Suryaa.co.in

Andhra Pradesh

జగన్ రెడ్డి ప్యాలెస్ గేటు బయట బీసీలు పడిగాపులు

– చంద్రబాబు క్యాబినెట్ సమావేశంలో చంద్రబాబు చుట్టూ బీసీలే
• జగన్ చుట్టూ ఎవరుంటారో మీ అందరికీ తెలుసు
– గన్నవరంలో బీసీ నాయకుడిపై దాడి, వాహనాన్ని తగులబెట్టింది వైసీపీ వాళ్లే.
– శ్రీకాళహస్తి నియోజకవర్గం బండారుపల్లిలో వన్యకుల క్షత్రియులతో యువనేత నారా లోకేష్ ముఖాముఖి

• టీడీపీ అధికారంలోకి వచ్చాక బిసి కార్పొరేషన్లను పునర్నిర్మాణం చేస్తాం.
• ఆర్థికంగా మిమ్మల్ని ముందుకు తీసుకెళ్లేలా చర్యలు తీసుకుంటాం.
• వైసీపీ పాలనలో మీ కార్పొరేషన్ కు చైర్మన్ ఎవరో ఎవరికీ తెలియని పరిస్థితి ఉంది.
• కార్పొరేషన్ చైర్మన్లకు కూర్చునేందుకు కార్యాలయం లేదు, కుర్చీలు లేవు.
• రాజకీయంగా మిమ్మల్ని ఇంకా ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. గతంలో చేశాం…భవిష్యత్తులోనూ చేస్తాం.
• టిడిపి హయాంలో వన్యకుల క్షత్రియులకు కమ్యూనిటీ భవనాలు నిర్మించాం. వన్యకుల క్షత్రియులకు కార్పొరేషన్ ఏర్పాటు చేసి, నిధులు ఇచ్చింది చంద్రబాబు.
• టీడీపీలో పదవులు అనుభవించిన వాళ్లు పార్టీని వదిలి వెళ్లిపోయి..మాపై విమర్శలు చేయడం అన్యాయం.
• 22రోజుల క్రితం నా పక్కన కూర్చున్న వ్యక్తి నేడు జగన్ రెడ్డి దగ్గరకు వెళ్లాడు. జగన్ రెడ్డి నాలా అతన్ని పక్కన కూర్చోబెట్టుకోగలడా?
• ఈ 22రోజుల్లో జగన్ రెడ్డి వన్యకుల క్షత్రియులకు ఏం ఒరగబెట్టాడు? కనీసం ఒక్క లోన్ అయినా ఇచ్చాడా?
• టిడిపి అధికారంలోకి వచ్చాక సత్యపాల్ కమిటీ నివేదికను ఆధారంగా చేసుకుని మీ సమస్యను పరిష్కరిస్తాం.
• మీ పథకాలు రద్దు చేసిన వారిని మీరు నిలదీసి అడగండి…పోరాడండి. మీకు టీడీపీ అన్ని వేళలా అండగా ఉంటుంది.
• వన్యకుల క్షత్రియుల గురించి ఈరోజు జగన్ రెడ్డి ఆలోచిస్తున్నాడంటే దానికి కారణం టీడీపీ.
• నిన్నటి వరకు నాతో ఉన్న వ్యక్తికి జగన్ రెడ్డి వైసీపీ కండువా కప్పి ఎమ్మెల్సీ ఇచ్చారంటే..జగన్ భయపడుతున్నాడని అర్థమైంది.
• ఎన్టీఆర్ బీసీలకు 24శాతం రిజర్వేషన్ ఇస్తే..చంద్రబాబు దాన్ని 34 శాతానికి పెంచారు. చంద్రబాబు క్యాబినెట్ సమావేశంలో చంద్రబాబు చుట్టూ బీసీలే ఉంటారు.
• జగన్ చుట్టూ ఎవరుంటారో మీ అందరికీ తెలుసు. ఏ సామాజికవర్గమైనా కోరుకునేది ఆత్మగౌరవంగా ఉండాలనే.
• వన్యకుల క్షత్రియులను ఆర్థికంగా ముందుకు తీసుకురావాలని చంద్రబాబు ఆలోచిస్తున్నారు.
• నియోజకవర్గం, పార్లమెంట్ ను ఒక యూనిట్ గా తీసుకుని పదవులు కేటాయిస్తాం.
• కొన్ని జిల్లాల్లో జనాభా తక్కువ, కొన్ని చోట్ల ఎక్కువ ఉంటారు. అక్కడ జనాభా ప్రాతిపదికన పదవులు ఇస్తాం.
• రాష్ట్ర కమిటీ, పదవుల్లోనూ దామాషా ప్రాతిపదికన కేటాయిస్తాం. ఏపీలో బీసీల పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది.
• జగన్ రెడ్డి ప్యాలెస్ గేటు బయట బీసీలు పడిగాపులు పడుతున్నారు. మిమ్మల్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లాలనే దృఢ సంకల్పంతో ఉన్నాం…అమలు చేస్తాం.
• టీడీపీ అధికారంలోకి వచ్చాక పదవులు ఇవ్వడంతో పాటు ఆర్థికంగా మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తాం.
• టీడీపీ హయంలో టీటీడీ చైర్మన్, తుడా చైర్మన్, మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ కూడా బీసీలకే మేం ఇచ్చాం. ఇంకా బీసీల్లో పేదరికం అధికంగా కనిపిస్తోంది.
