుకుమ్మ చీరల ఆర్డర్ మాత్రమే ఇచ్చి చేనేత జీవితాలను దుర్భరం చేసిన ఘనుడు కేసీఆర్. కేసీఆర్ కు తెలంగాణ అభివ్రుద్ధి గురించి మాట్లాడటం లేదు. నిత్యం కేంద్రాన్ని, మోదీగారిని తిట్టడానికే సమయం వెచ్చిస్తున్నారు. పోడు భూములను పరిష్కరిస్తానని, పట్టాలిస్తానని హామీ ఇచ్చిన కేసీఆర్ 8 ఏళ్లుగా ఎందుకు పట్టాలివ్వడం లేదు? పోడు భూముల్లో పంటలు వేసుకోవాలని చెప్పేది కేసీఆరే… తీరా పంట చేతికొచ్చే సమయానికి అధికారులను పంపి దాడులు చేయించేది కేసీఆర్.. దాడులయ్యాక గిరిజనుల పక్షాన ఆందోళనలు చేయించేది కేసీఆర్. కేసీఆర్ ద్వంద్వ నీతికి నిదర్శనం.
అఖిల పక్ష సమావేశం నిర్వహించి భవిష్యత్తులో పోడు సాగు చేయబోమని హామీ ఇస్తేనే పట్టాలిస్తానని కేసీఆర్ ఇయాళ అసెంబ్లీలో చెప్పడం సిగ్గు చేటు. ఉప ఎన్నికల సమయంలో ఈ మాట ఎందుకు చెప్పలేదు? కుర్చీ వేసుకుని పోడు భూములకు పట్టాలిస్తానని హామీ ఎందుకు ఇచ్చారు? ఇన్నాళ్లు నాన్చింది ఎవరు? మళ్లీ అఖిలపక్షం పేరుతో కొత్త డ్రామా చేస్తుందెవరు? పట్టాలివ్వకుండా చేయడానికే కొత్త నాటకం మొదలు పెడుతున్నారు. పోడు భూములకు పట్టాలివ్వకుంటే గిరిజనులంతా నీ ఫాంహౌజ్ ను ఆక్రమించుకుని దున్నడం ఖాయం.. ఆ అవకాశం ఇవ్వకుండా తక్షణమే పట్టాలివ్వాలని డిమాండ్ చేస్తున్నాం. కేసీఆర్ పాలనకు ట్యాగ్ లైన్ మానవీయత అని అసెంబ్లీలో చెప్పడం సిగ్గు చేటు. మానవీయత కాదు.. కేసీఆర్ @ మానవ మృగం. నీ దుర్మార్గ, దుష్ట, నియంత పాలనలో ఇంటర్మీడియట్ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటే స్పందించరు. వడ్ల కుప్పలపై పడి రైతులు చచ్చిపోతే స్పందిచరు. ఉద్యోగాల్లేక నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకుంటే మాట్లాడరు.
317 జీవో వల్ల పుట్టకొకరు చెట్టుకొకరై ఉద్యోగులు అల్లాడుతుంటే కనీసం స్పందించని మీరు మానవత్వం గురించి మాట్లాడటమా? నీ పాలనా పుణ్యమా అని రైతుల ఆత్మహత్యలు 4వ స్థానం నుండి 3వ స్థానానికి చేరింది. ఆత్మహత్యలు, హత్యలు, మైనర్ బాలికలపై అత్యాచారాలు జరుగుతున్నా కనీసం నోరు మెదపని మానవ మ్రుగం కేసీఆర్. ఆయనది మానవత్వం అంటూ కొడుకు మాట్లాడటం సిగ్గు చేటు. బీజేపీది స్ట్రయిట్ రూట్. అడ్డదారులు తొక్కే అలవాటు లేదు. మతపరమైన రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకం. ఎస్టీ రిజర్వేషన్లను మతపరమైన బిల్లుతో జతచేసి అమలు కాకుండా ఎందుకు చేయలేదు? బోయ వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేరుస్తానని హామీ ఇచ్చి 8 ఏళ్లయినా ఎందుకు అమలు చేయలేదు? నిన్ను ఆపిందెవరు? అడ్డుకుందెవరు? బోయ వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాలని బీజీపీ నాయకులంతా ఆందోళనకు సిద్ధమైతే మోదీని బదనాం చేసేందుకు కేసీఆర్ అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానంతో కొత్త డ్రామాకు తెరలేపడం సిగ్గు చేటు.
