Suryaa.co.in

National

గూగుల్‌ మ్యాప్స్‌ను నమ్ముకొని నట్టేట మునిగారు!

కేరళ: గూగుల్‌ మ్యాప్స్‌ను నమ్ముకొని ప్రయాణించిన యువకులకు చేదు అనుభవం ఎదురైంది. కేరళ కాసర్‌గోఢ్‌ జిల్లాకు చెందిన అబ్దుల్‌ రషీద్‌తో పాటు మరో యువకుడు ఆదివారం తె. జా కర్ణాటకలోని ఆసుపత్రికి బయలుదేరారు. ఈ సమయంలో గూగుల్‌ మ్యాప్స్‌ను ఉపయోగించారు. అయితే వారు ప్రయాణిస్తున్న కారు హఠాత్తుగా నదిలోకి దూసుకుపోయింది. నీటి ఉధృతికి కారు కొట్టుకుపోగా.. వారు చెట్టును పట్టుకొని ప్రాణాలతో బయటపడ్డారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరలయింది.

LEAVE A RESPONSE