అమరావతి : 2024-25 బడ్జెట్ లో బీసీ సంక్షేమ శాఖకు రూ. 39 వేల కోట్లు కేటాయించడంపై బీసీ సామాజిక వర్గం హర్షం వ్యక్తంచేస్తోంది. ఈ మేరకు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవితను బీసీ సంఘ నేతలు ధన్యవాదాలు తెలిపారు.
ఈ మేరకు అమరావతిలోని వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో మంత్రి క్యాంపు కార్యాలయంలో సోమవారం ఆమెను కలిసి దుశ్శాలువాతో సత్కరించారు. నిధుల కేటాయింపునకు సహకరించిన సీఎం చంద్రబాబునాయుడుకు, రాష్ట్ర ఐటీ, మానవరుల శాఖ మంత్రి నారా లోకేశ్ కు, రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ కు, బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర వడ్డెర కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవళ్ల మురళి, టీడీపీ సత్యసాయి జిలా అధ్యక్షులు కుళ్లకుంట వడ్డె అంజనప్ప, వడ్డెర సంఘ జిల్లా అధ్యక్షులు మల్లెల జయరామ్, టీడీపీ బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి బి.రమేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.