Suryaa.co.in

Editorial

భీమవరం ‘అల్లూరి’ విగ్రహావిష్కరణలో కృష్ణంరాజుకు దక్కని గౌరవం

( మార్తి సుబ్రహ్మణ్యం)

సినీ, రాజకీయ రంగాలపై దశాబ్దాల పాటు తనదైన ముద్ర వేసి, ఆక స్మికంగా మృతి చెందిన కృష్ణంరాజుకు.. తన సొంత నియోజకవర్గంలో దక్కని గౌరవం ఆయన అభిమానులను కలచివేస్తుంది. ఆ ఘటన కృష్ణంరాజు అభిమానులకు ఒక చేదు జ్ఞాపకంగానే మిగిలింది.అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ కార్యక్రమానికి, నర్సాపురం నియోజకవర్గం ఎంపీగా పనిచేసిన కృష్ణంరాజుకు ఆహ్వానం అందకపోవడమే ఓ చేదు జ్ఞాపకం.

ఆజాదీకా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా.. భీమవరంలో గత కొద్ది నెలల క్రితం ఏర్పాటుచేసిన అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణకు, నర్సాపురం ఎంపీగా పనిచేసిన కృష్ణంరాజుకు ఆహ్వానం దక్కకపోవడం, ఆయన అభిమానులను కలచివేసింది. అదే నియోజకవర్గానికి చెందిన మెగాస్టార్ చిరంజీవిని వేదికపైకి ఆహ్వానించిన ప్రభుత్వం… నర్సాపురం ఎంపీతోపాటు, కేంద్రమంత్రిగా కూడా పనిచేసిన కృష్ణంరాజుకు మాత్రం కనీసం ఆహ్వానం పంపని వైనం తలచుకుని, ఆయన అభిమానులు ఇప్పటికీ అసంతృప్తి వ్యక్తం చేస్తుంటారు.

ప్రధాని మోదీ హాజరయిన అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ కార్యక్రమానికి, కేంద్ర మాజీ కృష్ణంరాజుకు ఆహ్వానం లేకపోవడంపై, అప్పట్లోనే మీడియాలో విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. నర్సాపురం లోక్‌సభ నియోజకవర్గం అభివృద్ధికి అవిరళ కృషి చేసిన కృష్ణంరాజుకు, అల్లూరి వేదికపై చోటు లేకపోవడం అటు క్షత్రియులనూ కలచివేసింది. కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త నిర్వహణలో జరిగిన ఆ కార్యక్రమంలో.. ఒకవేళ కృష్ణంరాజు పాల్గొని ఉంటే.. అదే ఆయన చివరి కార్యక్రమమయి ఉండేది.

LEAVE A RESPONSE