Suryaa.co.in

Telangana

బోటీ, తలకాయ, పాయ వంటి 33 రకాల వంటకాలకే పరిమితమైండు

– తెలంగాణలో ఏదో పొడిచిండట… ఇగ దేశానికి దిశా నిర్దేశం చేస్తడట
– ఇగ దేశంలో అడుగుపెట్టి ఫాంహౌజ్ నుండే దేశాన్ని పాలిస్తాడేమో
– బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ను కేంద్రం రెఫర్ చేయాలట… థూ.. నీ బతుకు చెడ
– బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్

ఈరోజు ఉట్కూర్ లో జరిగిన మీడియా సమావేశంలో పార్టీ సీనియర్ నేతలతో కలిసి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. అందులోని ముఖ్యాంశాలు…
సాధారణంగా ఏ రాజకీయ పార్టీ అయినా ప్రాంతీయ పార్టీ లేదా జాతీయ పార్టీ అయినా వాటికి సంబంధించిన వార్షికోత్సవాలు, ప్లీనరీలు జరుపుకోవడం సహజం. దీనిపై ఎవరికీ అభ్యంతరం ఉండదు. ప్లీనరీలో పార్టీ సంస్థాగత విషయాలపై చర్చించుకుంటయ్. ప్రజలకు మనమేం ఏం చేసినం. ఏం సాధించినం.. ఎన్ని హామీలు నెరవేర్చినం.. మిగిలిన హామీలు ఎట్లా నెరవేర్చాలి… ప్రజల కోసం ఇంకా ఏం చేయాలనే దానిపై చర్చించుకుంటాయి. కార్యకర్తల, నేతల అబిప్రాయాలు తెలుసుకోవాలి. కానీ ప్లీనరీలో ఇవేమీ చర్చించలేదు. దీనినిబట్టి టీఆర్ఎస్ సాధించిందేమిలేదని అర్థమైంది.

మొదటి ప్రజా సంగ్రామ యాత్రను తక్కువ అంచనా వేసిండు. సక్సెస్ అయ్యే సరికి భయం పట్టుకుంది. రెండో విడత యాత్రలో వస్తున్న ప్రజా స్పందనను చూసిన తరువాత వణుకుపుట్టి ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నరు. మాకు సంస్కారం ఉంది కాబట్టి బూతులు తిట్టడం లేదు. యాత్రను చూస్తే ఎంత భయపడుతున్నరో వాళ్ల ఆక్రోశమే చెబుతోంది. అలంపూర్ నుండి ఉట్కూర్ దాకా వస్తున్న జనం… ర్యాలీలుగా సాగుతున్న వైనం.. సభలకు వస్తున్న స్పందన మీడియాసహా అంతా చూస్తున్నరు.

ఇగ ప్లీనరీ విషయానికొస్తే… నిన్న జరిగిన టీఆర్ఎస్ ప్లీనరీ యావత్తు కేంద్రంపైన, నరేంద్రమోదీగారిని తిట్టడానికే ప్రాధాన్యమిచ్చారు.2014లో దేశం అల్లకల్లోలంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో దేశ ఆర్దిక కుదేలై తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయినటువంటి పరిస్థితుల్లో, చిప్ప పట్టుకునే స్థితిలో అధికారం చేపట్టిన నరేంద్రమోదీ ప్రపంచానికే భారత దేశాన్ని విశ్వగురువు గా నిలిపే ప్రయత్నం చేస్తున్నరు. ఇది నేనో, బీజేపో చెబుతున్న విషయం కాదు… ప్రపంచ వేదికలపైన బ్రిటన్ ప్రధాని, అమెరికా అధ్యక్షుడు, ఇజ్రాయిల్ ప్రధాని లాంటి మహామహులు మోదీ గారి పాలనను కొనియాడారు.

ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ లో ఏదో పొడిచిండట… ఇగ దేశానికి దిశా నిర్దేశం చేస్తడట. తెలంగాణ ధనిక రాష్ట్రమని కేసీఆరే చెప్పిండు. అట్లాంటిది రాష్ట్రాన్ని 4 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసి ఒక్కో
sanjay1 తలకాయపై లక్ష అప్పు ఎందుకు మోపినవ్. ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని దుస్థితి ఎందుకు వచ్చింది. ఒక్కో జిల్లాకు ఒక్కో తేదీన జీతాలేసే పరిస్థితి వచ్చింది? పెన్షనర్లకు బెన్ ఫిట్స్ కూడా ఇవ్వడం లేదంటే తెలంగాణలో ఆర్దిక పరిస్థితి ఏ విధంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. దీంతోపాటు విద్యుత్ ఛార్జీలు పెంచారు. వచ్చే నెల నుండి కరెంట్ బిల్లులు చూస్తే షాక్ కొట్టి గుండెపోటు వచ్చేలా చేస్తున్నరు. రూ.70 వేల కోట్ల డిస్కంలకు బకాయిలు పెట్టారు. ఆర్టీసీ ఛార్జీలు పెంచి జనంపై భారం మోపుతున్నరు.

తెలంగాణను అప్పుల పాల్జేసి నీ కుటుంబ ఆస్తులు వేలకు వేల కోట్లు పెంచుకుంటివి. నీ పార్టీ ఆస్తులతోపాటు నీ కుటుంబం ఎంత ఆస్తులు సంపాదించిందో కూడా వెల్లడిస్తే బాగుండేది.
పైగా రాష్ట్రాన్ని సీఎం దోచుకుతింటున్నడు. 36 వేల కోట్లతో పూర్తయ్యే కాళేశ్వరం ప్రాజెక్టును లక్షా 20 వేల కోట్లకు పెంచేసిండు. అదనంగా ఒక్క ఎకరానికి కూడా నీళ్లియ్యలే… ఇదీ ఆయన పంథా.. 1400 కోట్ల రూపాయలతో పూర్తయ్యే 69 జీవో కింద వచ్చే ప్రాజెక్టుకు పాలమూరు – రంగారెడ్డి పేరిట 70 వేల కోట్లకు పెంచి 20 శాతం కూడా పనిజేయలే. ఈ రెండింట్లో కొన్ని వేల కోట్ల రూపాయల కమీషన్లు దొబ్బి వేల కోట్లు సంపాదించిన కేసీఆర్ కుటుంబం రాష్ట్రాన్ని అథో:గతి పాల్జేసిండు. రైతులకు మాత్రం చుక్క నీరివ్వలే…
వేల కోట్లు దోచుకున్న ఘనుడు కేసీఆర్… ఆయన కేంద్రమంత్రి గా ఉన్నప్పుడే సహారా, ఈఎస్ఐ స్కాంలలో ఇరుక్కుని సీబీఐ విచారణ ఎదుర్కొన్న విషయం వాస్తవం కాదా? ఆనాడు కేసీఆర్ ను మంత్రివర్గం నుండి తొలగించాలని భావిస్తే… ప్రభుత్వం నుండి బయటకు వచ్చి కథలు చెప్పిన వాస్తవం కాదా? నీ కేబినెట్ మంత్రులపై అనేక అవినీతి ఆరోపణలున్నయ్. కోర్టుల్లో విచారణ జరుగుతోంది వాస్తవం కాదా?

8 ఏళ్లలో ఒక్క ఏడాది కూడా సెక్రటేరియట్ కు రాకుండా ఫాంహౌజ్ నుంచి ఇంటి నుంచి పాలన చేస్తున్న దేశంలోని ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్… ఇదే ఆయన కొత్త పంథా. ఇప్పటి వరకు ఇది తెలంగాణకే పరిమితమయ్యే. ఇగ దేశంలో అడుగుపెట్టి ఫాంహౌజ్ నుండే దేశాన్ని పాలిస్తాడేమో… మోదీగారు 4 గంటలు మాత్రమే నిద్రపోతూ… 18 గంటలు పనిచేస్తూ దేశాన్ని ఎట్లా అగ్రస్థానంలో నిలబెట్టాలని నిరంతం ఆలోచిస్తుండు. 70 ఏళ్లలో గత ప్రభుత్వాలు చేయలేని ఎన్నో అద్బుతాలను మోదీగారు చేసి చూపించారు. మొట్టమొదటి సారిగా దేశంలో అత్యధిక విదేశీ మారక ద్రవ్యాన్ని నిలువ చేసిన ఘనత మోదీగారిదే… కేసీఆర్ లాంటి సూడో సెక్యూలర్ వాదుల కుట్రకు బలై భారత దేశానికే రాచపుండుగా పరిణమించిన కాశ్మీర్ ను 370 ఆర్టికల్ ను ఎత్తేసి అద్భుతమైన సుందరమైన కాశ్మీరాన్ని తీర్చిదిద్దుతున్నరు మోదీగారు.