ప్రశ్నించే జర్నలిస్టుల గొంతు నొక్కుతున్న కేసీఆర్ ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమంలో నెంబర్ వన్ గా నిలిచిందని అసెంబ్లీ సాక్షిగా చెప్పడం హాస్యాస్పదం. జర్నలిస్టులకు ఎంతమందికి డబుల్ బెడ్రూం ఇండ్లు ఇచ్చారో చెప్పాలి? హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న 1100 మంది రాష్టస్థాయి జర్నలిస్టులకు నిజాంపేట, పేట బషీరాబాద్ లో ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సాక్షాత్తు సుప్రీంకోర్టు తీర్పునిచ్చి 6 నెలలైనా ఇంతవరకు ఇవ్వకుండా అరిగోస పెడుతున్న కేసీఆర్ ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమం గురించి మాట్లాడటం సిగ్గు చేటు. మీడియాను పాతాళలోకంలో పాతిపెడతానని చెప్పి రెండు ఛానళ్లపై నిషేధం విధించిన దుర్మార్గుడు కేసీఆర్. జర్నలిస్టులకు ఇండ్లు ఇచ్చేందుకు బీజేపీ సిద్ధంగా ఉంది. కేసీఆర్ కు చిత్తశుద్ధి ఉంటే జర్నలిస్టులకు ఇండ్లు ఇవ్వాలని ప్రతిపాదన పంపితే వారం రోజుల్లో మంజూరు చేయించే బాధ్యత నేను తీసుకుంటా. దమ్ముంటే కేసీఆర్ ప్రతిపాదనలు పంపాలి.
పేదలకు కేంద్రం 2.5 లక్షల ఇండ్లు మంజూరు చేస్తే ఆ నిధులను దారి మళ్లించిన ఘనుడు కేసీఆర్. పేదల కోసం కేంద్రంతో మాట్లాడి మరో 5 లక్షల ఇండ్లు మంజూరు చేయించేందుకు సిద్ధమని నేను సవాల్ చేస్తే తోకముడిచిన దుర్మార్గుడు కేసీఆర్. (మేం కడుతుంటే.. కొందరు పిచ్చోళ్లు కూలుస్తామంటున్నారంటూ మీడియా అడిగిన ప్రశ్నకు)… అసలు సచివాలయానికి కూల్చిందెవరు? మీరే కదా? కూల్చే సంస్క్రుతి ఎవరదిది? మీ అయ్య సచివాలయానికే పోనప్పుడు కూల్చాల్సిన అవసరం ఏముంది? సచివాలయంలో పోచమ్మ తల్లి ఆలయాన్ని కూల్చిందెవరు? ఆ పాపం తగల్లేదా? స్వార్థం కోసం యాగం చేస్తే యాగశాల కాలిపాయే.. పోచమ్మ తల్లి పవర్ ఫుల్.. సచివాలయం కడుతుంటే మంటలు ఎగిసిపడే… వెంటనే పోచమ్మ తల్లి ఆలయాన్ని కట్టాలే. ప్రజలను కలవని ప్రగతి భవన్ ను ఎందుకు కట్టుకున్నవ్?
పేదలకు ఉపయోగపడే ఉస్మానియా ఆసుపత్రి శిథిలావస్థలో ఉంది. దానిని కూల్చి కొత్త భవనం కట్టడం లేదు? కోర్టు వద్దని చెబితే మరో ప్రాంతంలో ఆసుపత్రి ఎందుకు కట్టడం లేదు? నిజాం బానిసత్వ మరకలను తుడిచివేయడానికి మేం ప్రయత్నిస్తుంటే… బానిసల్లాగా ఉండాలని చేస్తున్నది కేసీఆర్. సచివాలయం చూస్తే ఏం గుర్తుకొస్తుంది? రాష్ట్రంలోని యువత సచివాలయానికి వెళ్లి చూడాలని కోరుతున్నా. ఏది పడితే అది కట్టుకుంటామని ఊరుకుంటామా? ఇదేమైనా రాచరికమా? నీ అయ్య ఆస్థినా? పాతబస్తీలో విద్యుత్ బకాయిల్లేవని చెప్పడం దారుణం. విద్యుత్ చౌర్యంలో నెంబర్ వన్ పాతబస్తీ. ఏటా వెయ్యి కోట్ల రూపాయల విద్యుత్ చౌర్యం జరుగుతుందని నేను నిరూపిస్తా. నా సవాల్ కు మీరు సిద్దమా? విద్యుత్ బిల్లులు కట్టరు. ట్రిపుల్ రైడింగ్ జరిగినా చలాన్లు ఉండవు.