Suryaa.co.in

Andhra Pradesh

కుప్పంలో చంద్రబాబుకు బిగ్‌షాక్‌

ఇప్పటికే జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లను కోల్పోయిన టీడీపీ.. తాజాగా మున్సిపల్‌ ఎన్నికల్లోనూ బొక్కబోర్లా పడింది. మున్సిపాలిటీలోని 25 వార్డుల్లో 19 వార్డుల్లో వైఎస్సార్‌సీపీ ఘన విజయం సాధించింది. భారీ మెజారిటీతో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు విజయ ఢంకా మోగించారు. మొదటి రౌండ్‌లో 15 వార్డులకుగాను 13 వార్డుల్లో వైఎస్సార్‌సీపీ విజయం సాధించగా.. టీడీపీ కేవలం రెండు వార్డులకే పరిమితమైంది. తర్వాత వెలువడిన ఫలితాల్లోనూ టీడీపీ అభ్యర్థులు తేరుకోలేకపోయారు. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలనకు కుప్పం మున్సిపాలిటీ ప్రజలు పట్టం కట్టారు. చంద్రబాబు సొంత నియోజకవర్గంలోని కుప్పం మున్సిపాలిటీని కాపాడుకోలేకపోయారు. మొత్తంగా టీడీపీ కేవలం 6 స్థానాలకే పరిమితమై పరాభవాన్ని మూటగట్టుకుంది.

LEAVE A RESPONSE