రైతుల గురించి కేసీఆర్ మాట్లాడుతున్నడు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసేందుకు పంట ధరలను విపరీతంగా పెంచేటట్లు చేసిన ఘనత మోదీగారిదే. మిర్చి, పత్తి వంటి పంటల ధరల ఇప్పటికే డబుల్ అయినయ్.2014లో వరి ఎంఎస్ పీ 1360 రూపాయలుంటే నేడు రూ.1960కి పెంచారు. కేసీఆర్ ఆనాడు యూరియా ఫ్రీగా ఇస్తానన్నడు. కానీ మళ్లా ఆ ఊసే లేదు. కానీ నరేంద్రమోదీ ప్రభుత్వం వేల కోట్లు ఖర్చు పెట్టి రైతులకు ఎరువులపై భారీ సబ్సీడీ పెంచింది… నిన్నటి కేబినెట్ లో కూడా వచ్చే ఖరీఫ్ సీజన్ కు (ఒక్క సీజన్ కు) ఎరువులపై 60 వేల 939 కోట్ల సబ్సిడీ ఇస్తూ రైతులకు అతి తక్కువ ధరలో ఎరువులు అందిస్తూ ఆదుకుంటున్న ఘనత మోదీ గారి ప్రభుత్వానిదే..

పెట్రోలు, డీజిల్ పై వ్యాట్ తగ్గించుకోమని ప్రధాని చెప్పగానే అయ్యా కొడుకులకు సుర్రుమన్నట్లుంది. అందుకే ప్లీనరీలో ఎజెండా గాలికి పోయి ప్రధానిని తిట్టడమే పనిగా పెట్టుకున్నరు. భారత దేశంలో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పెట్రోలు 10 నుండి 15 రూపాయలు తక్కువున్నయ్. రాష్ట్రంలో తగ్గించమంటే ప్రధానిపై విమర్శలు చేస్తున్నరు. లీటర్ కు రూ.30లు వ్యాట్ పేరిట దోచుకుంటున్నవ్ కదా… ఎందుకు తగ్గించవ్.. పైగా ఎందుకు కేంద్రాన్ని బదనాం చేస్తవ్.

మహబూబ్ నగర్ లో వలసలు ఆగిపోయినయట.. కేసీఆర్ నువ్వు పాలమూరు రా.. మధ్యాహ్నం ఇక్కడి నుండి బొంబాయి బస్ పోతది. క్రిష్ణాపూర్ నుండి బొంబాయి బస్ రోజూ పోతది. నిన్ను కూడా ఎక్కిస్తా రా…
ఉద్యోగాల గురించి కేసీఆర్ మాట్లాడుతూ… 2.5 లక్షల ఉద్యోగాలు భర్తీ చేశారట.. సరిగ్గా నెల కొందట 1.2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసినమని చెప్పి… ఇప్పుడు దానిని ఏకంగా డబుల్ చేస్తుండంటే ఎన్ని పచ్చి అబద్దాలు చెబుతుండో అర్ధం చేసుకోవచ్చు.

ఇగ మతమంట.. క్యాన్సర్ అంట.. ఎంఐఎం అనే క్యాన్సర్ గడ్డను నెత్తిమీద పెట్టుకుని ఊరేగుతోంది కేసీఆర్ కాదా? పచ్చి మత విద్వేషాలు రగిలిస్తూ హిందువులపై దాడులు చేయిస్తూ కత్తిపోట్లు చేయిస్తున్న పార్టీ ఎంఐఎం. మైనారిటీ సంతుష్ట విధానాలను అనుసరిస్తున్న కేసీఆర్ కు పూర్తి అధికారమిస్తే… ముస్లింలకు 20 శాతం రిజర్వేషన్లు కూడా ఇస్తాడేమో….

