– ఏఐసిసి బాధ్యతలు రాహుల్ చేపట్టాలని సీఎల్పీ తీర్మాణం
– మీడియా సమావేశంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క వెల్లడి
దేశానికి, కాంగ్రెస్ పార్టీకి సోనియా, రాహుల్ నాయకత్వమే శ్రీరామరక్ష అని, సీఎల్పీ సమావేశంలో సోనియా గాంధీ నాయకత్వాన్ని బలపరుస్తూ తీర్మాణం చేసినట్టు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తెలిపారు. బుధవారం అసెంబ్లీ ఆవరణలోని సీఎల్పీ కార్యాలయంలో భట్టి విక్రమార్క అధ్యక్షతన తెలంగాణ కాంగ్రెస్ శాసనసభ పక్ష సమావేశం జరిగింది. ఈసమావేశానికి ఎమ్మేల్యేలు శ్రీధర్‌బాబు, జయప్రకాశ్‌రెడ్డి( జగ్గారెడ్డి) సీతక్క, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డిలు హాజరైనారు.
ఈసందర్భంగా మీడియా పాయింట్ వద్ద ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్ లో భట్టి విక్రమార్క మాట్లాడారు. రాజ్యంగ స్పూర్తిని, దేశాన్ని రక్షించడం కోసం ఏఐసీసీ బాధ్యతలను యువనేత రాహుల్‌గాంధి స్వీకారించాలని సీఎల్పీ ఏకగ్రీవంగా తీర్మాణం చేసిందని వెల్లడించారు. గాంధి, నెహ్రు కుటుంభం మాత్రమే కాంగ్రెస్ పార్టీని కాపాడుతుందన్నారు. వీరి నాయకత్వమే ఇప్పడు దేశానికి అవసరం ఉందని వివరించారు.
మత చాంధసవాదులు జాతిని విచ్ఛిన్నం చేసేందుకు దేశంలో పెద్ద ఎత్తున కుట్రలు చేస్తున్న నేపత్యంలో లౌకికవాదంతో దేశాన్ని, రాజ్యంగ స్పూర్తిని పరిరక్షించడం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమన్నారు. దేశంలో అనేక రకాల విధ్వంస చర్యలు, మత పరమైన హింసలు జరుగుతున్న నేపత్యంలో దేశాన్ని కాపాడలంటే యువనేత రాహుల్ గాంధీ పార్టీ పగ్గాలు చేపట్టాలని సీఎల్పీ ఏకాగ్రీవంగా తీర్మాణం చేసిందని చెప్పారు.
కాంగ్రెస్ పార్టీకి పార్లమెంట్ సభ్యులు రాహుల్ గాంధీ నాయకత్వం చాలా అవసరమన్నారు. రాహుల్ గాంధి వెంటనే ఎఐసిసి బాధ్యతలు స్వీకరించాలని తెలంగాణ కాంగ్రెస్ శాసనసభ పక్షం విజ్ఞప్తి చేస్తున్నదని తెలిపారు.
ప్రధాని అవ్వ డానికి అవకాశం వచ్చిన ఏ పదవులు ఆశించకుండా రాహుల్ గాంధి దేశం కోసం ఇంతకాలం పనిచేశారని కొనియాడారు. కపిల్ సిబాల్ వంటి నాయకులు కాంగ్రెస్‌లో మేధావులుగా పనిచేసినప్పటికీ గాంధీ కుటుంబం కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురావడం వల్లే వాళ్ళు కేంద్ర మంత్రులయ్యారని తెలిపారు. గాంధి కుటుంబం త్యాగలతో పదవులు అనుభవించి ఇప్పడు వారిపైన విమర్శలు చేయడం సరికాదని సూచించారు.
పంజాబ్ ఎన్నికల ఫలితాలు తెలంగాణలో ఉండవు
పంజాబ్ ఎన్నికల ఫలితాలు తెలంగాణలో ఉండవన్నారు. 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ తెలంగాణలో అధికారంలోకి వస్తుందని దీమా వ్యక్తం చేశారు. 1970లో కాంగ్రెస్ అధికారం కోల్పోయి 1980లో తిరిగి పూర్వవైభవం సంతరించుకున్నట్టు 2023లో కాంగ్రెస్ హావా దేశంతో వీస్తుందని వివరించారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని చెప్పారు. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల్లో పీసీసీ అధ్యక్షులను రాజీనామా చేయాలని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధి ఇచ్చిన ఆదేశాలను ఆహ్వనిస్తున్నామని చెప్పారు. తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ బలంగా వుందని విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పారు.