అమరావతిలో అల్లూరి మెమోరియల్ ఏర్పాటు చేస్తాం
ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన వారిపై దాడులు చేయిస్తున్నారు
ఏనాడు అశోక్ గజపతిరాజు కమర్షియల్ గా ఆలోచించలేదు
రఘురామకృష్ణంరాజు పార్టీ చేసిన తప్పులను ఎండగడున్నారని టార్చర్ చేశారు.
మొదటి ఆయనను కొట్టారంటే నేను కూడా నమ్మలేదు
హైదరాబాద్ కు సిఐడి వాళ్లను పంపించారు
చిత్తూరుజిల్లాను చెడగొట్టిన కుటుంబం పెద్దిరెడ్డి కుటుంబం
పత్రికల్లో ఎపి ఎడిషన్స్ తీసుకుంటే దాడులు, కూల్చివేతలు కన్పిస్తున్నాయి
జగన్, లోకేష్ శాశ్వతం కాదు, ఆంధ్రరాష్ట్రం శాశ్వతం
విజనరీ పిల్లలు బాగు పడాలని ఆలోచిస్తాడు. ప్రిజనరీ ఫ్యాక్షనిజం మెంటాలిటీతో ఉంటాడు
భీమవరం నియోజకవర్గం వెంప గ్రామంలో క్షత్రియ సామాజికవర్గీయులతో నారా లోకేష్ ముఖాముఖి
క్షత్రియుల్లో కూడా వ్యవసాయంపై ఆధారపడి జీవించే వారు ఉన్నారు, మాలో కూడా పేదలు ఉన్నారు, కార్పొరేషన్ ను ఏర్పాటుచేసి ఆదుకోవాలి.
గతంలో క్షత్రియ సంక్షేమ నిధి ఏర్పాటుచేసి బడ్జెట్ లో రూ.50కోట్లు కేటాయించారు. ఈ ప్రభుత్వం వచ్చాక కార్పొరేషన ఏర్పాటుచేసి ఏ ఒక్క క్షత్రియుడికి సహాయం చేయలేదు.
క్షత్రియులను సామాజికంగా, ఆర్థికంగా దెబ్బతీసేలా ప్రభుత్వ విధానాలు ఉన్నాయి.
చింతలపాటి వరప్రసాద మూర్తిరాజు తన 1800 ఎకరాలను విద్యాసంస్థలకు దానంచేశారు, మరణానంతరం తగిన గౌరవం ప్రభుత్వాలనుంచి రాలేదు. టిడిపి వచ్చాక రాష్ట్రప్రభుత్వం తరపున స్మారక భవనం ఏర్పాటుచేయాలి.
ఆక్వాకల్చర్ రాకముందుకు వెంపలో 5రైస్ మిల్లులు ఉన్నాయి, ఇప్పుడు అవన్నీ మూతపడ్డాయి.
ఆక్వా కు సంబంధించిన స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ లేవు. ఇక్కడ యువత ఇతర ప్రాంతాలకు వలసవెళ్లి ఉద్యోగాలు చేసుకుంటున్నారు.
చిన్నతరహా పరిశ్రమలు ఏర్పాటుచేసుకునేందుకు రాయితీలు ప్రోత్సాహం కల్పించండి. -క్షత్రియ సామాజికవర్గ ప్రతినిధులు.
నారా లోకేష్ మాట్లాడుతూ…. నాడు, నేడు ఎప్పుడూ క్షత్రియులకు అండగా నిలబడింది టిడిపి.అధికారంలోకి వచ్చాక మొదటి వందరోజుల్లో నిధులు కేటాయించి పేద క్షత్రియులకు చేయూతనందిస్తాం. భోగాపురం ఎయిర్ పోర్టుకు అల్లూరి సీతారామరాజు పేరు పెడతాం.
అమరావతిలో అల్లూరి మెమోరియల్ ఏర్పాటుచేస్తాం, ఇప్పుడు అయోమయంలో ఉన్నాం. పార్లమెంటులో కూడా అల్లూరి విగ్రహం ఏర్పాటుకు తెలుగుదేశం కృషిచేస్తుంది. మొగలి గ్రామంలో మూర్తిరాజు విగ్రహం, స్మారక భవనం ఏర్పాటుచేస్తాం.
ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు మరే రాష్ట్రంలో లేవు, ఎపిని సైకో జగన్ మరో బీహార్ గా మార్చేశాడు.ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడిన వారిపై కేసులు పెట్టి, జైళ్లకు పంపుతున్నారు. తక్కువ జనాభా ఉన్నా అన్నిరంగాల్లో మీరు నెం.1గా ఉన్నారు, అన్నిరంగాలను మీరు శాసిస్తున్నారు.క్షత్రియులు రాజకీయాల్లో క్రమశిక్షణ, పద్ధతిగా నిలబడుతున్నారు. మిమ్మలను అణగదొక్కేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.
ఆక్వారంగంలో చాలా కీలకపాత్ర వహిస్తున్నారు, ఈ ప్రభుత్వం వైఖరి వల్ల మీరు చాలా నష్టపోయారు.పేదరికానికి కులం, మతం, ప్రాంతం ఉండదు, పేదరికంనుంచి బయటకు తేవడానికి ఉద్దేశించిన కార్పొరేషన్లను కేవలం రాజకీయ పునరావాస కేంద్రాలుగా మార్చారు.టిడిపి అధికారంలోకి వచ్చాక దామాషా పద్ధతిన నిధులు కేటాయిస్తాం.నిరుపేద కుటుంబాలను ఆదుకునేవిధంగా నిధులు ఇస్తాం. పేదరికం లేని రాష్ట్రమే మా లక్ష్యం. టిడిపి సైకిల్ కు సంక్షేమం, అభివృద్ధి రెండు చక్రాలు, అది పూర్తిచేస్తాం.
205రోజులుగా శాంతియుతంగా సాగుతున్న యువగళం పాదయాత్రపై రాళ్లదాడి చేయించింది సైకో ప్రభుత్వం. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన వారిపై దాడులు చేయిస్తున్నారు, మా వాలంటీర్లను తెల్లవారుజామున దాడిచేసి తీసుకెళ్లారు. పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పుతున్నారు.సమస్యలపై గళమెత్తడానికి యువగళం ఒకవేదిక, అందరిలో చైతన్యం తీసుకురావాలి.
సైకో జగన్ ను తాడేపల్లి కొంపలో పెట్టి తాళం వేయాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది. ఏనాడు అశోక్ గజపతిరాజు కమర్షియల్ గా ఆలోచించలేదు, నీతి,నిజాయితీగా వ్యవహరించారు. ఎన్నో కీలకమైన పదవులు చేశారు, ఒక్క ఆరోపణ కూడా లేని వ్యక్తిని పనిగట్టుకొని వేధించారు. పుంగనూరులో బాబుగారిపై ఎలా దాడిచేశారో చూశాం, ఏనాడు చట్టాన్ని ఉల్లంఘించని వ్యక్తిపై రాళ్లదాడి చేయించింది.
రఘురామకృష్ణంరాజును ఏం చేశారో మీకు తెలుసు, పార్టీ చేసిన తప్పులను ఎండగడున్నారని టార్చర్ చేశారు. మొదటి ఆయనను కొట్టారంటే నేను కూడా నమ్మలేదు, హైదరాబాద్ కు సిఐడి వాళ్లను పంపించారు, ఈ ప్రభుత్వం ఎంత కక్షపూరితంగా వ్యవహరిస్తుందో అందరూ ఆలోచించాలి.
గతంలో టిడిపిలో కూడా చాలామంది విభేదించారు, మేము ఎప్పుడూ ఎవరినీ కొట్టలేదు. ఒకరిని తీసుకెళ్తే వందమంది వెళ్లాలి, వెయ్యిమంది తీసుకెళ్తేనే ఈ ప్రభుత్వం వెనక్కి తగ్గుతుంది. చిత్తూరు జిల్లాను చెడగొట్టిన కుటుంబం పెద్దిరెడ్డి కుటుంబం, ఇప్పుడు మిధున్ రెడ్డి గోదావరి జిల్లాలకు వచ్చాడు. వారిని తిప్పికొట్టకపోతే పుంగనూరులో జరిగిన ఘటనలే అన్ని జిల్లాల్లో జరుగుతాయి. వారికి ఛాన్స్ ఇస్తే ఉభయగోదావరిలో బతికే పరిస్థితి ఉండదు.
8 నెలల్లో జగనోరా వైరస్ కు మంచి వ్యాక్సిన్ వస్తుంది, ఉభయగోదావరి జిల్లాలకు గతవైభవం తెస్తాం.రౌడీలు, గంజాయి బ్యాచ్ లు, బ్లేడ్ బ్యాచ్ లకు గుణపాఠం చెప్పే బాధ్యత నాది.రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై ఆంధ్రుడిగా బాధపడుతున్నా, తలదించుకుంటున్నా. పత్రికల్లో ఎపి ఎడిషన్స్ తీసుకుంటే దాడులు, కూల్చివేతలు కన్పిస్తున్నాయి.పక్క రాష్ట్రంలో మంత్రి విదేశాలకు వెళ్లి పారిశ్రామిక ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు. నష్టపోతున్నది మనబిడ్డలు.