నీ పాలన ఎంత దుర్మార్గంగా ఉందో నిన్న మీ పార్టీ మాజీమంత్రి, ప్రస్తుత ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి చెప్పకనే చెప్పిండు. ఒక పోలీస్ అధికారిని పట్టుకుని పచ్చి బూతులు తిడతున్నడు.. పోలీసులు మీ బానిసలనుకున్నరా? నేను ఈరోజు.. పోలీసులతోపాటు అందరు అధికారులకు ఒక అప్పీల్ చేస్తున్న… ఈ ప్రభుత్వం శాశ్వతం కాదు.. మీరు నిబద్దతతో పనిచేయండి. పులిలా బతకండి… బానిసలుగా బతకాల్సిన ఖర్మ మీకు పట్టలేదు. ఇంకా ఆ టీఆర్ఎస్ నేతను బొక్కలో ఎందుకు తోయలేదు. మామూలు మనిషి అట్లా మాట్లాడితే ఒప్పకునే వాళ్లా?

కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా కోసం బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ను కేంద్రం రెఫర్ చేయాలట… థూ.. నీ బతుకు చెడ.. క్రిష్ణా వాటాలో తెలంగాణకు 575 టీఎంసీలకు గాను… 299 కు ఒఫ్పుకుని తెలంగాణకు ద్రోహం చేసింది నువ్వు కాదా…. క్రిష్ణా పరివాహక ప్రాంతం 68 శాతం ఉంటే.. తెలంగాణ వాటా 599 టీఎంసీలు. కానీ కేసీఆర్ మాత్రం 299 టీఎంసీలకే ఒప్పుకుని తీరని ద్రోహం చేసిండు. అపెక్స్ సమావేశాలకు వెళ్లకుండా అన్యాయం చేసిండు. సుప్రీంకోర్టులో కేసు వేసి ఆరేళ్లు ట్రిబ్యునల్ వేయకుండా చేసింది నువ్వు కాదా? కేంద్రం కేసును వెనక్కు తీసుకోండని పదేపదే కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర షెకావత్ అనేక సార్లు మొత్తుకున్నా…. ఆరేళ్లు జాప్యం చేసిన కేసీఆర్ .. ఇటీవల పిటీషన్ ను ఉపసంహరించుకున్నడు. క్రిష్ణా ట్రిబ్యునల్ ఏర్పాటుపై కేంద్రం ద్రుష్టి సారించింది.

అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని తిరగరాస్తానన్న మూర్ఖుడు కేసీఆర్ కు భారత రాజ్యాంగం గురించి మాట్లాడే అర్హతే లేదు. భారత రాజ్యాంగం ద్వారా నీ అక్రమాలను, అవినీతిని, అరాచకాలను బయటపెట్టి నీ పీఠాన్ని కూకటి వేళ్లతో బీజేపీ పెకలించవేయబోతుందని తెలిసి… మళ్లా రాజ్యాంగం గురించి మాట్లాడం సిగ్గు చేటు..

మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలంటున్నవ్… కేసీఆరే మహిళా ద్రోహి… మొదటి దఫా కేబినెట్ లో ఒక్క మహిళను కూడా మంత్రిని చేయకుండా మహిళను మోసం చేసిన దుర్ముర్గుడు కేసీఆర్… మహిళా గవర్నర్ కు కనీసం గౌరవం ఇవ్వని కుసంస్కారి ఆయన మహిళా రిజర్వేషన్లు గురించి మాట్లాడటం దయ్యాలు వేదాలు వల్లించినట్లుంది. మహిళలపై టీఆర్ఎస్ పాలనలో ఏ విధంగా అత్యాచారాలు, వేధింపులు జరుగుతున్నయో నిత్యం చూస్తూనే ఉన్నయ్. టీఆర్ఎసోళ్లను చూస్తే మహిళలు భయపడే దుస్థితి. అలాంటి పరిస్థితుల్లో కేసీఆర్ మహిళల గురించి మాట్లాడటం సిగ్గు చేటు. బీజేపీలో కచ్చితంగా మహిళలకు వాటా ఉంటుంది. మోదీ గారి ప్రభుత్వంలో మహిళలకు అత్యం ఎక్కువ రిజర్వేషన్లు అమలు చేస్తున్న ఘనత నరేంద్రమోదీ ప్రభుత్వానిదే… పెద్ద ఎత్తున మహిళలను గవర్నర్లుగా, సీఎంలుగా, అత్యధిక సంఖ్యలో కేంద్ర మంత్రులుగా చేసిన ఘనత మోదీదే..

