Suryaa.co.in

Telangana

సిద్దిపేటలో తిరిగి రెపరెపలాడిన భగవా ధ్వజం

– పట్టు సాధించుకున్న విశ్వహిందూ పరిషత్

సిద్దిపేట నగరంలో విశ్వహిందూ పరిషత్ తిరుగుబాటు చేసి విజయం సాధించింది. స్థానిక నెహ్రూ పార్కు దగ్గర ఓంకారం జెండాను తొలగించి, గులాబీ రంగు పూసి కారు జెండా ఎగరవేసిన ఘటనపై విశ్వహిందూ పరిషత్ నేతలు పట్టు సాధించారు. అక్రమంగా వేసిన గులాబీ రంగుపై తిరిగి కాషాయం రంగు వేసి భగవద్వజాన్ని ఎగరవేశారు.

బి ఆర్ ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా సిద్దిపేట నగరంలోని నెహ్రూ పార్కు దగ్గర ఓంకారం జెండాను, కాషాయ ధ్వజాన్ని తొలగించిన ఘటన మనందరికీ తెలిసిందే. ఈ విషయంపై స్థానిక విశ్వహిందూ పరిషత్ నేతలు ఆందోళన నిర్వహించి, తిరిగి అదే జెండాను స్వాధీనం చేసుకున్నారు. కాషాయం రంగు వేసి భగవ ధ్వజం ఆవిష్కరించారు. అంతకుముందు ప్రత్యేక పూజలు నిర్వహించి, జెండా కట్ట దగ్గర పాలాభిషేకం చేశారు.

“జైశ్రీరామ్ ..భారత్ మాతాకీ జై.. హిందూ హిందూ దేశ్ కా బంధూ” నినాదాలతో హోరెత్తించారు. ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ మెదక్ విభాగ్ సహకార్యదర్శి గ్యాదరి రాజారాం, విశ్వహిందూ పరిషత్ సిద్దిపేట జిల్లా కార్యదర్శి బుస్స నరేష్, బైరి మురళి, నగర కార్యదర్శి బోనాల శ్రీనివాస్, నాయకులు కనకయ్య, స్వామి, గడ్డం రాజు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE