Suryaa.co.in

Andhra Pradesh

పాపాల పెద్దిరెడ్డి భూదాహానికి భూదేవి కూడా బాధపడుతుంది

  • మదనపల్లె ఫైల్స్ దగ్ధం కేసులో ఏ1 పెద్దిరెడ్డి పీఏ శశిధర్ అయితే ఏ2 కైలే అనిల్ కుమార్

  • త్యాడేపల్లి ప్యాలేస్ తలదన్నేలా, హైదరాబాద్ లోటస్ పాండ్‌లా పామర్రులో అనిల్ కుమార్ ఇంద్రప్రస్థానం

  • అంబేద్కర్ స్మృతి వనంలో జగన్ రెడ్డి పేరు పెద్దది పెట్టుకొని అంబేద్కర్ పేరు చిన్నది పెట్టడంతో దళితుల మనోభావాలు దెబ్బతిన్నాయి

  • మనోభావానికి గురైన దళిత సోదరులు జగన్ రెడ్డి పేరును తొలగించే ప్రయత్నం చేశారు తప్ప స్మృతి వనంలో ఎటువంటి అరాచకం జరుగలేదు

  • దళితులను చంపి డోర్ డెలివరీ చేసిన వారిని పక్కనే పెట్టుకొని తిరుగున్న జగన్ రెడ్డికి అంబేద్కర్ గురించి మాట్లాడే అర్హత లేదు

  • ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా

పామర్రు నియోజకవర్గంలో పుట్టకో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బినామీలు పుట్టుకొస్తున్నారని, పామర్రు మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ పాపాల పెద్దిరెడ్డి బినామీ అని ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా ధ్వజమెత్తారు. శనివారం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా మాట్లాడుతూ…

పాపాల పెద్దిరెడ్డి బినామీ కైలే అనిల్ కుమార్

“పాపాల పెద్దిరెడ్డి భూదాహానికి భూదేవి కూడా బాధపడుతుంది. పెద్దిరెడ్డి కబ్జాకోరల్లో ఇరుక్కుపోయిన బాధితులు తండోపతండాలుగా, ధైర్యంగా ముందుకు వచ్చి అర్జీలు ఇస్తున్నారు. పామర్రు మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ పాపాల పెద్దిరెడ్డికి బినామీగా ఉన్నాడు. మదనపల్లె ఫైల్స్ దగ్ధం వెనుక కైలే అనిల్ కుమార్ కుట్ర కూడా ఉంది. ఫైల్స్ దగ్ధం కేసులో ప్రధమ సూత్రధారి ఏ1 పెద్దిరెడ్డి పీఏ శశిధర్ అయితే ఏ2 కైలే అనిల్ కుమార్.

హైదారాబాద్ మాధాపూర్ అయ్యప్ప సొసైటీలో వీళ్ళిదరూ ఒక ఫ్లాట్‌లో ఉంటూ అక్కడ నుంచే వ్యవహారాలన్నీ నడిపారు. హైదరాబాద్, పామర్రు, పుంగనూరు మొత్తం రాష్ట్రంలో పెద్దిరడ్డికి బినామీలు ఉన్నారు. పెద్దిరెడ్డి డబ్బులతో కైలే అనిల్ ఆస్తులు కూడబెట్టాడు. ఇసుక దందాల్లో సిద్దహస్తుడు. పామర్రు పవిడిముక్కలో పోలీసులపై కూడా కైలే అతని అనుచరులు దాడులు చేశారు. కైలే వలన పోలీసులు సైతం బాధితులగా మారారు. తొట్లవల్లూరులో ఇసుక దందాను ప్రశ్నించిన పోలీసు అధికారులను జైలుకు పంపించారు. ఎన్నికల అఫిడవిట్‌లో రూ.5.35 లక్షలు వార్షిక ఆదాయమని కైలే అనిల్ కుమార్ పొందుపర్చారు. కానీ పామర్రులో అనిల్ కుమార్ ఆస్తులు చూస్తే అందరూ అవాక్కవ్వాల్సిందే” అని అన్నారు.

