Suryaa.co.in

Andhra Pradesh

రూ.75,760 కోట్లు దారిమళ్లించిన బిసి ద్రోహి జగన్మోహన్ రెడ్డి

ఉద్యోగం వచ్చేవరకు యువగళం నిధికింద యువతకు రూ.3వేల రూపాయల పెన్షన్ ఇస్తాం
యువగళం పాదయాత్రలో టీడీపీ ప్రధాన కార్యదర్శి లోకేష్

నారా లోకేష్ ను కలిసిన వావిలేటిపాడు గ్రామస్తులు
• నెల్లూరు రూరల్ నియోజకవర్గం, వావిలేటిపాడు 12వ డివిజన్ గ్రామస్తులు నారా లోకేష్ ను కలిసి వినతిపత్రం అందించారు.
• నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా మా గ్రామంలో 2,723 ప్లాట్లు మంజూరు చేశారు.
• నివర్ తుఫాన్ సమయంలో మా గ్రామంలోని లే అవుట్ జలమయమైంది. నివాసయోగ్యానికి పనికిరాని స్థలాలు ఇచ్చారు.
• కనీసం ఇప్పటి వరకూ మౌలిక వసతులు కూడా కల్పించలేదు. వర్షాకాలం వస్తే ఇబ్బందులు పడాల్సి వస్తోంది.
• స్కూల్స్, హాస్పిటల్స్, పార్కులు లాంటి ప్రయోజనాలకు సరిపడ స్థలాలు కేటాయిస్తే భవిష్యత్తులో ఇబ్బందులు ఉండవు.

నారా లోకేష్ మాట్లాడుతూ…
పేదవాడికి ఇచ్చే సెంటు పట్టాలను సైతం వైసిపి దొంగలు ఆదాయవనరుగా మార్చుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా కొండలు, గుట్టలు, వాగులు, వంకల్లో పనికిరాని స్థలాలు అంటగట్టి రూ.7వేల కోట్లు దోచుకున్నారు. పనికి రాని స్థలాలు ఇచ్చి, ఇల్లు కట్టుకోకుంటే స్థలం రద్దు చేస్తామని బెదిరిస్తున్నారు. ఇల్లు కట్టుకోలేదన్న సాకుతో రాష్ట్రవ్యాప్తంగా 3లక్షలమందికి కేటాయించిన స్థలాలను రద్దుచేశారు.
జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాలకోసం రూ.33వేల కోట్లు ఖర్చవుతుందని కేంద్రానికి లేఖరాసిన ముఖ్యమంత్రి, ఇప్పటివరకు మౌలిక సదుపాయాలపై ఒక్క రూపాయి ఖర్చుచేయలేదు. టిడిపి అధికారంలోకి రాగానే ఇల్లు లేని పేదలందరికీ పక్కాగృహాలు నిర్మించి ఇస్తాం. పేదలు నివసించే గృహసముదాయాల్లో పూర్తి మౌలిక సదుపాయాలు కల్పిస్తాం.

నారా లోకేష్ ను కలిసిన ఆకుతోట గ్రామస్తులు :
• నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి చెందిన ఆకుతోట గ్రామస్తులు నారా లోకేష్ ను కలిసి వినతిపత్రం అందించారు.
• మా గ్రామంలో 800 నిరుపేద కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి.
• గ్రామంలో ప్రాథమిక పాఠశాల లేదు. 3.5 కి.మీ దూరంగా ఉన్న ధనలక్ష్మీపురం వెళ్లి చదువుకోవాలి.
• ఆకుతోట నుండి ధనలక్ష్మీపురం వెళ్లే రహదారి రద్దీగా ఉంది.
• రహదారి రద్దీగా ఉండటంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి.
• పిల్లల్ని స్కూలుకు పంపించాలంటే ఆందోళనగా ఉంది
• టీడీపీ అధికారంలోకి వచ్చాక ప్రాథమిక పాఠశాల మంజూరు చేసి పేద పిల్లలకు చదువుకునే అవకాశం కల్పించాలి.

నారా లోకేష్ మాట్లాడుతూ…
అందరికీ విద్య అనేది ప్రాథమిక హక్కు…స్కూళ్ల విలీనంతో జగన్ పేదలకు విద్యను దూరం చేస్తున్నారు. సంస్కరణల పేరుతో విద్యను నిర్వీర్యం చేస్తున్నారు. నాడు-నేడు పేరుతో వేలకోట్లు దోచుకోవడం తప్ప విద్యాప్రమాణాల మెరుగుదలకు ఎటువంటి నిర్మాణాత్మక చర్యలు తీసుకోవడం లేదు. టిడిపి అధికారంలోకి వచ్చాక ఆకుతోటలో ప్రాథమిక పాఠశాల ఏర్పాటుచేస్తాం. రాష్ట్రవ్యాప్తంగా పాడైపోయిన రహదార్లను యుద్ధప్రాతిపదికన పునర్నిర్మిస్తాం.

నారా లోకేష్ ను కలిసిన నెల్లూరు రూరల్ నియోజకవర్గ బీసీలు
నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి చెందిన బీసీ ప్రతినిధులు వడ్డెపాలెం నారాయణ మెడికల్ కాలేజి జంక్షన్ లో నారా లోకేష్ ను కలిసి వినతి పత్రం అందించారు.
వైసీపీ అధికారంలోకి వచ్చాక బీసీలు దగాకు గురయ్యారు.
• బీసీలకు న్యాయం చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్ మా అభివృద్ధిని పట్టించుకోవడం లేదు.
• చదువుకున్న యువతకు ఉద్యోగాలు లేవు.
• యేటా జాబ్ నోటిఫికేషన్ ఇస్తానని జగన్ పాదయాత్రలో హామీ ఇచ్చారు…నాలుగేళ్లలో కనీసం ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు.
• నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగాయి.
• బీసీ సంక్షేమ హాస్టళ్లను నిర్వీర్యం చేశారు.
• బీసీ కులవృత్తుల వారికి పనిముట్లు అందించడం లేదు.
• ప్రభుత్వ తప్పులను ప్రశ్నిస్తే గూండాలు, రౌడీలతో మా గొంతునొక్కుతున్నారు.

నారా లోకేష్ మాట్లాడుతూ…
జగన్ అధికారంలోకి వచ్చాక కులానికొక కుర్చీలేని కార్పొరేషన్ ఏర్పాటు చేయడం తప్ప బీసీలకు ఒరిగించేమీ లేదు. బిసిలకు చెందాల్సిన రూ.75,760 కోట్లు దారిమళ్లించిన బిసి ద్రోహి జగన్మోహన్ రెడ్డి. అన్యాయాలను ప్రశ్నించిన బిసిలపై దాడులు చేస్తూ గొంతునొక్కాలని చూస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా బిసిలపై 26వేలకు పైగా తప్పుడు కేసులు నమోదుచేశారు.

టిడిపి అధికారంలోకి రాగానే బిసిల రక్షణకు ప్రత్యేక చట్టం తెస్తాం. ఆదరణ పథకాన్ని పునరుద్దరించి కులవృత్తులు చేసుకునే వారికి 90శాతం సబ్సిడీపై పనిముట్లు అందజేస్తాం. ప్రతిఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేసి ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీచేస్తాం. పెద్దఎత్తున పరిశ్రమలు రప్పించి ఉద్యోగావకాశాలు కల్పిస్తాం, ఉద్యోగం వచ్చేవరకు యువగళం నిధికింద యువతకు రూ.3వేల రూపాయల పెన్షన్ ఇస్తాం.

LEAVE A RESPONSE