Suryaa.co.in

Telangana

మంచి ఆలోచనతోనే భారతీయ జనతా పార్టీ ప్రజా సంగ్రామ యాత్ర

– ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి హామీ ఏమైంది?
– తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు , కరీంనగర్ ఎంపీ బండి సంజయ్

మంచి ఆలోచనతోనే భారతీయ జనతా పార్టీ ప్రజా సంగ్రామ యాత్ర చేస్తోంది.నీళ్లు నిధులు నియామకాలు అనే ట్యాగ్ లైన్తో తెలంగాణ సాధించుకున్నాం. 1400 మంది అమరుల త్యాగాలతోనే రాష్ట్రం ఏర్పడింది. ఎన్నికలకు ముందు కేసీఆర్ ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు. కెసిఆర్ ఊకదంపుడు ఉపన్యాసాలతో ప్రజలను మోసం చేస్తున్నాడు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఎన్నో సమస్యలను ప్రజలు మాతో చెప్పుకున్నారు.

నిలువు నీడలేని పేదలు ఎందరో ఉన్నారు.కుత్బుల్లాపూర్ నియోజక వర్గంలో ఎంతమందికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇచ్చారో ఇక్కడ గెలిచిన నాయకులు సమాధానం చెప్పాలి.ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి హామీ ఏమైంది?నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకుండా.. తన కుటుంబానికి మాత్రమే కేసీఆర్ ఉద్యోగాలు ఇచ్చుకున్నాడు.ఈ ప్రాంత టిఆర్ఎస్ నాయకులు దమ్ముంటే ప్రగతి భవన్ కు పోయి కెసిఆర్ ఇచ్చిన హామీలను ప్రశ్నించాలి?

దళితుడుని సీఎం చేశాడా?, దళితులకు మూడెకరాల భూ పంపిణీ, దళిత బంధు హామీ నెరవేర్చాడా?ఇక్కడ వంద పడకల ఆసుపత్రి నిర్మాణం ఏమైంది? కుత్బుల్లాపూర్ ఒక మినీ భారత్ లాంటిది. కుత్బుల్లాపూర్ లో బస్సు డిపో ఏర్పాటు చేస్తానన్న కేసీఆర్ హామీ ఏమైంది? ఇక్కడ మంచినీళ్లలో… మురుగు నీల్లు కలుస్తున్నాయి. డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి…మోకాళ్ళ ఎత్తు ప్రవహిస్తున్నాయి. కుత్బుల్లాపూర్ లో భూములు, నాలాలను కబ్జా చేశారు.ఇక్కడ కనీస సౌకర్యాలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.

కనీస సౌకర్యాలు కల్పించని ముఖ్యమంత్రి… ఈ ముఖ్యమంత్రి కేసీఆర్.వీఆర్ఏలపై లాఠీ ఛార్జ్ చేసి, కాళ్లు విరగ్గొడుతున్నారు. వీఆర్ఏలు పేదోళ్లు. వాళ్లను కొట్టించడానికి నీకు చేతులైట్లా వచ్చినయ్…మనసులేని దుర్మార్గుడివి.వీఆర్ఏలకు అసెంబ్లీలో నువ్వు ఇచ్చిన హామీలను నెరవేర్చమంటున్నారు కదా… ఎందుకు చేయడం లేదు?వీఆర్ఏల సమస్యలను పరిష్కరించాలని బిజెపి డిమాండ్ చేస్తుంది.పేదోళ్ల రాజ్యం తెలంగాణలో రావాలి.విద్యుత్ బిల్లులను ఇష్టం వచ్చినట్టు పెంచారు. సంవత్సరానికి రూ. 6 వేల కోట్ల రూపాయల ఆదాయం వచ్చే విధంగా…కరెంటు చార్జీలను పెంచారు.విద్యుత్ ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. పెట్రోలు ధరను తగ్గించడు. ప్రజల కష్టాలు తెలుసుకునేందుకే భారతీయ జనతా పార్టీ మీ ముందుకు వచ్చింది.

LEAVE A RESPONSE