హైదరాబాద్: ఇంటర్నేషనల్ టీచర్స్ డే (అక్టోబర్ 5) సందర్భంగా, శారద ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మన్ డా. పట్నం కమల మనోహర్ గారి ఆధ్వర్యంలో ప్రముఖ ఉపాధ్యాయుల సత్కార కార్యక్రమం బిర్లా కాన్ఫరెన్స్ హాల్లో ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ , తెలంగాణ రాష్ట్ర శాసన మండలి సభ్యుడు దాసోజు శ్రవణ్ హాజరై, ఉపాధ్యాయులకు ప్రశంసా పత్రాలు, మెమెంటోలు అందజేశారు.
ఈ సందర్భంగా నేషనల్ ఐడియల్ ఇన్స్పిరేషన్ అవార్డ్స్ 2025ను ప్రకటించి, తెలుగు రాష్ట్రాల నుంచి ఎంపికైన మొత్తం 96 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు పురస్కారాలు ప్రదానం చేయబడినవి. కార్యక్రమంలో ప్రసంగించిన దాసోజు శ్రవణ్ , ఉత్తమ ఉపాధ్యాయులను గుర్తించి సన్మానించడం ఒక అభినందనీయ కార్యక్రమం అని పేర్కొన్నారు. 2006 నుంచి ఉపాధ్యాయుల సత్కార కార్యక్రమాలు నిర్వహిస్తున్న శారద ఎడ్యుకేషనల్ సొసైటీ సేవలను ప్రత్యేకంగా కొనియాడారు.
బాల కార్మిక నిర్మూలన, చైల్డ్ ట్రాఫికింగ్ నిర్మూలన వంటి సామాజిక కార్యకలాపాల్లో సంస్థ చేస్తున్న కృషిని కూడా ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, విద్యావేత్తలు, సొసైటీ సభ్యులు పాల్గొని ఉపాధ్యాయుల కృషిని గౌరవిస్తూ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.