ఈ ముఖ్యమంత్రి వల్ల 30సంవత్సరాలు వెనక్కి వెళ్లాం. ఒకప్పుడు అన్ని పరిశ్రమలు మన రాష్ట్రానికి వచ్చేవి. ఇటీవల ఆక్వాలో వెయ్యికోట్ల పెట్టుబడి తెలంగాణాలో వచ్చింది. బాబుగారి ఉంటే పోరాడి తీసుకువచ్చేవారు. డిఫెన్స్ టెక్నాలజీ సంస్థను తెలంగాణాకు తరిమేశారు, వెయ్యికోట్ల పెట్టుబడి వెళ్లిపోయింది.యువత మాట్లాడాలి, భయపడొద్దు, జగన్, లోకేష్ శాశ్వతం కాదు, ఆంధ్రరాష్ట్రం శాశ్వతం.
ఒక్కసారి వెనకబడితే మళ్లీ గాడిలో పెట్టడం కష్టం. ఇప్పుడున్న పరిస్థితుల్లో పెట్టుబడి తేవడం కష్టం.సమర్థతకు మారుపేరైన చంద్రబాబు నేతృత్వంలో మెరుగైన పాలసీ తీసుకవచ్చి, చిన్నతరహా పరిశ్రమలను ప్రోత్సహిస్తాం.కరెంట్ ఛార్జీలను పద్ధతి ప్రకారం తగ్గిస్తాం, 24గంటలు కరెంటు ఇచ్చే బాధ్యత తీసుకుంటాం.గతంలో ఇప్పటి ప్రభుత్వంలో మాదిరిగా కుంటిసాకులతో కరెంటు సరఫరా నిలిపివేయలేదు.
టిడిపి అధికారంలోకి వచ్చాక అభివృద్ధి చేసి చూపిస్తాం, ఎటువంటి డౌట్ అవసరం లేదు. అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో ఇంటింటికీ స్వచ్చమైన తాగునీరు అందిస్తాం.పట్టణాలకు మించి పల్లెటూళ్లను అభివృద్ధి చేస్తాం.
విజనరీకి, ప్రిజనరీకి తేడా తెలుసుకోండి. విజనరీ పిల్లలు బాగు పడాలని ఆలోచిస్తాడు. ప్రిజనరీ ఫ్యాక్షనిజం మెంటాలిటీతో ఉంటాడు.రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా? నిన్న వైసిపి వాళ్ల రాళ్లదాడిలో ముగ్గురు కానిస్టేబుళ్లు, ఆరుగురు మా కార్యకర్తలు గాయపడితే నాకు నోటీసులు ఇస్తున్నారు.నేను ఏం పదాలు వాడానో నోటీసులు ఇవ్వమని అడిగాను. ఒక భవనంపై పథకం ప్రకారం సీసాలు కూడా పెట్టుకున్నారు. మహిళలపై కూడా రాళ్లు వేశారు, ఎమ్మెల్యేకి నోటీసు లేదు, వైసిపి నాయకులకు నోటీసులు లేవు.రక్షణ కోసం నిలబడిన వాలంటీర్లను పట్టుకెళ్లారు, నేను కేవలం నిలబడి ఉంటే నాకు నోటీసు ఇచ్చారు.
కొందరి వల్ల మొత్తం డిపార్ట్ మెంట్ కే చెడ్డపేరు వస్తోంది. నా ప్రశ్నలకు సిఐ వద్ద సమాధానం లేదు.యువగళం పాదయాత్ర ద్వారా మహనీయుల గురించి నేరుగా తెలుసుకునే అవకాశం వచ్చింది. అధికారంలోకి వచ్చాక తగినవిధంగా గౌరవం ఇస్తాం.మూర్తిరాజు గారు గతంలో విన్నాను, టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే తగిన గౌరవం ఇచ్చే బాధ్యత నాది.మొగలి గ్రామంలో పది ఎకరాలు కేటాయించి దివంగత మూర్తిరాజుగారి విగ్రహం, స్మారక భవనం ఏర్పాటుచేస్తాం.