Suryaa.co.in

Telangana

బిసిల హక్కుల సాధన కోసం భారత్ జాగృతి పోరాటం

– ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

తెలంగాణ జాగృతి పలు సమస్యలపై నిరంతర పోరాటం చేస్తోంది.పార్లమెంట్ లో మహిళా బిల్లు పాస్ చేయాలని ఉద్యమం చేశాం.అసెంబ్లీ ఆవరణలో జ్యోతిరావు పూలే విగ్రహం ఏర్పాటు చేయాలి. పూలే విగ్రహం పెడితే బిసిలకు న్యాయం జరుగుతుందా అని కొంతమంది ప్రశ్నిస్తున్నారు.బిసిల హక్కుల సాధన కోసం భారత్ జాగృతి తరపున పోరాటం కొనసాగుతుంది.

ఏప్రియల్ 11 వరకు పూలే విగ్రహ ఏర్పాటుపై కార్యాచరణ చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.దేశం ఎటు వైపు వెళ్తుందన్న చర్చ జరుపుకోవాల్సిన అవసరం ఉంది. భారత జాగృతి ఆధ్వర్యంలో అనేక సామాజిక కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించాం.ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోనే అసెంబ్లీ ఆవరణలో అంబేడ్కర్ విగ్రహ ప్రతిష్టాపన కోసం పోరాటం చేసి సాధించాము.

బడుగుల కోసం పనిచేసిన ఆశాజ్యోతి, గొప్ప సంఘ సంస్కర్త విగ్రహాన్ని అసెంబ్లీలో ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంటుంది.అసెంబ్లీ అవరణలో విగ్రహం ఏర్పాటు చేయాలని స్పీకర్ కు వినతి పత్రం అందించాం.తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీల మద్ధతు కూడగట్టడానికి లేఖ అందించాము.

విగ్రహం పెట్టడంతోనే విగ్రహం వస్తుందా అని కొంత మంది ప్రశ్నిస్తున్నారు.బీసీల అభ్యున్నతి కోసం భారత్ జాగృతి అనేక కార్యక్రమాలు చేపట్టింది. బీసీల కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను అమలు చేయించడానికి పోరాటం చేస్తాం.మహిళా రిజర్వేషన్ల కోసం ఉద్యమించి సాధించాము.మహిళా రిజర్వేషన్లలో ఓబీసీ మహిళలకు కోటా కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం

అనేక సంఘసంస్కర్తల జయంతులకు తెలంగాణ ఏర్పడిన తర్వాత అధికారికంగా నిర్వహిస్తున్నాం.తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మార్కెట్ కమిటీల్లోనూ బీసీలకు రిజర్వేషన్లు దక్కాయి.గత పదేళ్లలో బీసీల కోసం అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం రూ. 50 వేల కోట్లు ఖర్చు చేసింది.ఆ పరంపర కొనసాగింపుగా ఏ ప్రభుత్వం వచ్చినా బీసీల కోసం పనిచేయాలని ఒత్తిడి చేస్తాం. తొలి అడుగుగా విగ్రహ సాధన కార్యక్రమాన్ని తీసుకున్నాం

LEAVE A RESPONSE