Suryaa.co.in

Telangana

కేసీఆర్ ను నమ్మడమంటే.. పాముకు పాలు పోసి పెంచినట్లే

-కేసీఆర్ ను బొందపెడితేనే అమరుల ఆత్మకు శాంతి
-కామారెడ్డి తీర్పును దేశం నిశితంగా గమనిస్తోంది
-కామారెడ్డి సభలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి

తెలంగాణ దశ దిశను మార్చే తీర్పును కామారెడ్డి ప్రజలు ఇవ్వాలని.. ఇక్కడి ప్రజలు ఇచ్చే తీర్పును దేశం నిశితంగా గమనిస్తోందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం కామారెడ్డి పట్టణంలో జరిగిన విజయభేరి సభలో రేవంత్ రెడ్డి ప్రసంగించారు. కామారెడ్డి రెడ్డి ప్రజలు గొప్ప తీర్పును ఇవ్వాలని కోరుతున్నా అన్నారు. కామారెడ్డి ప్రాంతంలో భూములను కొల్లగొట్టేందుకే కేసీఆర్ ఇక్కడ పోటీ చేస్తున్నారు. ఆదమరచి కేసీఆర్ కు ఓటు వేస్తే… కోట్లాది రూపాయల విలువైన మీ భూములను కొల్లగొడతాడని రేవంత రెడ్డి ఆరోపించారు.

ప్రచారం కోసం గ్రామ గ్రామాన తిరగాలని ఉండే అన్నాఉ. పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు ఎక్కువగా ఉండి రాలేక పోయా అన్నారు. మీరు ఆశీర్వదించండి.. ప్రతీ ఒక్కరిని కలుస్తా.. సమస్యలు పరిష్కరిస్తా అని హామీ ఇచ్చారు. కేసీఆర్ మాటలు నమ్మి మోసపోవద్దు..ఓటుకు పదివేలు ఇచ్చి ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారని విమర్శించారు. పదేళ్లలో ప్రజలకు కేసీఆర్ చేసిందేం లేదని మండిపడ్డారు. వైశ్య కార్పొరేష ఏర్పాటు చేయకుండా వైశ్యులను కేసీఆర్ మోసం చేశారు. కానీ వైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ నిర్ణయం తీసుకుందన్నారు.

అదేవిధంగా గల్ఫ్ కార్మికులకు ప్రత్యేక సంక్షేమ నిధి ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. కార్మికులు ప్రమాదవశాత్తు చనిపోతే వారి కుటుంబానికి 10 లక్షలు, పిల్లల చదువుకు సాయపడేలా కాంగ్రెస్ నిర్ణయం తీసుకుందన్నారు. బీడీ కార్మికులను ఆదుకునేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. అధికారంలోకి రాగానే కామారెడ్డిలో పరిశ్రమల కారిడార్ ఏర్పాటు చేసి అభివృద్ధి చేస్తామని మాట ఇచ్చారు. కామారెడ్డి ప్రజలకు కష్ట సుఖాల్లో తోడుంటా అని భరోసా ఇచ్చారు.

కేసీఆర్ ను నమ్మడమంటే.. పాముకు పాలు పోసి పెంచినట్లే

దోమకొండ సభలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి

కేసీఆర్ పాము లాంటి వాడు… ఓటు వేశారో.. మిమ్మల్ని కాటు వేస్తాడు. కేసీఆర్ ను నమ్మడమంటే.. పాముకు పాలు పోసి పెంచినట్లే అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. మంగళవారం కామారెడ్డి నియోజకరవర్గం పరిధిలోని దోమకొండలో జరిగిన విజయభేరి సభలో రేవంత్ రెడ్డి ప్రసంగించారు. కేసీఆర్ గెలిచినా.. ఓడినా ఫామ్ హౌస్ లొనే పడుకుంటాడని అన్నారు. కామారెడ్డి భూములను కంచె వేసి కాపాడేందుకే నేను ఇక్కడ పోటీకి దిగా అని అన్నారు. పదేళ్లుగా సీఎంగా ఉన్న కేసీఆర్, ఇక్కడి ఎమ్మెల్యే మిమ్మల్ని మోసం చేశారని రేవంత్ రెడ్డి విమర్శించారు.

