-సచివాలయం నూతన భవనంపై ఏర్పాటు చేసిన జాతీయ చిహ్నాల డోమ్ లను కూల్చి వేస్తామని చెప్పిన బండి సంజయ్ వెంటనే క్షమాపణలు చెప్పాలి
-భారత రాజ్యాంగం పట్ల అవగాహన లేకుండా బండి సంజయ్ మాట్లాడితే ఎలా..??
-ఇదేనా బీజేపీ నేర్పిన నీతి.. విధానం..??
-సుప్రీం కోర్టు, గుజరాత్ రాష్ట్రం సచివాలయం సహా అనేక రాష్ట్రాల సచివాలయం భవనాలపై ఇదే తరహా డోమ్ లు ఉన్న వాస్తవం బండి సంజయ్ కు తెలియక పోవడం విచారకరం
-బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పై రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ ఆగ్రహం
తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయ భవనంపై జాతీయ చిహ్నాలతో ఏర్పాటు చేసిన డోమ్ లను కూల్చివేస్తామని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రకటించడం పట్ల రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు సింహాలు ఉన్నజాతీయ చిహ్నలతో కూడిన చారిత్రాత్మమైన డోమ్ లను కూల్చివేస్తామని చెప్పిన బండి సంజయ్.. తన తప్పును తెలుసుకొని తక్షణమే ప్రజలకు క్షమాపణలు చెప్పాలని వినోద్ కుమార్ డిమాండ్ చేశారు.
భారత రాజ్యాంగం పట్ల ఏమాత్రం అవగాహన లేకుండా బండి సంజయ్ నోటికి వచ్చినట్లు మాట్లాడితే ఎలా..?? అని వినోద్ కుమార్ అన్నారు. భారత దేశం వ్యాప్తంగా అనేక రాష్ట్రాలలో ఉన్న సచివాలయం భవనాలపై జాతీయ చిహ్నాలు ఉన్న డోమ్ లను.. ముఖ్యంగా దేశంలో అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు భవనంపై కూడా తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయంపై ఏర్పాటు చేసిన నమూనాలోనే డోమ్ లు ఉన్న విషయాన్ని బండి సంజయ్ గమనించాలని వినోద్ కుమార్ సూచించారు.