• ఉపకులాల వారీగా చూస్తే వన్యకుల క్షత్రియుల్లో సామాజికవర్గంలో పేదరికం కనిపిస్తోంది. నామినేటెడ్ పదవుల్లో మీకు ప్రాధాన్యత కల్పించడం నా బాధ్యత.
• జగన్ రెడ్డి కూతుర్లు విదేశాల్లో చదువుకోవాలి…బడుగు, బలహీన వర్గాలకు చెందిన పిల్లలు మాత్రం చదువుకోకూడదా?
• గతంలో ప్రభుత్వాలు మారినా సంక్షేమ పథకాలు, కార్యక్రమాలను మార్చలేదు. జగన్ రెడ్డి నిర్మించడాన్ని పక్కన బెట్టి..కూల్చే పనులు మాత్రమే చేస్తున్నాడు.
• బీసీలకు సామాజిక అన్యాయం చేస్తున్నాడు..దీన్ని మీరు అర్థం చేసుకోవాలి. నా పాదయాత్రకు వచ్చిన మహిళలంతా ఉద్యోగాలు కల్పించాలని కోరుతున్నారు.
• మద్యపాన నిషేధం చేయాలని వేడుకుంటున్నారు.
• నిరుద్యోగ సమస్య పోవాలంటే ప్రైవేటు రంగంలో పెట్టుబడులు, ప్రభుత్వ ఉద్యోగాలు, స్వయం ఉపాధి అవకాశాలను పెంపొందించాలి.
• జగన్ రెడ్డి పాలనకంటే మెరుగైన విధంగా ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కల్పిస్తాం.
• టిడిపి అధికారంలోకి వచ్చాక బీసీ కార్పొరేషన్ ను మరింత శక్తివంతంగా మారుస్తాం..స్వయం ఉపాధి అవకాశాలు కల్పిస్తాం.
• గన్నవరంలో బీసీ నాయకుడిపై దాడి, వాహనాన్ని తగులబెట్టింది వైసీపీ వాళ్లే.
• తిరిగి మా బీసీ నాయకుడిపైనే వైసీపీ వాళ్లు హత్యాయత్నం, ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టారు. ఇదేనా జగన్ రెడ్డికి బీసీల పట్ల ఉన్న చిత్తశుద్ధి?
• వైసీపీ అధికారంలోకి వచ్చాక 2,600మంది బీసీలపై అక్రమ కేసులు పెట్టారు.
• అనంతపురంలోనే 2వేల మందిపైనే కేసులు పెట్టారని నిమ్మల కిష్టప్ప చెప్పారు.
• ఉభయ గోదావరి జిల్లాలోనూ ఇదే పరిస్థితి.
• మహిళలకు 45ఏళ్లకే పెన్షన్, మద్యపాన నిషేధం, దిశ చట్టం పేర్లతో జగన్ రెడ్డి మోసం చేస్తున్నాడు.
• 901మంది మహిళలపై అత్యాచారాలు జరిగినా జగన్ రెడ్డి ఏ చర్యలూ తీసుకోలేదు.
• 52వేల మంది మహిళలపై వైసీపీ పాలనలో వేధింపులు, అఘాయిత్యాలు, నేరాలు జరిగాయని కేంద్రం నివేదికలు చెబుతున్నాయి.
• టిడిపి అధికారంలోకి వచ్చాక గంజాయి, డ్రగ్స్, మద్యపానం నిషేధానికి పూర్తిగా చర్యలు తీసుకుంటాం.
• రేణిగుంటలో వన్యకుల క్షత్రియులకు 5ఎకరాల భూమిని అధికారంలోకి వచ్చాక కేటాయిస్తాం.
• వన్యకుల క్షత్రియులను ఎంబీసీ లోకి చేర్చే అంశాన్ని సత్యపాల్ కమిటీ రిపోర్టును ఆధారంగా చేసుకుని మీ కోరికను నెరవేరుస్తాం.
• శ్రీకాళహస్తి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాలేజీలో 2వేల మంది విద్యార్థులకు సర్టిఫికెట్లు నిలిపేశారు.
• టిడిపి అధికారంలోకి వచ్చిన 3నెలల్లో సర్టిఫికెట్లు ఇచ్చేస్తాం. ఆ కాలేజీని ప్రక్షాళన చేస్తాం.
• నేను మంత్రిగా ఉన్నప్పుడు 25వేల కిలోమీటర్ల సీసీ రోడ్లు, లక్షలాది ఎల్.ఈ.డీ లైట్లు వేశాం.
• నేడు వైసీపీ వాళ్లంతా మనం వేసిన రోడ్లు మీద, మనం వేసిన లైట్ల వెలుతురులో నడుస్తున్నారు.
• వైసీపీ పాలనలో వ్యవసాయరంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది.
• వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి కోర్టులో దొంగతనం చేసి సీబీఐ గొడవల్లో చిక్కుకుని రైతుల సంక్షేమాన్ని గాలికొదిలేశారు.
• టీడీపీ పాలనలో అన్ని ప్రాంతాల్లో వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాలను ప్రోత్సహించారు.
• నేడు గోపాల మిత్రలకు వేతనాలు కూడా జగన్ రెడ్డి ఇవ్వడం లేదు.
• పశువులకు వైసీపీ పాలనలో వైద్యం ఖర్చులు పెరిగిపోయాయి.
• రైతాంగాన్ని మేం పూర్తిస్థాయిలో ఆదుకుంటాం.

LEAVE A RESPONSE