నిన్న ప్లీనరీకి సంబంధించి నేను 21 ప్రశ్నలను సంధించిన. వాటికి ఆన్సర్ చెప్పకపోతే 11 తీర్మానాలను చేసింది. అవన్నీ పచ్చి అబద్దాలు.. దగాకోరు తీర్మానాలవి. ఈ సీఎంకు గింత కూడా సిగ్గు లేదు. మొదటి తీర్మానం వరి ధాన్యాన్ని కేంద్రం కొనకపోయినా… రాష్ట్రమే కొంటుంది డబ్బా కొట్టుకున్నడు. సిగ్గుందా… మొన్నటికి మొన్న వడ్లు కొనాలని కేంద్రానికి లేఖ రాసింది నువ్వు కాదా…. అయినా కేంద్రం కొనబోము అని ఎన్నడైనా చెప్పిందా? కేంద్రం ధాన్యం కొనడం లేదని.. రాష్ట్రమే కొనుగోలు చేస్తున్నందుకు అభినందిస్తూ ప్లీనరీలో తీర్మానం ప్రవేశపెట్టడం సిగ్గు చేటు. వడ్లు కొనేది కేంద్రమే. ప్రతి పైసా ఖర్చు పెట్టేది కేంద్రమే. ఈనెల 13న కూడా సివిల్ సప్లయిస్ శాఖ ఈనెల 13న తెలంగాణలో 60 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లను కొనుగోలు చేయాలని కోరుతూ కేంద్రానికి లేఖ రాసింది నిజం కాదా? కేంద్రం ఒప్పుకున్న మాట వాస్తవం కాదా? అయినా సిగ్గు లేకుండా కేంద్రం కొనడమే లేదని చెప్పడం దుర్మార్గం…. నిన్ను చూసి జనం నవ్వుకుంటున్నరు.

కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలంటున్నవ్ కదా… కేంద్రంలో ఏకంగా 27 మంది బీసీలకు కేంద్ర మంత్రి పదవులిచ్చిన ఘనత నరేంద్రమోదీదే.. ఈ దేశాన్ని ఏలుతున్న మోదీ బీసీ. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న నేను బీసీని. మరి నువ్వు? కనీసం నీ పార్టీ అధ్యక్షుడినైనా బీసీని చేయగలవా? నీ కేబినెట్ లో ఎంతమంది బీసీలున్నరు. బీసీల ఆత్మగౌరవ భవనాల సంగతేమైంది? ఎంబీసీల పరిస్థితి ఏమైంది?

ఇగ TRS అంట దేశంలో భారత రాష్ట్ర సమితి (BRS)గా అవతరిస్తదట… బీఆర్ఎస్ కాకుండా ఏఆర్ఎస్ (అంతర్జాతీయ రాష్ట్ర సమితి) పెట్టుకో… తెలంగాణ ప్రజలే మీకు VRS( valentery retirement service)ఇస్తున్నరు. ఈ విషయం మీకూ తెలుసు. అందుకే ఏదో ఒక పనీపాటా ఉండాలి కదా అని … మళ్లో కొత్త దుకాణం పెట్టుకున్నవ్. ఇంతకుముందు దేశమంతా తిరిగి 3 rd ఫ్రంట్ కట్టాలని దేశమంతా తిరిగితే నీ tent కిందికి ఎవడు రాకపాయే. ఇప్పడు సొంత దుకాణం పేరుతో మళ్లా కొత్త డ్రామాలు షురూ చేస్తున్నవ్… తెలంగాణ ప్రజలకు నీ కథలన్నీ తెలుసు..

శెభాష్ KCR… మొత్తానికి కేంద్ర ప్రభుత్వ నిధులతో తెలంగాణ గ్రామాలు దేశం లనే టాప్ 10 ల ఉన్నాయని ఒప్పు కున్నారు. అందులో 3 గ్రామాలు కరీంనగర్ పార్లమెంటు కు చెందినవి. మరో 4 గ్రామాలు నిజామాబాద్ పార్లమెంటు కు చెందినవి. ఇగ మీ పార్టీ వాళ్లు పీకిందేమిటి? కేంద్ర్రం ప్రకటించిన 10 ఆదర్శ గ్రామాలకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని నిధులిచ్చిందో కేసీఆర్ జవాబు చెప్పాలి..

