మంగళగిరి: ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా జస్టిస్ బట్టు దేవానంద్ నియమితులయ్యారు. అయితే, జస్టిస్ బట్టు దేవానంద్ ప్రస్తుతం మద్రాస్ హైకోర్టులో అదనపు న్యాయమూర్తి గా ఉన్నారు. బట్టును ఏపీకి బదిలీ చేయాలన్న సుప్రీం కొలీజియం నిర్ణయానికి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదం తెలిపారు.
ఆయన గతంలో కూడా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు. 2023లో ఏపీ నుంచి మద్రాసుకు బదిలీ కాగా.. ప్రస్తుతం ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఏపీతో పాటు మరిన్ని రాష్ట్రాలకు కొత్త సీజేఐలు నియమించబడ్డారు. తెలంగాణ హైకోర్టు సీజేగా అపరేష్ కుమార్ సింగ్, త్రిపుర హైకోర్టు సీజేగా ఎంఎస్ రామచంద్రరావు, రాజస్థాన్ హైకోర్టు సీజేగా కేఆర్ శ్రీరామ్ నియమితులయ్యారు.
గొప్ప న్యాయమూర్తిగా కన్నా.. మంచి న్యాయమూర్తిగా పేరు తెచ్చుకుంటానని జస్టిస్ బట్టు దేవానంద్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులైన సందర్భంగా కృష్ణా జిల్లా గుడివాడలో ఆయనను ఘనంగా సత్కరించారు.