– బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమదేవి
బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ చేపట్టిన రెండో విడత ‘‘ప్రజా సంగ్రామ యాత్ర’’ రెండ్రోజుల పాటు వాయిదా పడుతుందనే వార్తల్లో ఏమాత్రం నిజం లేదు.ప్రజా సంగ్రామ యాత్ర యధావిధిగా కొనసాగుతుంది. ఈ రోజు మక్తల్ లో జరిగే బహిరంగ సభ అనంతరం రాత్రి బస చేసే శిబిరం నుండే రేపు యధావిధిగా పాదయాత్ర ప్రారంభమవుతుంది.గత 12 రోజులుగా మండుటెండలో పాదయాత్ర చేయడంవల్ల బండి సంజయ్ వడ దెబ్బకు గురయ్యారు. దీనికితోడు ఎసిడిటీ సమస్య తోడవడంతో అస్వస్థతకు లోనయ్యారు. బండి సంజయ్ కు చికిత్స చేస్తున్న డాక్టర్లు ఆయన ఆరోగ్య రీత్యా పాదయాత్రకు విరామం ఇవ్వాలని సూచించారు. బండి సంజయ్ మాత్రం పాదయాత్ర కొనసాగించడానికే మొగ్గు చూపారు. ఈ నేపథ్యంలో పాదయాత్రను యథావిదిగా కొనసాగనుంది. సమాచార లోపం వల్ల మాత్రమే పాదయాత్రకు రెండ్రోజులు విరామం ఇస్తున్నట్లు పొరపాటుగా వెలువరించడం జరిగింది.