– కేసీఆర్ బుద్ధి భ్రష్టుపట్టింది
– ‘బీజేపీ బీమ్ దీక్ష’ లో బండి సంజయ్ కుమార్
ఢిల్లీలోని తెలంగాణ భవన్ వద్దనున్న బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ఎదుట ‘బీజేపీ బీమ్ దీక్ష’ చేసిన అనంతరం బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ మీడియాతో మాట్లాడారు.రాజ్యాంగాన్ని తిరగరాయాలని కేసీఆర్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ నాయకులు, కార్యకర్తలంతా ఈరోజు ‘భీమ్ దీక్ష’ చేస్తున్నారు. అందులో భాగంగా ఢిల్లీలోని తెలంగాణ భవన్ వద్ద బీమ్ దీక్షలో పాల్గొన్నం.
కేసీఆర్ అహంకారంత గర్వం తలకెక్కి మాట్లాడుతుండటాన్ని దేశమంతా చూస్తోంది. కేసీఆర్… మీకెందుకింత అహంకారం? బరితెగించి మాట్లాడుతూ ఇంకా సమర్ధించుకోవడం సిగ్గుచేటు.
టీఆర్ఎస్ నేతలు కూడా బలుపెక్కి అడ్డగోలుగా మాట్లాడుతున్నరు. కేసీఆర్ కు సీఎం పదవి బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం పెట్టిన భిక్షే. దేశంలో కల్వకుంట్ల రాజ్యాంగాన్ని తీసుకురావాలని చూస్తున్న నీచుడు కేసీఆర్ఆ రాజ్యాంగం ప్రకారం…. సీఎం, మంత్రులు సచివాలయానికి వెళ్లొద్దనుకుంటున్నడు. అసలు సచివాలయమే ఉండొద్దనుకుంటున్నడు.
గడీలు, ఫాంహౌజ్ లు నిర్మించుకుంటూ తానే రారాజు అని కేసీఆర్ భావిస్తున్నడు. అంబేద్కర్ రాజ్యాంగం వద్దు… కల్వకుంట్ల రాజ్యాంగమే ముద్దు అని చెబుతున్నడు.‘దోచుకో-దాచుకో’ పథకం తానే దోచుకోవాలి.. దాచుకోవాలనుకుంటున్నడు. కుటుంబ పాలనను ఎవరూ ప్రశ్నించొద్దని కేసీఆర్ అనుకుంటున్నడు..
ఆయన రాజ్యాంగం ప్రకారం… హామీలను నెరవేర్చకూడదు… నిరుద్యోగులకు ఉద్యోగాలివ్వను… దళితులకు మూడెకరాలు ఇవ్వకూడదని అనుకుంటున్నడు. అంబేద్కర్ 125 అడుగుల విగ్రహం అవసరం లేదనుకుంటున్నుడు. తెలంగాణలో బాబాసాహెబ్ స్థానంలో తన విగ్రహం పెట్టుకోవాలని కేసీఆర్ చూస్తున్నడు.
కేసీఆర్… ఇంకా నీ నియంత పాలనను భరించాలా? కేసీఆర్ విశ్వాసఘాతకుడు… దేశ ద్రోహి. కానీ కేసీఆర్ అంబేద్కర్ జయంతి, వర్దంతులకు ఏనాడు హాజరుకాని నీచుడు. అంబేద్కర్ 125 అడుగుల విగ్రహాన్ని పెట్టని మూర్ఖుడు. తెలంగాణ సమాజం కేసీఆర్ ను భరించడానికి సిద్ధంగా లేరు.రాజ్యాంగంలోని మౌలిక సూత్రాలను మార్చాలనుకున్న ఇందిరాగాంధీకి దేశ ప్రజలు చుక్కలు చూపిన సంగతి గుర్తుంచుకో. కేసీఆర్ వ్యాఖ్యలన్నీ… స్ట్రాటజీలో భాగమేనని ఆ పార్టీ నేతలే చెప్పుకోవడం సిగ్గు చేటు.ఇలాంటి స్ట్రాటజీలతో ఇంకా ఎంతమందిని అవమానిస్తావ్ కేసీఆర్.జాతీయ జెండాను మార్చాలంటాడేమో.. సనాతన ధర్మాన్ని పక్కనపెట్టాలంటాడేమో.కేసీఆర్… ఆనాడు బ్రిటీషర్లకు పట్టిన గతే నీకు పడుతుంది.
కేసీఆర్ ఈ అంశంపై స్పందించేదాకా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ప్రధాని పదవి నాకు అంబేద్కర్ పెట్టిన భిక్ష అని సాక్షాత్తు పార్లమెంట్ లో ప్రకటించిన గొప్ప వ్యక్తి నరేంద్రమోదీ. అంబేద్కర్ స్పూర్తితోనే శక్తివంతమైన దేశ రూపకల్పనలో మోదీ గారు అహర్నిశలు కృషి చేస్తుంటే… కేసీఆర్ మాత్రం అంబేద్కర్ రాజ్యాంగమే వద్దని కుట్ర చేస్తున్నడు. తెలంగాణ సమాజంతోపాటు యావత్ దేశం కేసీఆర్ కుట్రలను గమనించాలని కోరుతున్నా.
నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ మాట్లాడుతూ..బడ్జెట్ పై సర్వత్రా ప్రశంసలు వెల్లువెల్తుతుతున్న తరుణంలో కేసీఆర్ పిచ్చెక్కి మాట్లాడుతున్నడు.కేసీఆర్ మాత్రం ఎన్నికల హామీలను విస్మరిస్తూ పబ్బం గడుపుతున్నడు.డబుల్ బెడ్రూం ఇండ్లు ఏమైనయ్… ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగ భ్రుతి, దళిత బంధు ఏమైంది?బడ్జెట్ పై కేసీఆర్ వ్యాఖ్యలు పెద్ద జోక్.కేసీఆర్ ఓ ఊరకుక్క మాదిరిగా మొరుగుతున్నడని తెలంగాణ సమాజానికి అర్ధమైంది.
కేసీఆర్ కు రీడిజైనింగ్ పెద్ద షోకులా మారింది.32 వేల కోట్ల కాళేశ్వరం ప్రాజెక్టుకు లక్ష కోట్లు దాటించిండు.రాజ్యాంగాన్ని కూడా రీడిజైన్ చేస్తానని చెబుతున్నడు సిగ్గు లేకుండా. చివరకు దేవుడి రూపాన్ని కూడా రీడిజైన్ చేస్తానని అంటాడేమో..
కేసీఆర్ బుద్ధి భ్రష్టుపట్టింది.తెలంగాణ పరువును తీస్తుండు. రాజ్యాంగం నీకు ఏ విషయంలో అడ్డమొచ్చింది కేసీఆర్రుణమాఫీ, డబుల్ బెడ్రూం ఇండ్లు సహా ఏ పథకం ఇవ్వడానికి అడ్డమొచ్చింది.సీఎం పదవిలో కూర్చోవడానికి కేసీఆర్ అర్హుడు కాదు.తెలంగాణ సమాజం కేసీఆర్ ను ఛీ కొట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నయ్.త్వరలోనే టీఆర్ఎస్ సింగిల్ డిజిట్ కే పరిమితం కావడం ఖాయం.దేశ రాజకీయాల్లోకి కేసీఆర్ వచ్చేది తెలంగాణ పరువు తీయడానికే…
ఆదిలాబాద్ ఎంపీ సోయం బాబూరావు మాట్లాడుతూ…..ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత, గిరిజన ద్రోహి.కేసీఆర్… కొత్త రాజ్యాంగం దేనికోసం?ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా రాజ్యాంగం రచించాలనుకుంటున్నవా?రాజ్యాంగం ఎస్సీ, ఎస్టీ లకు ప్రసాదించిన హక్కులను కాలరాయాలనుకుంటున్నవా?కేసీఆర్….అవినీతికి పాల్పడి నువ్వు జైలుకు పోతావని తెలిసి కొత్త రాజ్యాంగం ద్వారా జైలుకు వెళ్లకుండా అడ్డుకోవాలనుకుంటున్నవా?రాజ్యాంగం పెట్టిన భిక్షతోనే నువ్వు సీఎం అయ్యావనే సంగతి గుర్తుంచుకో.తక్షణమే కేసీఆర్ దేశ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలి…
కర్ణాటక ఎంపీ మునుస్వామి మాట్లాడుతూ…సీఎం కేసీఆర్ కు హుజూరాబాద్ ఎన్నికల ఫలితాలతో పచ్చి ముదిరింది. కేసీఆర్ ను మెంటల్ ఆసుపత్రిలో చేర్చాలి.కేసీఆర్… దేశ ప్రజలకు క్షమాపణ చెప్పి… సీఎం పదవికి రాజీనామా చేయాలి.కేసీఆర్… ఇక భవిష్యత్ లేదు.. రాజకీయాల నుండి తప్పుకో.కుటుంబ సభ్యులు… మనువళ్లతో కాలక్షేపం చేసుకుంటే బెటర్.
కర్నాటక ఎంపీ మునుస్వామి, రాష్ట్ర ఎంపీలు ధర్మపురి అరవింద్, సోయం బాబూరావు, పార్లమెంటరీ పార్టీ కార్యాలయ కార్యదర్శి కామర్సు బాలసుబ్రమణ్యం, కేంద్ర జలవనరుల శాఖ సలహాదారులు వెదిరె శ్రీరాం, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంగారు శృతి, సమన్వయకర్త నూనె బాలరాజ్ తదితరులు ఈ మీడియాతో సమావేశంలో పాల్గొన్నారు.