– పౌరసరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిటీ “మాచన” సూచన
హైదరాబాద్: వాహనాల్లో ఇంధనం రీఫిల్లింగ్ చేసుకునే సమయం లో.. వినియోగదారులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తహసీల్దార్ మాచన రఘునందన్ స్పష్టం చేశారు.
ఇటీవల ఆయా పెట్రోల్ బంక్ ల్లో పెట్రోల్,డీజిల్,లో నీళ్ళు కలసి వచ్చాయని ఫిర్యాదులు వచ్చిన దరిమిలా..రఘునందన్ స్పందిస్తూ..పెట్రోల్ పోసేటప్పుడు నాజిల్ పైకెత్తి పోయడం వల్ల ఇంధనం మాత్రమే వస్తుందా.. లేక నీళ్లు కూడా ఏమైనా..వస్తున్నాయా?!
అని పరిశీలించేందుకు అవకాశం ఉంటుందని చెప్పారు. అంతే గాక వినియోగదారులు పెట్రోల్ బంక్ లో రశీదు తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. ఒక వేళ..బంకు యాజమాన్యం..జరిగిన పొరపాటు కు బాధ్యత వహించక పోతే..వినియోగదారులకు సదరు బంక్ పై కేసు పెట్టాల్సి వస్తే.. పెట్రోల్ బంక్ లో తీసుకున్న రశీదు మాత్రమే రుజువు గా ఉపయోగపడుతుంది. అవసరం అవుతుందని మాచన రఘునందన్ చెప్పారు.
సాధ్యమైనంత వరకు విద్యుత్తు సరఫరా లేని సమయం లో ఇంధనం రీఫిల్లింగ్ కు ప్రయత్నం చేయకపోవడం కూడా కొన్ని అనవసర వాగ్వాదాలకు, జగడాలకు ఆస్కారం కలగదన్నారు.పెట్రోల్ బంక్ లో పని చేసే వాళ్ళు ప్రతి ఒక్కరితో నూ సార్..మేడం అని సంబోధించి,వినియోగదారులను వి ఐ పి గా పరిగణించాలన్నారు.