Suryaa.co.in

Andhra Pradesh

చంద్రబాబుతోనే బీసీల అభ్యున్నతి

రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత

అమరావతి : సీఎం చంద్రబాబుతోనే వెనుకబడిన తరగతుల అభ్యున్నతికి సాధ్యమని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. తాడేపల్లిలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో మంత్రి సవితను బుధవారం నాయీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివం మర్యాదపూర్వకంగా కలిశారు.

కార్పొరేషన్ చైర్మన్ గా నియమించినందుకు సీఎం చంద్రబాబుకు, మంత్రి లోకేశ్ తో పాటు బీసీ సంక్షేమశాఖ మంత్రి సవితకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా, పార్టీ అభివృద్ధితో పాటు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లో తీసుకెళ్లతానని తెలిపారు. నాయీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ గా నియమితులైన రుద్రకోటి సదాశివం ను మంత్రి సవిత అభినందించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, గత అయిదేళ్ల కాలంలో అప్పటి ప్రభుత్వం నుంచి సహకారం లేకపోవడంతో, బీసీలు తీవ్ర ఇబ్బందుల పాలయ్యారన్నారు. నా ఎస్సీలు…నా ఎస్టీలు…నా బీసీలు…అంటూ జగన్ అన్ని వర్గాల వారిని పట్టించుకోవడం మానేశారన్నారు. బీసీ కార్పొరేషన్ ను పూర్తిగా నిర్వీర్యం చేశారన్నారు. కార్పొరేషన్ నిధులను దారిపట్టించి, బీసీలకు స్వయం ఉపాధికి సబ్సిడీ రుణాలు అందించలేదన్నారు. కుల వృత్తుల వారికి పనిముట్లు అందజేసే ఆదరణ వంటి పథకాన్ని నిలిపేశారన్నారు.

వాటితో పాటు 2014-19లో నాటి చంద్రబాబు ప్రభుత్వం బీసీల అభ్యున్నతికి అమలు చేసిన పథకాలన్నింటినీ జగన్ రద్దు చేశారన్నారు. మరోసారి చంద్రబాబు అధికారంలోకి రావడంతో, బీసీలకు పూర్వవైభవం వచ్చిందన్నారు. ప్రస్తుత బడ్జెల్ లో బీసీల సంక్షేమానికి సీఎం చంద్రబాబునాయుడు రూ.39 వేల కోట్లు కేటాయించారన్నారు.

కార్పొరేషన్ ద్వారా నాయీబ్రాహ్మణుల అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ప్రభుత్వం అందజేసే పథకాలను అర్హులకు అందేలా కృషిచేయాలని నాయీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోట సదాశింకు మంత్రి సవిత దిశా నిర్దేశం చేశారు. అనంతరం మంత్రి సవితను నాయీ బ్రాహ్మణ సంఘ నాయకులు సత్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE