Suryaa.co.in

Telangana

తెలుగువాడి ఠీవి..పీవీ

– భారతరత్న ఇవ్వాల్సిందే
– మంత్రులు తలసాని, మహమూద్‌ అలీ నివాళి

తన పరిపాలనా దక్షతతో దేశ గౌరవాన్ని ఇనుమడింప చేసిన మాజీ ప్రధాని, తెలుగు బిడ్డ పీవీ నర్సింహా రావు కు భారతరత్న ఇవ్వాలని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
పీవీ నర్సింహారావు 101 జయంతి సందర్భంగా నెక్లెస్ రోడ్ లోని పీవీ ఘాట్ లో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, మల్లారెడ్డి, MLC సురభి వాణిదేవి, ప్రభుత్వ సలహాదారు రమణాచారి లు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ మాజీ ప్రధానమంత్రి, తెలుగు బిడ్డ పీవీ ని కేంద్రం విస్మరించడం బాధాకరం అన్నారు.

కిష్ట పరిస్థితులలో ఉన్న దేశాన్ని ఆర్ధిక సంస్కరణలు తీసుకొచ్చి అభివృద్ధి లోకి తీసుకొచ్చిన పీవీ కి భారత రత్న ఇవ్వాల్సిందేనని అన్నారు. ప్రపంచ దేశాలకు భారత దేశ ఖ్యాతిని చాటి చెప్పిన పీవీ కి సరైన గౌరవం, గుర్తింపు ఇవ్వకపోవడం విచారకరం అన్నారు. పీవీ శతజయంతి సందర్భంగా ముఖ్యమంత్రిPV1 కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు తెలంగాణ ప్రభుత్వం ఏడాది పొడవునా వేడుకలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా నెక్లెస్ రోడ్ కు పీవీ మార్గ్ గా నామకరణం చేయడంతో పాటు భారీ విగ్రహం కూడా ఏర్పాటు చేసినట్లు వివరించారు. పీవీ నర్సింహారావు మన మధ్య భౌతికంగా లేకపోయిన మన గుండెల్లో ఎల్లప్పుడూ చిరస్థాయిగా నిలిచే ఉంటారని అన్నారు.

LEAVE A RESPONSE