Suryaa.co.in

Telangana

తెలంగాణ సాధించుకుంది ఇందుకేనా?

– హత్యలు, అత్యాచారాల అడ్డగా తెలంగాణ
– గౌరవెల్లి నిర్వాసితులు చేసిన తప్పేంది?
– సీఎం ఫాం హౌస్ లో జాగా ఆడిగారా?
– రక్తం చిందెలా కాళ్లు చేతులు, తలలు పగల కొట్టిస్తావా?
– జూబ్లిహిల్స్ మైనర్ బాలిక రేప్ నిందితులకు స్టార్ హోటల్ ఆతిథ్యమా?
– 27 మంది ఇంటర్మీడియట్ విద్యార్థుల చావుకు కారణం ముమ్మాటీకి గ్లోబరీనా సంస్థే
కేసులకు భయపడే ప్రసక్తే లేదు
– చట్ట, న్యాయ పోరాటాలు చేస్తాం…
– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్

కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ కేసీఆర్ కుటుంబం పాలైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ధ్వజమెత్తారు. ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను అప్పులపాల్జేసి అడుక్కు తినే పరిస్థితికి తీసుకొచ్చారని మండిపడ్డారు. హత్యలు, అత్యాచారాలకు అడ్డగా తెలంగాణను మార్చారని పేర్కొన్నారు. 27 మంది ఇంటర్మీడియట్ విద్యార్థుల చావుకు ముమ్మాటికీ గ్లోబరీనా సంస్థే కారణమని ఉద్ఘాటించారు. కోర్టులంటే తమకు గౌరవముందని… టీఆర్ఎస్ నేతలు వేసే కేసులకు భయపడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.

గ్లోబరీనా సంస్థ బండారాన్ని కోర్టుల ముందుంచి బయటపెడతామని స్పష్టం చేశారు. గౌరవెల్లి నిర్వాసితులపై అర్ధరాత్రి పోలీసులు దాడిపై బండి సంజయ్ తీవ్రంగా విరుచుకుపడ్డారు. ” గౌరవెల్లి నిర్వాసితులు చేసిన తప్పేంది? నీ ఫేమ్ హౌస్ లో జాగా ఆడిగారా? నీ ఇంట్లో చోటు ఆడిగారా? ప్రాజెక్టు కోసం సర్వస్వం త్యాగం చేసిన నిర్వాసితులను తీవ్రవాదుల్లా చూస్టారా? అర్ధరాత్రి ఊళ్ళో జొరబడి కాళ్ళు, చేతులు, తలలు పగిలేలా, రక్తాలు కారేలా కొడతారా? ప్రాజెక్టు కోసం త్యాగం చేసిన మిడ్ మానేరు, గండి వెల్లి నిర్వాసితులకు పరిహారం ఇవ్వకుండా అన్యాయం చేస్తారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రధాని నరేంద్ర మోదీ 8 సంవత్సరాల సుపరిపాలన పూర్తయిన సందర్బంగా సేవ, గరీబ్ కళ్యాణ్ కార్యక్రమంలో భాగంగా మేడ్చల్ నియోజకవర్గంలోని జవహార్ నగర్ లో భారీ బహిరంగ సభ జరిగింది. ఈ సభకు బండి సంజయ్ తోపాటు జిల్లా అధ్యక్షులు విక్రమ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్, పార్టీ ఉపాధ్యక్షులు డాక్టర్ మల్లారెడ్డి, సీనియర్ నాయకులు కొంపల్లి మోహన్ రెడ్డి, బుద్ది శ్రీనివాస్, కూరపాటి విజయ, విఘ్నేశ్వర్, శంకర్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా బండి సంజయ్ చేసిన ప్రసంగ పూర్తి పాఠం వివరాలిలా ఉన్నాయి..

టీఆర్ఎస్ దండుపాళ్యం ముఠా దోపిడీలకు అంతు లేకుండా పోతోంది. భూములు కబ్జా చేస్తరు.. మార్కెట్ యార్డుల పేరిట దోచుకుంటున్నరు.బీజేపీ కార్యకర్తలు కరపత్రాలతో ఇంటింటికీ వెళ్లి మోదీ దూతలుగా కేంద్రం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తుంటే ప్రజలు ఆశ్చర్యపోతున్నరు. అవన్నీ కేసీఆర్ పథకాలుగా టీఆర్ఎస్ నేతలు ప్రచారం చేసుకుంటున్నారు.

