టీడీపీ అధినేత-మాజీ సీఎం చంద్రబాబునాయుడు అక్రమ అరెస్టును నిరసిస్తూ టీడీపీ కార్యకర్తలు బీచ్ ఆర్ట్ తో తమ నిరసన వ్యక్తం చేశారు. బాపట్లలో టీడీపీ ఇన్చార్జి వేగేశ్న నరేంద్రవర్మ ఆధ్వర్యంలో బీచ్ వద్ద
చంద్రబాబు చిత్రం ఏర్పాటుచేశారు. దానిని చూసేందుకు స్థానిక ప్రజలు భారీ స్థాయిలో తరలివచ్చారు. అంతరాత్జీయ అవార్డు గ్రహీత బాలాజీవరప్రసాద్ ప్రతిభను ప్రజలు మెచ్చుచుకుని అభినందించారు.
ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ మాట్లాడుతూ.. చంద్రబాబును అరెస్టుచేసి సైకో ఆనందం పొందుతున్న జగన్ తీరును ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. ఆధారాలు లేకుండా చంద్రబాబును అరెస్టు చేసిన జగన్ తగిన మూల్యం చెల్లించుకునేందుకు సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. తన ప్రత్యర్ధులను రాజకీయంగా ఎదుర్కోవడం చేతకాని జగన్, వారిని అర్ధరాత్రి వేళ, శని-ఆదివారాల్లో అరెస్టు చేయిస్తున్నారంటే సీఎంత పిరికివాడో అర్ధమవుతోందన్నారు.
బాపట్ల టీడీపీ ఇన్చార్జి వేగేశ్న వర్మ మాట్లాడుతూ చంద్రబాబు అరెస్టుతో దేశం మొత్తం కదిలిందని, ఒక దార్శినికుడికి ఆ స్థాయిలో స్పందన లభిస్తుందంటే, జగన్ నిర్ణయం ఎంత చెత్తగా ఉందో అర్ధమవుతోంద న్నారు. టీడీపీని నిర్వీర్యం చేయాలన్న జగన్ కల, ఎప్పటికీ నెరవేరదని స్పష్టం చేశారు. చంద్రబాబు కడిగినముత్యం మాదిరిగా త్వరలోనే వస్తారన్నారు.