కేసీఆర్‌కు బిగ్ షాక్
భూపాలపల్లి: డిజైన్ల మార్పు, నాణ్యత లోపాలే మేడిగడ్డ కుంగుబాటుకు కారణమంటూ ఆరోపిస్తూ దాఖలైన ఓ పిటిషన్‌పై విచారణలో బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్‌కు భూపాలపల్లి కోర్టు నోటీసులు జారీ చేసింది.
సెప్టెంబర్ 5న మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులు వ్యక్తిగతంగా హాజరు కావాలని కోర్టు ఆదేశించింది. మరో ఆరుగురికి కూడా నోటీసులు జారీ చేసింది. కాగా మేడిగడ్డ బ్యారేజీ వైఫల్యంపై రాజలింగంమూర్తి అనే సామాజిక కార్యకర్త ఈ పిటిషన్ దాఖలు చేశారు. డిజైన్లు మార్చడం, నాణ్యత లోపాల కారణంగానే మేడిగడ్డ ప్రాజెక్టు కుంగుబాటుకు గురైందంటూ పిటిషన్‌లో రాజలింగం మూర్తి ఆరోపించారు.