– రాత్రి వేళ్లలో గ్యాస్ విడుదల చేసి ఊపిరి తీస్తున్నారు
– అయినా పట్టని పీసీబీ, ఫ్యాక్టరీస్ ఇన్స్పెక్టర్
– భార్గవిని అక్కడి నుంచి తరలించాల్సిందే
– సంఘటనా స్థలాన్ని సందర్శించిన సీఐటియు నేతలు
అనకాపల్లి జిల్లా: పరవాడ మండలంలో గల ఈ బొనంగిలో ఐడియల్ పార్క్ లో భార్గవి అమోనియా కంపెనీలో అమోనియా గ్యాస్ లీక్ అవడంతో బొద్ద పు వానిపాలెం గ్రామంలో ఉన్న ప్రజలు శ్వాస పీల్చుకోవడానికి ఇబ్బందులకు గురవుతున్నారు.
సదరు భార్గవి కంపెనీ యాజమాన్యం ఎప్పటికప్పుడు రాత్రి వేళల్లో గ్యాస్ విడుదల చేయడం వల్ల శ్వాస కోసం జబ్బులకు గురవుతున్నారు. దీనిపై పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, ఫ్యాక్టరీస్ ఇన్స్పెక్టర్ దీనిపై సమగ్ర విచారణ చేసి వీటి పై చట్టపరమైన చర్యలు తీసుకుని, ఇక్కడి నుంచి ఈ కంపెనీని తరలించాలని ఈ బోనింగి గ్రామ ప్రజలను కాపాడాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు గనిశెట్టి సత్యనారాయణ, పరవాడ మండలం ఇ బోగంగి చందక కృష్ణ ఇరోతి రమేశ్ బొద్దపు శ్రీ నువాసరావు వైసిపి మాజీ మండల అధ్యక్షులు బొద్ధపు చిన్నా రావు డిమాండ్ చేశారు.