కేసీఆర్ నమ్మక ద్రోహి, మూర్ఖుడు, పేదల రక్తాన్ని పీల్చుకుంటున్నడు. మోదీ పథకాలను కూడా టీఆర్ఎస్ పథకాలుగా ప్రచారం చేసుకోవడం దుర్మార్గం. ప్రధాని అవాస్ యోజన కింద ఈ దేశంలో నిలువ నీడ లేని 3 కోట్ల మంది పేదలకు ఇండ్లు నిర్మించిన మహానుభావుడు మోదీ.

కరెంట్ సౌకర్యమే లేని 18 వేల గ్రామాలకు కరెంట్ వెలుగులు అందించారు. 9 కోట్ల మందికి ఉచితంగా ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు ఇచ్చిన ఘనత మోదీదే. 80 కోట్ల మంది పేదలకు ఉచితంగా బియ్యం అందిస్తున్న ఘనత మోదీదే. స్వచ్ఛ భారత్ కింద 11 కోట్ల ఇండ్లకు టాయిలెట్లు నిర్మించారు.పల్లె ప్రక్రుతి వనాలు, రైతు వేదికలు, డంప్ యార్డులు, వైకుంఠ ధామాలుసహా గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలకు వేల కోట్ల నిధులిస్తున్న ఘనత కేంద్రానిదే…నేను సీఎంకు ఈ వేదికపై నుండి సవాల్ విసురుతున్నా….. 8 ఏళ్ల మోదీ పాలనపై చర్చకు మేం సిద్ధం….. 8 ఏళ్ల నీ నికృష్టపు, నియంత పాలనపై కేసీఆర్ సిద్ధమా?….. రాష్ట్రం, కేంద్రం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై చర్చకు సిద్ధమా?

ఆరోగ్యశ్రీ పడకేసింది. ఒక్క డబుల్ బెడ్రూం ఇల్లు నిర్మించలేదు. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాల్లేవు. ధనిక రాష్ట్రాన్ని అప్పులపాల్జేసిన మూర్ఖుడు కేసీఆర్…
ఈ రాష్ట్రంలో కుటుంబ పాలనవల్ల అప్పులపాలైంది. శ్రీలంకలో ఇదే పరిస్థితి. కుటంబ పాలనతో అక్కడి ప్రజలు అడుక్కుతింటున్నరు. పేదల నడ్డివిరిచేలా అన్ని ఛార్జీలను పెంచిన మూర్ఖుడు కేసీఆర్… 3 ఏళ్లలో 5 సార్లు బస్ ఛార్జీలు పెంచిండు.. కానీ ఆర్టీసీ కార్మికులకు 5 డీఏలు, 2 పీఆర్సీలు ఇవ్వలేదు. ఛార్జీలు పెంచి ఆర్టీసీని ప్రైవేటీకరణ చేయడానికి సీఎం కుట్ర చేస్తున్నడు.

కరెంట్ ఛార్జీలు, ఇంటిపన్ను, నల్లా పన్నులుసహా అన్ని పన్నులు పెంచి రాష్ట్ర ప్రజల ఉసురుపోసుకుంటున్న సీఎం కేసీఆర్… ధనిక రాష్ట్రాన్ని అప్పుల పాలెందుకు చేసినవని అడిగితే… కేంద్రాన్ని బదనాం చేస్తున్న వ్యక్తి కేసీఆర్.కొట్లాడి తెలంగాణ సాధించుకున్న రాష్ట్రాన్ని అప్పులు పాల్జేశారు… తెలంగాణను ఆదుకోవడానికి, నిధులివ్వడానికి కేంద్రం సిద్ధంగా ఉన్నా… రాజకీయం చేస్తూ కేంద్రాన్ని బదనాం చేస్తున్నారే తప్ప అభివ్రుద్ధికి ఏమాత్రం సహకరించడం లేదు. ప్రధాని మోదీయే స్వయంగా ఈ విషయం చెప్పారు.

