– కొత్తగా 8 సివోఇ లు
– యూనిఫామ్ తో పాటుగా రెండు జతల నైట్ డ్రెస్సులు
– 104 స్కూల్ లలో ఆరో ప్లాంట్లు,
సోలార్ వాటర్ హీటర్స్
– ఒకేషనల్ కోర్సుల సంఖ్య పెంపు
– ఎన్ సిసి, ఎన్ఎస్ఎస్ యూనిట్ల ఏర్పాటు
– ఆటలు పోటీలు , కల్చరల్ కార్నివాల్ నిర్వహణ
– గురుకుల తో పాటు ప్రభుత్వ జూనియర్ ,డిగ్రీ కాలేజీలను స్కిల్ యూనివర్శిటీ తో కలిసి స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు ఏర్పాటు చేసేలా ప్రణాళిక..
-బోర్డ్ గవర్నర్స్ మీటింగ్ లో కీలక నిర్ణయాలు
హైదరాబాద్: గురుకుల విద్యా సంస్థలలో విద్యార్థులకు మెరుగైన సదుపాయాలతో పాటు సమగ్ర వికాస కోసం కృషి చేయాలని బిసీ సంక్షేమ శాఖ మంత్రి మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. ఎంజేపి రెసిడెన్షియల్ స్కూల్స్ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ అధికారులతో సెక్రటేరియట్ లో తమ ఛాంబర్ లో సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
గత 4 బోర్డు ఆఫ్ గవర్నెన్స్ లో తీసుకున్న నిర్ణయాల్లో అమలు అయినా పనులు పెండింగ్ పనుల పై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరా తీశారు. క్షేత్ర స్థాయిలో సమస్యల పై అధికారులను అడిగి తెలుసుకున్నారు. బీసీ విద్యార్థుల కు మెరుగైన విద్య అవకాశాలు కల్పించేలా ప్రస్తుతము ఉన్న రెండు సీఈఓ ల సంఖ్యను పదికి పెంచుతున్నట్లుగా మంత్రి చెప్పారు.
ఐఐటి , ఎన్ఐటి,నీట్ లో ఇచ్చే శిక్షణను మరింత అందించేలా ఇది ఉపయోగపడనుంది. ప్రస్తుతం విద్యార్థులకు ఇస్తున్న రెండు స్కూల్ డ్రెస్సులు, ఒక స్పోర్ట్స్ డ్రెస్ తో పాటుగా రెండు నైట్ డ్రెస్సులు కూడా ఇవ్వాలని గవర్నర్స్ మీటింగ్ లో ఆమోదించారు. 90 ప్రాంతాలలో ఉన్న 104 గురుకుల విద్యాసంస్థలలో ఆర్ ఓ ప్లాంట్స్ , ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
ప్రతి గురుకుల విద్యాసంస్థల్లో సోలార్ వాటర్ హీటర్లు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా నిర్ణయించారు. విద్యార్థుల ఆరోగ్యానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని హైజేనిక్ కిచెన్ తో పాటుగా స్కూల్ ఆవరణలో పరిశుభ్రత పాటించాలని మంత్రి సూచించారు. గురుకుల విద్యా సంస్థలలో 10వ తరగతి పాస్ అయిన విద్యార్థులు, నవోదయ మాదిరి నేరుగా ఇంటర్ లోకి చేరేందుకు అనుమతించారు.
ఇంటర్మీడియట్ బోర్డుతో అనుసంధానం చేసుకొని విద్యార్థులకు ఉపాధి కల్పించేలా అనేక వృత్తి విద్య కోర్సులను ప్రారంభించాలని మంత్రిగారు సూచించారు. డిగ్రీ కాలేజీలో పనిచేస్తున్న అధ్యాపకులకు సర్వీస్ రూల్స్ ను వర్తింప చేయాలని మీటింగ్ లో నిర్ణయించారు.
వచ్చే వంద రోజుల తరువాత జరిగే సమావేశంలో సర్వీస్ రూల్స్ ఆమోదించుకోవాలని సూచించారు. అన్ని గురుకులాల్లో బుష్ క్లియరెన్స్ చేయాలని ఆదేశించారు. తెల్ల ఉసిరి పెంచితే పాములు రాకుండా ఉంటాయని వాటిని పెంచాలని తెలిపారు. విద్యార్థులకు క్రీడలపై మరింత దృష్టి సారించాలనీ సూచించారు. కల్చరల్ యాక్టివిటీస్,ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్స్ మరింత శ్రద్ధ వహించాలని సూచించారు.
రెసిడెన్షియల్ స్కూల్స్ కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అత్యవసరమైనవి పూర్తి చేయాలని ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్ర వెంకటేశం ఆదేశించారు. డ్రింకింగ్ వాటర్ ఆర్వోస్ ప్లాంట్ లు పూర్తి చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని గురుకులాల్లో కిచెన్ ల పై ఒక నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. వాష్ రూం లో ఉన్న సమస్యలు పూర్తి చేయాలని సూచించారు.
ఇప్పటికే అద్దె భవనాలకు 50 శాతం అద్దె చెల్లింపు పూర్తి అయినందున నవంబర్ 15 లోపు రిపేర్లు పూర్తి చేయాలని ఆదేశించారు. అన్ని గురుకులాల్లో nss ,ncc రెడ్ క్రాస్,స్కౌట్స్ అండ్ గైడ్స్ పై విద్యార్థులకు అమలు చేయాలని గత సమావేశంలో తీర్మానం చేసుకున్నందున ప్రోగ్రెస్ పై అడిగి తెలుసుకున్నారు. బాలికలకు శారీరక మార్పులు , మానసిక పరిస్థితులపై అవగాహన కల్పించాలని సూచించారు.
ఈ సమావేశంలో బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ బుర్ర వెంకటేశం, ఎంజెపి స్కూల్ సెక్రెటరీ బడుగు సైదులు , జాయింట్ సెక్రెటరీ తిరుపతి, మద్దిలేటి, విద్యాశాఖ ఉన్నతాధికారులు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.