పాపాల పెద్దిరెడ్డి డబ్బుతో ఆస్తులు కూడబెట్టుకున్న కైలే అనిల్ కుమార్

“త్యాడేపల్లి ప్యాలేస్ తలదన్నేలా, హైదరాబాద్ లోటస్ పాండ్‌లా పామర్రులో ఇంద్రప్రస్థానాన్ని కైలే అనిల్ కుమార్ కట్టుకున్నారు. రూ.5.35 లక్షలు వార్షిక ఆదాయంతో రూ.12 కోట్ల వ్యయంతో మినీ లోటస్ పాండ్ ఎలా కట్టుకున్నావు అనిల్ కుమార్? హైదరాబాద్‌లో కొన్న భూముకి డబ్బులెక్కడివి? పామర్రులోని పాములపాడు గ్రామంలో 11.20 ఎకరాల భూమి కైలే అనిల్ కుమార్ భార్య పేరుతో ఉంది. ఆ భూమిని ఎన్నికలకు మూడు సంవత్సరాలు ముందు కొన్నారు. దాన్ని అఫిడవిట్‌లో చేర్చాల్సి వస్తుందని బినామీ పేరు మీదకు అమ్మేశారు.

బాపులపాడు మండలం మల్లవల్లి గ్రామంలో సర్వే నెం.197/6 లో భ్రహ్మాండమైన స్థలాన్ని కొనడానికి డబ్బులు ఎక్కడివి కైలే అనిల్? హైదరాబాద్‌లో సర్వే నెం.308లో పొలాలను కైలే అనిల్ కొనుగోలు చేశారు. 2005లో నాకు టూ వీలర్ ఉందని అఫిడవిట్‌లో పొందుపర్చిన కైలేకి నేడు 4 ఫార్చూనర్ కార్లు, పామర్రు, విజయవాడ, హైదరాబాద్, బెంగళూరు, హనుమాన్ జంక్షన్‌లో ప్యాలెస్‌లు ఎలా వచ్చాయి? వీటిన్నటికీ కైలే అనిల్ కుమార్ ధైర్యం ఉంటే సమాధానం చెప్పాలి. లేదా సీబీసీఐడి విచారణకు రెడీగా ఉండాలి. కైలే అనిల్ కుమార్‌పై కూడా సీబీసీఐడీ ద్వారా విచారణ జరిపించాలి” అని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.

పెద్దిరెడ్డి సేవలోనే కైలే అనిల్ కుమార్

2019లో ఎమ్మెల్యే చేసిన పాపానికి పామర్రు ప్రజలకు కైలే అనిల్ కుమార్ క్షమాపణ చెప్పాలి. దళితుల ఆత్మగౌరవాన్ని కైలే అనిల్ మంటగలిపారు. దళితుడువి అయి ఉండి ఒక పెత్తందారుడికి బినామీగా ఉన్నాడు. ఎమ్మెల్యేగా 5 సంవత్సరాలు ప్రజలకు సేవ చేయకుండా పెద్దిరెడ్డికి సేవల చేయడంలో నిమగ్నమయ్యాడు. బినామీ నెం.2 గా కైలే అనిల్ చెలామని అవుతున్నారు. తీగ లాగితే డొంక కదిలిందన్నట్లుగా మదనపల్లెలో ఫైల్స్ దగ్ధం జరిగితే పామర్రులో డొంకలు కదులుతున్నాయి. రాష్ట్రంలో ఉన్న పెద్దిరెడ్డి ప్రతీ డొంకలను బయటకు లాగుతాం. పెద్దిరెడ్డి ప్రతీ తీగను బయటకు తీస్తాం. పాపాల పెద్దిరెడ్డి బినామీలందరినీ బహిర్గతం చేస్తాం. పెద్దిరెడ్డి కదలికలపై నిఘా పెట్టాలని డీజీపీకి విజ్ఞప్తి చేస్తున్నాం. పుంగనూరులో మరలా ప్రజా తీర్పును కోరే ధైర్యం పెద్దిరెడ్డికి ఉందా? పెద్దిరెడ్డి బినామీల్లో ఒక్కరైనా అప్రూవర్‌గా మారితే పెద్దిరెడ్డి కృష్ణుడి జన్మస్థలానికి చేరుతారు” అని తెలియజేశారు.