17 లక్షల రేషన్ కార్డులను తొలగించి పేదల ఉసురుపోసుకుంటున్నడు. పెన్షన్లు తీసేస్తున్నడు. కొత్త పెన్షన్లు ఇవ్వడం లేదు. ప్రజలారా…. మీ ఎమ్మెల్యే వస్తే… ఎన్ని సంక్షేమ పథకాలు అమలు చేశారో… రేషన్ కార్డులు ఎందుకు తొలగించారో… ఇండ్లు ఎందుకు కట్టివ్వడం లేదో నిలదీయండి..తెలంగాణ సాధించుకున్నది కబ్జాలు, దోపిడీలు, అత్యాచారాల కోసమేనా…. వడ్ల కుప్పలపై రైతులు ఆత్మహత్యలు చేసుకునే దుస్థితి రావడానికా? తెలంగాణ వచ్చినాక ఉద్యోగాల కోసం ఆత్మహత్యలు చేసుకునే దుస్థితి వచ్చింది? ఏనాడూ ఆత్మహత్యలు చేసుకోని ఆర్టీసీ ఉద్యోగులు, ఇంటర్మీడియట్ విద్యార్థులు తెలంగాణ వచ్చినంక ఆత్మహత్య చేసుకున్నరు.

గ్లోబరీనా సంస్థ నిర్వాకం వల్ల 27 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నరు. వాళ్లు చేసిన పాపమేంది? ప్రశ్నించడానికి హైదరాబాద్ వచ్చిన తల్లిదండ్రుల కాళ్లు చేతులు విరగ్గొట్టిన మూర్ఖుడు కేసీఆర్… అన్ని సబ్జెక్టుల్లో 90 కి పైగా మార్కులొస్తే… ఒక్క సబ్జెక్టులో మాత్రం గ్లోబరీనా సాంకేతిక తప్పిదంవల్ల ఒక్క మార్కు మాత్రమే వేసి ఫెయిల్ చేస్తే… ఆత్మహత్య ప్రయత్నం చేసుకుంది.

నేను గ్లోబరీనా సంస్థ గురించి నేను మాట్లాడితే.. హైకోర్టుకు వెళ్లి నన్ను తిట్టొద్దని ఆర్డర్ తెచ్చిండు… ఎన్ని కేసులైనా వేసుకో… బండి సంజయ్ భయపడడు. కోర్టును గౌరవిస్తాం… చట్టాలను గౌరవిస్తాం… కానీ గ్లోబరీనా సంస్థను వదిలిపెట్టను. నువ్వు విచారణ చేసి మూసివేసిన గ్లోబరీనా సంస్థ బండారం బయటపెడతా….చేతగాని దద్దమ్మ సీఎం కేసీఆర్… ఫాంహౌజ్ లో పండుకోవడానికా సీఎంను చేసింది. శ్రీకాంతచారి, యాదిరెడ్డి సహా వందలాది మంది పేదలు బలిదానాలు చేసుకుంటే తెలంగాణ వచ్చింది. కేసీఆర్ కుటుంబం కోసమేనా తెలంగాణ సాధించుకుంది? కేసీఆర్ కుటుంబానికి దాసోహమైంది. బలుపెక్కి కండకావరమెక్కి పేదల ఉసురుపోసుకుంటోంది. తెల్లారిలేస్తే హత్యలు, అత్యాచారాలు జరుగుతున్నయ్. ఎక్కడ హత్య, అత్యాచారం జరిగినా ఎంఐఎం, టీఆర్ఎస్ హస్తం ఉంటోంది. హత్యలు, అత్యాచారాల కోసం రెండు పార్టీల నేతల పోటీ పడుతున్నరు. మంథని, ఖమ్మం, రామాయంపేట, నిర్మల్, కోదాడ, వనస్థలిపురం సహా రాష్ట్రంలో ఎక్కడ హత్యలు, అత్యాచారాలు జరిగినా ఆ రెండు పార్టీల భాగస్వామ్యమే ఉంది.

జూబ్లీహిల్స్ లో మైనర్ బాలికపై జరిగిన అత్యాచారం అనుకోకుండా జరిగింది కానేకాదు… పథకం ప్రకారం… కొంతమంది లుచ్చా నా కొడుకులు కసితో మైనర్ బాలికపై అత్యాచారం చేశారు. 28న ఘటన జరిగితే బీజేపీ కార్యకర్తలు స్టేషన్ ను ముట్టడించే వరకు కేసు పెట్టలేదు. నిందితులకు సిగ్గు లేకుండా స్టార్ హోటళ్లు బిర్యానీలు పెడుతున్నరు. కోవిడ్ సమయంలోనూ పేదలు, ఒక వర్గం పట్ల ఇదే వివక్ష చూపారు.
తెలంగాణలో హిందూ సమాజానికి బీజేపీ అండగా లేకపోతే హిందువుల పరిస్థితి ఏమిటో అర్ధం చేసుకోవాలి. 15 నిమిషాలు టైమిస్తే హిందువులను నరికి చంపుతామన్న ఎంఐఎం నాయకులకు టీఆర్ఎస్ నేతలు, సీఎం దాసోహమయ్యారు.

