Suryaa.co.in

Telangana

భట్టి ది కరెక్టా.. మంత్రి వెంకట్ రెడ్డి ది కరెక్టా?

– ఏది కరెక్టో క్లారిఫై చేయండి.
– అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో మాజీ మంత్రి హరీశ్ రావు

హైదరాబాద్: ఆర్ అండ్ బి మంత్రి మా ప్రశ్నకు సమాధానం కొంచెం బాధ్యతగా ఇస్తే బాగుంటుంది. అధ్యక్షా.. మేం అడిగిన ప్రశ్న… రోడ్లు భవనాల శాఖ పరిధిలో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో రోడ్లు వేయడానికి ప్రభుత్వం వద్ద ప్రతిపాదన ఏమైనా ఉన్నదా?

మా ప్రశ్నకు లేదండీ అని సమాధానం ఇచ్చారు. ఇది వ ఆర్ధిక మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్ బుక్. ఇందులో 40శాతం ప్రభుత్వ నిధులతో, 60శాతం ప్రైవేట్ డెవలపర్ల పెట్టుబడితో రహదారులను అభివృద్ధి చేస్తాం.. అని మంత్రి బడ్జెట్ లో స్పష్టంగా చెప్పారు.

ఇదే విషయంమీద అసెంబ్లీలో ప్రశ్న అడిగితే ఆర్ అండ్ బీ మంత్రి లేదండీ అని చెప్పారు.

సభ్యులు అడిగిన ప్రశ్నలకు ప్రభుత్వం బాధ్యతగా సమాధానం ఇవ్వాలి. లేదండీ, ఉత్పన్న కాదు అనడం సరైంది కాదు. ఇది బాధ్యతా రాహిత్యం.

ప్రభుత్వం హ్యాం మోడల్ లో ప్రభుత్వం 40 శాతం, ప్రైవేటు 60శాతం పెట్టుబడులతో అని బడ్జెట్లో చెప్పారు. నిన్న మంత్రి అసెంబ్లీలో మాట్లాడుతూ 60 శాతం గవర్నమెంటు అని చెప్పారు, భట్టి బడ్జెట్ బుక్కులో మాత్రం 60 శాతం ప్రైవేటు అని ఉన్నది. ఏది క్లారిటీ, భట్టి ది కరెక్టా, మంత్రి వెంకట్ రెడ్డి రిది కరెక్టా? ఏది కరెక్టో క్లారిఫై చేయండి.

హ్యాం మోడల్లో 28 వేల కోట్లతో రోడ్లను బాగు చేసే పథకంలో… ఈ రోడ్లను ఏ ప్రాతిపదికన ఎంపిక చేస్తున్నారు? ఎమ్మెల్యేల భాగస్వామ్యం ఉందా?

బీఆర్ఎస్ ప్రభుత్వం మిషన్ కాకతీయ కింద చెరువులను బాగు చేసినపుడు, స్వపక్ణ, విపక్ష ఎమ్మెల్యేలు అని చూడకుండా అంతటా చేశాం. అన్ని మండలాలకు రోడ్లు వేశాం.

60శాతం ప్రైవేటు వాళ్లు పెట్టాలంటే 16,800 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడితే, ఎన్ని సంవత్సరాల్లో, ఎంత వడ్డీతో చెల్లిస్తారు. ఈ ఆర్ధిక భారం రాష్ట్ర ప్రభుత్వం మీద పదేండ్లు పడితే, మరి ఇది ఎఫ్.ఆర్.బి.ఎం పరిధిలోకి వస్తుందా? బడ్జెట్లో ప్రతి ఏటా బడ్జెట్ పెడతే మెయింటెనెన్సు కూడా మళ్లీ బడ్జెట్ అవసరముంటది. మీరు పదేండ్ల పాటు ప్రభుత్వంపై భారం వేయబోతున్నారా?. దీని మీద క్లారిటీ ఇవ్వండి.

సీతక్క ఎంతసేపూ గత ప్రభుత్వ బకాయిలని మా మీద బురద చల్లే ప్రయత్నం చేస్తున్నరు. Government is a continuous Process. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన 2014-15లో ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం ఫీజు రీయింబర్సు మెంటు 2 వేల కోట్లు మాకు బకాయి పెట్టి పోయారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చెల్లించింది.

బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఫీజు రీయింబర్సు మెంటు ఇవ్వనేలేదు, చెల్లించనే లేదు అనేది పూర్తిగా సత్యదూరం. మేము పెద్ద నోట్ల రద్దు లాంటి ఒక ఆర్ధిక మాంద్యాన్ని రెండేళ్లతో ఎదుర్కొన్నాం. బీఆర్ఎస్ తొమ్మిదిన్నరేళ్ల పాలనలో 20 వేల కోట్లు ఫీజు రీయింబర్సు మెంటు చెల్లించాం.

ఇప్పటికే రాష్ట్రంలో సగానికి సగం జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు మూతపడ్డాయి. వాళ్లు కరెంటు బిల్ కట్టకపోతే కరెంట్ కట్ అయిపోతది, వాటర్ ట్యాక్సులు కట్టకపోతే వాటర్ కట్ అయిపోతది. మున్సిపల్ ట్యాక్సు కట్టాల్సిందే, ఉద్యోగులకు జీతాలివ్వాల్సిందే.

15 నెలలు వరుసగా బిల్లులు రాకపోతే కాలేజీలన్నీ ఆగమై పోయే పరిస్థితి ఉంది. ఫైనలియర్ విద్యార్థులు సర్టిఫికెట్లు రాక ఒక విద్యా సంవత్సరాన్ని కోల్పేయే పరిస్థితి ఉంది.

మా హయాంలో కూడా రెండుసార్లు రైతుబంధు ఇచ్చే వాళ్లం, అపుడు ఫైనాన్సు శాఖ మీద కొంత ఒత్తిడి ఉండేది. రెండో విడత అయ్యాక జనవరి, ఫిబ్రవరి మార్కి ఈ 3 నెలల్లో ఫీజు రీయింబర్సు మెంటు ఇచ్చేవాళ్లం. అప్పుడే మీ ప్రభుత్వం వచ్చింది.

పోయిన జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో రీయింబర్సు మెుంటు ఇవ్వకపోవడం వల్ల బకాయిలు పేరుకుపోయాయి. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును, కాలేజీల దృష్టిలో పెట్టుకొని ఈ నెలాఖరుకైనా కనీసం 2 వేల కోట్లన్నా ఇవ్వలిగితేనే ఆ పిల్లలు కష్టాల నుంచి బయటపడే పరిస్థితి ఉంటుంది.

మంత్రి సీతక్క 800 కోట్లు ఇచ్చామన్నారు. ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ కాంపొనెంట్ కింద వచ్చిన నిధులనే ఇచ్చారు, తప్ప రాష్ట్ర ప్రభుత్వం నిధులివ్వలేదు.

మీరు గత బడ్జెట్లో పెట్టిన నిధులనైనా ఈ మార్చి నెలాఖరులోపు విడుదల చేసి ఆ విద్యార్థుల భవిష్యత్ తో పాటుగా, కాలేజీలను కాపాడాలని నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను.

LEAVE A RESPONSE