తండోపతండాలుగా ఎన్టీఆర్ భవన్‌కు వస్తున్న వైసీపీ బాధితులు…
ప్రతీ ఇంటికి మంచి చేశానంటేనే నాకు ఓటు వేయండని జగన్ రెడ్డి అన్నారు. కానీ ప్రజలు దాన్ని సీరియస్‌గా తీసుకొని ఓటు వేయలేదు. ఏది చెప్పామో అది చంద్రబాబు చేసి చూపిస్తున్నారు. గత పాలకుల వల్ల నష్టపోయిన, వేధన అనుభవించిన బాధితులు నేడు టీడీపీ కేంద్ర కార్యాలయానికి క్యూ కట్టారు. రోజుకు 4 వేలు నుంచి 5 వేల మందికి పైగా అర్జీలు ఇస్తూ మాకు న్యాయం చేయండని వేడుకుంటున్నారు. జగన్ రెడ్డి నిరంకుశ, నియంతత్వ పాలన అనడానికి ఇదే నిదర్శనం. పెద్దిరెడ్డి బాధితులు కూడా తండోపతండాలుగా వస్తున్నారు. ఎక్కువగా భూ వ్యవహరాలపైనే అర్జీలు వస్తున్నాయి. ప్రతీ ఒక్కరికీ న్యాయం చేసే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుటుంది” అని తెలిపారు.

దళితుల ఆత్మగౌరవాన్ని వైసీపీ మంటగల్పింది….

“డా.బీఆర్ ఆంబేద్కర్ స్మృతి వనాన్ని ఎవరూ అవుమానించలేదు. స్మృతి వనంలో జగన్ రెడ్డి పేరు తాటాకులాంటి అక్షరాలతో పెద్దది పెట్టుకొని అంబేద్కర్ పేరు చిన్నది పెట్టడంతో దళితుల మనోభావాలు దెబ్బతిన్నాయి. మొన్నటివరకు జగన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి దళితులకు వాక్ స్వాతంత్ర్య లేదు. ఇప్పుడు ప్రజాస్వామ్య పాలన రావడంతో, దళితులకు వాక్ స్వాతంత్ర్యం రావడంతో మనోభావానికి గురైన ఎవరో దళిత సోదరులు జగన్ రెడ్డి పేరును తొలగించే ప్రయత్నం చేశారు తప్ప స్మృతి వనంలో ఎటువంటి అరాచకం జరగలేదు. కానీ వైసీపీ మూకలు, అవినీతి సాక్షి పత్రిక అంబేద్కర్‌కు అవమానం జరిగిందని కావాలనే చిత్రీకరిస్తున్నారు. అంబేద్కర్ విదేశీ విద్యకు అంబేద్కర్ గారి పేరును తొలగించి జగన్ రెడ్డి పేరును పెట్టుకున్నప్పుడే అంబేద్కర్ గారికి అవమానం జరిగింది.

దళితులను చంపి డోర్ డెలివరీ చేసిన వారిని పక్కనే పెట్టుకొని తిరుగున్న జగన్ రెడ్డికి అంబేద్కర్ గురించి మాట్లాడే అర్హత లేదు. 20 ఎకరాల్లో బ్రహ్మాండంగా అంబేద్కర్ స్మృతి వనాన్ని ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకొని బడ్జెట్ మంజూరు చేసి నమూన అంబేద్కర్ విగ్రహాన్ని పెడితే… దాన్ని అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే జగన్ రెడ్డి ధ్వంసం చేశారు. తెలంగాణాలో రూ.250 కోట్లుతోనే అంబేద్కర్ విగ్రహాన్ని కడితే జగన్ రెడ్డి మాత్రం రూ.450 కోట్లు ఖర్చు పెట్టారు. అంబేద్కర్ విగ్రహ ఏర్పాటు పేరుతో కోట్ల రూపాయిలు స్వాహా చేశారు. రూ.43 కోట్లు ఖర్చు పెట్టి కుటుంబంతో కలిసి విదేశీ విలాసాలకు జగన్ రెడ్డి ఖర్చు పెట్టారు.

ఖర్చు పెట్టిన అదే డబ్బుల్లో రూ.10 లక్షల చొప్పున అంబేద్కర్ విదేశీ విద్యకు కేటాయించి ఉంటే 430 మంది దళిత బిడ్డలు చదువుకునేవారు. జగన్ రెడ్డి మేనమామ కాదు శకుని మామ లాంటివాడు. నమ్మలేని మామ కాబట్టే ప్రజలెవ్వరూ నమ్మలేదు. అందుకే 29 దళిత ఎమ్మెల్యే స్థానాల్లో 27 సీట్లు ఎన్డీఏ కైవసం చేసుకుంది. చంద్రబాబును నమ్మి అభివృద్ధి, సంక్షేమ పాలనను జనం కోరుకున్నారు. ప్రజాక్షేత్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుతాం. ప్రజలందరూ స్వేచ్ఛగా జీవించే విధంగా ఎన్డీఏ పాలన ఉంటుంది” అని కుమార్ రాజా తెలిపారు.

LEAVE A RESPONSE