-రాజ్యసభలో మంత్రిని ప్రశ్నించిన విజయసాయి రెడ్డి
న్యూఢిల్లీ, మార్చి 30: బేటీ బచావ్-బేటీ పడావ్ పథకం ప్రచారం కోసం 2016-2019 మధ్య కాలంలో కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన 447 కోట్ల రూపాయలలో 79 శాతం నిధులు కేవలం మీడియా ప్రచారానికే వినియోగించినట్లుగా మహిళా సాధికారితపై ఏర్పాటైన పార్లమెంటరీ స్థాయీ సంఘం నివేదిక పేర్కొంది. అంటే నిధుల వినియోగానికి సంబంధించిన నిర్దేశించిన విధివిధానాలను ఉల్లంఘించేలా ఈ పథకం మీడియా ప్రచారం కోసం అడ్డగోలుగా ఖర్చు చేయడానికి కారణాలు ఏమిటని బుధవారం రాజ్యసభ ప్రశ్నోత్తరాల సమయంలో వైఎస్సార్సీపీ సభ్యులు వి.విజయసాయి రెడ్డి మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీని ప్రశ్నించారు.