మహబూబ్ నగర్ వలసలు ఆగి పోయినవి అని చెప్తున్నారు కదా….ఇయ్యాల లేకుంటే రేపు మద్యాహ్నం 12 గంటలకు నారాయణ పేట కు రా…..నిన్ను బాంబే బస్సు ఎక్కిస్తా…
భారత దేశం హైందవ దేశం. హిందుత్వమే ఈ అఖండ భారత దేశాన్ని కాపాడింది. మాది బరాబర్ హిందుత్వ ఎజెండానే. భారత్ ను హిందూ రాజ్యంగా మార్చడమే మా లక్ష్యం.

ప్లీనరీలో కేసీఆర్… ఆయ కొడుకుకు NTR పేరు పెట్టుకొని NTRను నమ్మించి టికెట్ తీసుకొని గెలిచినండు. ఆ తరువాత చంద్రబాబుతో జత కట్టి NTR ను వెన్నుపోటు పొడిచినవ్..వైస్రాయ్ హోటల్ ఎదుట NTRపై చెప్పులేసినప్పుడు నువ్వు కూడా ఉంటివి కదా… ఆనాడు నువ్వు ఉన్నవా? లేవా? చెప్పాలి… అలాంటి నీకు NTR పేరు ఎత్తే అర్హత ఉందా? ఖమ్మం టౌన్ లో కమ్మ యువకుడి సూసైడ్ చేయడం వెనుక టీఆర్ఎస్ హస్తం ఉందని తెలిసి తెలంగాణలోని కమ్మ సామాజికవర్గం తీవ్ర వ్యతిరేకంగా ఉంది. మళ్లీ ఆ సామాజికవర్గాన్ని నమ్మించి మోసం చేయడానికే ఎన్టీఆర్ స్తుతి చేస్తుండు…

పట్టాభిషేకం కట్టే ముందు గతంలో రాజులు గడి కట్టేవారు. ఇఫ్పుడు కేసీఆర్ కొడుకుకు సీఎం పట్టాభిషేకం చేసి, బిడ్డకు దేశాన్ని అప్పగించేందుకు ఈ తతంగమంతా చేస్తుండు. పీకేతో కలిసి డ్రామా చేస్తుండు. కాంగ్రెస్ పార్టీ నాయకుడు పీకే కాబోతున్నడని ఆ పార్టీ ఇన్నాళ్లూ చెప్పింది. టీఆర్ఎస్ కు స్ట్రాటజీ టీం బాధ్యతలు అప్పగించినమని ఆ పార్టీయే ఒప్పుకుంది. దీనినిబట్టి కాంగ్రెస్ – టీఆర్ఎస్ ఒక్కటేనని అర్ధమైంది. మీరెన్ని కథలు చెప్పినా.. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్- కాంగ్రెస్ కలిసి పోటీ చేయడం ఖాయం. బీజేపీని ఎదుర్కోవడానికి అన్ని పార్టీలు కుమ్కక్కైనయ్. బీజేపీ సింహం. ఇలాంటి గుంట నక్క పార్టీలు ఎన్ని వచ్చినా ఏమీ చేయలేం.

మత సామరస్యం గురించి మాట్లాడుతున్న కేసీఆర్ ఉట్కూర్, బైంసాలో హిందూ యువకులపై థర్డ్ డిగ్రీ ప్రయోగించడంతోపాటు వందల కొద్ది కేసులు పెట్టి పీడీ యాక్ట్ పెట్టింది కేసీఆర్ ప్రభుత్వమే.
కేసీఆర్ కు నిజంగా చిత్తుశుద్ది ఉంటే… ప్లీనరీలో రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది? కేంద్రం తెలంగాణకు ఎన్ని నిధులిస్తోంది… వాటితో ఏయే అభివ్రుద్ది పథకాలు చేపట్టామో చెబితే బాగుండేది. కానీ బీజేపీకి పేరుస్తందనే భయంతో…రాష్ట్రం ఏమీ చేయలేకపోయిందని తెలిసీ… కేంద్రాన్ని బదనాం చేసే కుట్రకు తెరదీసిండు. ప్లీనరీ మొత్తం బోటీ, తలకాయ, పాయ వంటి 33 రకాల వంటకాలకే పరిమితమైండు. చర్చ మొత్తం వంటల మీదే.
కేసీఆర్ లక్కీ నెంబర్ 6. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ కు వచ్చే సీట్లు కూడా 6 (ఆరే). నువ్వెన్ని చేసినా బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం.

LEAVE A RESPONSE