పేదలకు డబుల్ బెడ్రూంలు ఇవ్వలే, భూములకు పట్టాలు ఇవ్వలే… నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలే.. కానీ ఇప్పుడొచ్చి ఆయనకు ఓటు వేయలని అడుగుతుండు అని విమర్శించారు. పదేళ్లలో గుర్తురాని అమ్మగారి ఊరు కొనాపూర్ ఆయనకు ఇప్పుడు గుర్తుకు వచ్చిందా అని మండిపడ్డారు. ఏనాడూ గల్ఫ్ కార్మికులను, బీడీ కార్మికులను ఆదుకోలేదన్నారు.

“సిద్దిపేట, సిరిసిల్ల కాదని కేసీఆర్ కామారెడ్డిలో పోటీకి దిగిండు..ఇక్కడి రైతుల భూములు గుంజుకునెందుకే కేసీఆర్ కామారెడ్డికి వచ్చిండు.. ఎన్నికలున్నాయనే మాస్టర్ ప్లాన్ ను తాత్కాలికంగా రద్దు చేసిండు…ఎన్నికల తరువాత మళ్ళీ మీ భూములను గుంజుకుంటడు” అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే పేదలకు సంక్షేమ ఫలాలు అందుతాయన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో ఆరు గ్యారంటీలను అమలు చేసి తీరుతామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.

కాంగ్రెస్ వస్తుంది.. రైతు బంధు ఇస్తుంది
కాంగ్రెస్ వస్తుంది.. రైతు బంధు ఇస్తుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. మంగళవారం కామారెడ్డి నియోజకరవర్గం పరిధిలోని బీబీపేటలో జరిగిన విజయభేరి సభలో రేవంత్ రెడ్డి ప్రసంగించారు. డిసెంబర్ 9న ఇందిరమ్మ రాజ్యం ఏర్పడగానే..డిసెంబర్ 10 నుంచి మీ ఖాతాలో రైతు బంధు వేసే బాధ్యత మాదన్నారు. కేసీఆర్ కామారెడ్డికి ఉపాయంతోనే వచ్చాడని రేవంత్ రెడ్డి విమర్శించారు.

గజ్వేల్ భూములను కేసీఆర్ పందికొక్కు మేసినట్టు మేసిండు అని ఆరోపించారు. అల్లుడికి సిద్దిపేట, కొడుక్కు సిరిసిల్ల పంచిపెట్టాడు. నిజామాబాద్ లో ఓడగొట్టి ప్రజలు కవిత దుకాణం బంద్ జేశారన్నారు. కామారెడ్డిలో రైతుల భూములను కొల్లగొట్టేందుకే కేసీఆర్ ఇక్కడ పోటీకి దిగాడు అని ఆరోపించారు. ఇన్నాళ్లుగా గుర్తుకు రాని కొనాపూర్ కేసీఆర్ కు ఇప్పుడు గుర్తుకు వచ్చిందని ఎద్దేవా చేశారు. అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.

కేసీఆర్ ను బొందపెడితేనే అమరుల ఆత్మకు శాంతి
తెలంగాణలో 30 లక్షల మంది నిరుద్యోగులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా..రాష్ట్రంలో పోలింగ్ బూత్ లలో మీరే కథానాయకులుగా మారి కాంగ్రెస్ ను గెలిపించండి..ఈ ఎన్నికల్లో కేసీఆర్ ను బొందపెడితేనే అమరుల ఆత్మ శాంతిస్తుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. మంగళవారం మాల్కాజిగిరి నియోజకరవర్గం పరిధిలో జరిగిన రోడ్ షోలో రేవంత్ రెడ్డి ప్రసంగించారు. వందలాది మంది బలిదానాలతో 60 ఏళ్ల తెలంగాణ అకాంక్ష నిజమైందన్నారు. త్యాగాల పునాదులపై ఏర్పడ్డ తెలంగాణను కేసీఆర్ అబద్ధాల పునాదుల తెలంగాణగా మార్చాడు అని రేవంత్ రెడ్డి విమర్శించారు.

LEAVE A RESPONSE