( పిపిఎన్)
నాడు నిత్య సంక్షేమ పథకాలు మాత్రమే అమలు చేసి అంతా బాగుంది అని అనుకున్నారు జగన్.
మూడు సంక్షేమ పథకాలు ఇచ్చేసి ఆరు పెట్టుబడులు తెచ్చేసి అభివృద్ధి సంక్షేమం ఉరుకులు పరుగులు – జనం 49% సంతృప్తి అనుకుంటున్నారు బాబు.
గుర్తుంచుకోవాల్సిన అంశాలు ఎన్నో..
పార్టీ కోసం శ్రమించిన కార్యకర్తలకు ఏమేరకు న్యాయం జరిగింది? వారికి ఏమేరకు గుర్తింపు ఆదాయం దక్కుతోంది?
యువగళం లో లోకేష్ వివిధ వర్గాలకు ఇచ్చిన హామీలు ఏమేరకు నెరవేర్చారు?
నమ్మి ఆశలు పెట్టుకున్న వివిధ వర్గాల పరిస్థితి ఏంటి?
చిన్న కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపులు
ప్రభుత్వ ఉద్యోగులు ఆర్థిక ప్రయోజనాలు
వివిధ శాఖల్లో ఉన్న కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాల పెంపు
వ్యవసాయం లో రైతులకు మద్దతు ధర
వైద్యంలో ఆరోగ్యశ్రీ బకాయిలు
విద్యలో ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు
పల్లెల్లో ఉపాధి బిల్లుల చెల్లింపులు
భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి అవకాశాలు
వ్యాపారస్తుల ఆదాయం పెంపుకి విధానాలు
ఆశా వర్కర్లు అంగన్వాడీ కార్యకర్తలు
మున్సిపల్ కార్మికులు చేనేత వర్గాలు
విద్యుత్ రంగ ఉద్యోగులు..
ఇలా ఎన్నో వర్గాలు సంతృప్తిగా ఉన్నాయా?
ఈ వర్గాలు సంతృప్తిగా ఉంటేనే కదా
కాస్తో ఇస్తిష్కో 2029 పై ఆశలు పెట్టుకోవచ్చు!
ఇక అభివృద్ధి విషయానికి వస్తే అమరావతి పోలవరం రైల్వేజోన్ పురోగతి ఏమేరకు ఉంది?
అట్టహాసంగా ఉన్న పెట్టుబడులు పరిశ్రమలు పేపర్లో కాకుండా గ్రౌండ్ లో ఏమేరకు ఫలిస్తున్నాయి!?
గొల్లపూడి- వెలగపూడి – రాయపూడి
విజయవాడ – అమరావతి
గుంటూరు – తుళ్ళూరు
కృష్ణాయపాళెం – ఉద్దండరాయునిపాళెం
ఈ ప్రాంతాల్లో ఒకసారి పర్యటన చేస్తే.
అమరావతి పురోగతి ఈనాడు లో ఉన్నంత ఉందా? లేదా? అన్న స్పష్టత వస్తుంది
పోలవరం పై ఫోకస్ చేసి సీమ ఉత్తరాంధ్ర ప్రాజెక్టులు నిర్లక్ష్యం చేస్తే అభివృద్ధి వికేంద్రీకరణ సాధ్యమేనా? ఓట్లు రాబట్టడం సులువేనా?
ఇవన్నీ పాలకులు ఫోకస్ చేయాల్సిన అంశాలు. ఇవన్నీ కలెక్టర్లు ఫోకస్ చేసే అంశాలు కావు
నిర్ణయ పాలకులు ఏది ప్రాధాన్యతో తెలుసుకోకుండా నిర్వహణ కలెక్టర్ల పై నిందలు మోపి తప్పించుకోవడం తగదు !
Don’t repeat the mistakes occur
between 2014-2019!
తస్మాత్ జాగ్రత్త!