ప్రశ్నించే గొంతులను అణిచివేస్తున్నారు… గౌరవెల్లి ప్రాజెక్టు కోసం సర్వస్వం త్యాగం చేసిన నిర్వాసితులపై అర్ధరాత్రి పోలీసులు దాడులు చేసి కాళ్లు, చేతులు విరగ్గొట్టారు… ఇంతకీ వాళ్లు చేసిన తప్పేమిటి? వాళ్లేమైనా టెర్రరిస్టులా? అర్ధరాత్రి ఇండ్లల్లొకి చొరబడి రక్తం చిందేలా పోలీసులతో కొట్టిస్తారా? మిడ్ మానేరు బాధితులకు పరిహారం ఇవ్వరు.. గౌరవెల్లి బాధితులపై లాఠీ ఛార్జ్ చేస్తారా?
వాళ్లకు ఆర్ & ఆర్ కింద అందాల్సిన పరిహారం ఇవ్వాలని నిర్వాసితులు డిమాండ్ చేస్తున్నారు. వాళ్ల న్యాయమైన డిమాండ్ తీర్చకుండా ట్రయల్ రన్ చేస్తారట. నిర్వాసితులు అడ్డుకుంటారన్న ఉద్దేశంతో ఇండ్లల్లో నిద్రపోతున్న గ్రామస్థులపై పోలీసులు దాడి చేయడం ఏంటి? బలవంతంగా వందల మందిని అక్రమంగా అరెస్టు చేశారు.

ఇలాంటి నీచపు, నిక్రుష్టపు, నియంత పాలనను తరిమితరిమి కొడదాం… అన్ని పార్టీలకు అవకాశమిచ్చారు… ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇవ్వండి. పేదల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం….
మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ ….బండి సంజయ్ చేసే శ్రమలో 10 శాతం పనిచేసినా వచ్చే ఎన్నికల్లో అధికారం బీజేపీదే.ప్రజల కష్టాల్లో పాలుపంచుకుంటే జనం మన వెంటే ఉంటారనేది మర్చిపోకండివెంటనే పార్టీ సంస్థాగత కమిటీలను బలోపేతం చేద్దాం.పోలింగ్ బూత్ కమిటీలను వెంటనే నియమించి ఉద్యమిద్దాం.

మేడ్చల్ రూరల్ జిల్లా అధ్యక్షులు విక్రమ్ రెడ్డి మాట్లాడుతూ…..
మంత్రి మల్లారెడ్డి ఏనాడూ రాష్ట్ర సరిహద్దులు కూడా తెలియని లీడర్. ఆయనను ఎమ్మెల్యే అని సంబోధించడమే మేలు.బాలాజీ నగర్ డంపింగ్ యార్డ్ విషయంలో ముఖం చాటేసిన మల్లారెడ్డి. రోడ్ల విస్తరణ విషయంలో అనేక ఇబ్బందులను స్రుష్టిస్తున్నారు.

ప్రభుత్వ భూముల్లో బోర్డులు పాతడం… ఆ తరువాత తొలగించడం భూకబ్జాలకు పాల్పడటం పరిపాటిగా మారింది.బీజేపీ అధికారంలోకి వస్తే భూ కబ్జాలపై సమగ్ర విచారణ జరిపించి చర్యలు తీసుకుంటాం. శామీర్ పేట చెరువును పర్యాటక కేంద్రంగా మారుస్తానన్న హామీ ఏమైంది మంత్రిగారూ..
మంత్రి దత్తత తీసుకున్న లక్ష్మాపూర్ ను గాలికొదిలేసి నక్షలు కూడా లేకుండా చేసిన ఘనత టీఆర్ఎస్ దే.రాజకీయాలను కలుషితం చేసి వ్యాపార రంగంగా మార్చిన ఘనత మల్లారెడ్డిదే. పోలీస్, రెవిన్యూ వ్యవస్థను పూర్తిగా అవినీతి మయం చేసిన ఘనత టీఆర్ఎస్ దే.. డబ్బు అహంకారంతో ప్రవర్తించే వ్యక్తుల హవా కొంత కాలమే నడుస్తుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.పేదల గొంతుకగా బీజేపీ పనిచేస్తుంది… ఆశీర్వదించండి

LEAVE A RESPONSE