-విఫలమేనంటున్న విద్యార్ధులు
-సఫలమయ్యాయంటున్న సర్కారు
బాసర ట్రిపుల్ ఐటీ చర్చల్లో గందరగోళం నెలకొంది. విద్యార్థులతో చర్చలు సఫలమయ్యాయని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వెల్లడించారు. సోమవారం నుంచి విద్యార్థులు తరగతలకు హజరవుతారని మంత్రి ప్రకటించారు. మరోవైపు అధికారులతో చర్చలు విఫలమని ట్రిపుల్ ఐటీ విద్యార్థులు చెబుతున్నారు. ప్రభుత్వం తమ డిమాండ్లను నెరవేర్చలేదని అంటున్నారు. వర్షంలోనే విద్యార్థుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. డిమాండ్లు పరిష్కారమయ్యేంత వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని విద్యార్థులు స్పష్టం చేశారు.
12 డిమాండ్లలో మౌలిక వసతుల కల్పన త్వరలోనే పూర్తి చేస్తామని ఉన్న విద్యామండలి వైస్ చైర్మన్ వెంకంట రమణ తెలిపారు. కంప్యూటర్లు, ల్యాబ్‌లో టెక్నికల్ బుక్స్ 15 రోజుల్లో కల్పిస్తామన్నారు. అలాగే ఐసీటీ ప్రాతిపదికన అకాడమికి రిసోర్సెస్, ప్యాకల్టీ నియామకం కూడా చేపడుతామని హామీ ఇచ్చారు. విద్యార్థులకు డిజిటల్ క్లాసులు చేపడుతామననారు. ఐసీటీ బేసెడ్ ఎడ్యుకేషన్‌ను కల్పిస్తామని చెప్పారు.
‘పీయూసీ బ్లాక్స్, హస్టల్‌ను 15 రోజుల్లో పునర్నిర్మిస్తాం. లైబ్రరీలో అదనపు సదుపాయాలు కల్పిస్తాం. ఇంటర్నెట్ , ఎలక్ట్రికల్, ప్లంబింగ్ సౌకర్యాలను కల్పిస్తాం. మెస్‌ల నిర్వహణ, క్యాంటీన్ల నిర్వహణలో గుత్తాధిపత్యం తగ్గించాలని విద్యార్థులు కోరారు. అది చేస్తా చేస్తాం. 12 డిమాండ్లలలో ఎనిమిది డిమాండ్లను 15 రోజుల్లో పూర్తి చేస్తాం. ఆందోళనను విరమించి సోమవారం నుండి క్లాసులకు అటెండ్ అవుతారని నమ్ముతున్నాం. గంట పాటు విద్యార్థులతో జరిగిన చర్చల్లో అన్ని డిమాండ్ల పై మాట్లాడాం’ అని తెలిపారు.
మరోవైపు రాష్ట్రంలోని ట్రిపుల్‌ఐటీ ఆందోళనలతో అట్టుడుకుతోంది. తమ డిమాండ్లు పరిష్కరించే వరకు వెనుకడుగు వేయమంటూ ట్రిపుల్‌ఐటీ విద్యార్థులు ఆందోళన కొనసాగించారు. విద్యార్థులంతా ఒకేమాటపై నిలబడి, మూకుమ్మడిగా ఆందోళనను కొనసాగిస్తున్నారు. దీనితో సచివులు నిర్వహించిన చర్చలు సఫలమా? విఫలమా? అన్న సందేహాలు తెరపైకొచ్చాయి.