– బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి జనవాడే సంగాప్ప
ఒకప్పుడు భారతదేశ సంస్కృతి సంప్రదాయాలను చిన్న చూపు చూసిన ప్రపంచ దేశాలు నేడు మన సంప్రదాయాలను ఆచరించేందుకు ప్రత్యేక ఆసక్తి చూపుతున్నాయని బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి జనవాడే సంగప్ప అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో భారత్ విశ్వ గురువుగా అవతరించిందని ఆయన పేర్కొన్నారు.
మన సనాతన ధర్మంలో, ఆచార వ్యవహారాల్లో భాగమైన యోగ ను ప్రపంచ దేశాలు నేడు ఎంతో గౌరవంగా ఆచరించడం వెనుక మోడీ గారి నాయకత్వమే కారణమని ఆయన చెప్పారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకునేలా చేయడం మోడీ వల్ల మాత్రమే సాధ్యమని సంగప్ప అన్నారు. వైట్ హౌస్ లో వివిధ దేశాల ప్రతినిధులు యోగా చేయడం భారతదేశానికి గర్వకారణమని కొనియాడారు.
యోగ కేవలం హిందూ ఆచార వ్యవహారాల్లో భాగం మాత్రమే కాదని, అది జీవన విధానంలో ఒక అద్భుత ప్రక్రియ అని ఆయన వివరించారు. యోగ అనేది ఒక గొప్ప ఆరోగ్య సూత్రం అని, దాన్ని ఆచరించిన వారి జీవితకాలం పెరగడం మాత్రమే కాకుండా ప్రశాంతమైన జీవితాన్ని గడపగలరని నిరూపితమైందని సంగప్ప వివరించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నారాయణఖేడ్ లోని 179వ బూత్ లో జరిగిన కార్యక్రమంలో పాల్గొని సంగప్ప యోగ చేశారు. సంగప్ప వెంట బిజెపి పార్లమెంట్ కన్వీనర్ రవి గౌడ్, అసెంబ్లీ కన్వీనర్ రజనీకాంత్, సీనియర్ నేతలు నగేష్ యాదవ్, సాయిరాం, పట్నం మాణిక్ తదితరులు పాల్గొన్నారు