– పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్
విజయవాడ: ప్రధాని మోదీ సారథ్యంలో దేశం అభివృద్ధి దిశగా వెళ్తున్న నేపథ్యంలో బీజేపీ ఏపీ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం ఘనగా సారథ్యం లోగో ని రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాధవ్ విలేకర్లతో మాట్లాడారు. బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యత స్వీకరించిన అనంతరం రాష్ట్ర పర్యటన మొదలు పెడుతున్నాం.. దేవుని తొలిగడప కడప నుంచి మొదలవుతుంది. ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ గా బీజేపీ ఎదిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కార్యకర్తలతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. ఇంకా, ఆయన ఏమన్నారంటే… మోదీ సారథ్యంలో దేశం ఏవిధంగా అభివృద్ధి బాటలో వెళ్తుందో రాష్ట్ర వ్యాప్తంగా సార్థ్యం కార్యక్రమంతో ప్రజల్లోకి వెళ్తున్నాం.
దేశం ఒక గ్లోబల్ ఫోర్స్ గా ఎలా తీర్చిదిద్దారో ప్రతి ఒక్కరు తెలుసుకువాల్సిన అవసరం ఉంది. అట్టడుగు వర్గాలు బలోపేతం చేయాలని ఆలోచన ధోరణితో అంత్యోదయ ఉద్దేశంతో సాథ్యం ఉంటుంది. ఐదు విడతలుగా ఈ కార్యక్రమం అనేది రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన కొనసాగనుంది.
తొలి శాసనం దొరికిన జిల్లా, మన జాతి, మన సంస్కృతి కి ప్రధాన ద్వారంగా నిలిచిన కడప నుంచి పర్యటన మొదలుపెట్టడం జరుగుతుంది. కార్యకర్తల్లో నాయకత్వం లక్షణాలని వెలికి తీసే కార్యక్రమాలు జరగనున్నాయి. వివిధ స్థాయిలో బాధ్యత తీసుకున్న బీజేపీ నాయకుల్లో ధైర్యం, స్థైర్యం తో పాటు రాష్ట్రంలో బీజేపీ జెండా రెప రెపలాడే విధంగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తాం. లిక్కర్ స్కామ్ లో జరిగిన అవినీతిని పూర్తి స్థాయిలో ప్రభుత్వం వెలికి తీస్తుంది. గత ప్రభుత్వంలో శాఖకి సంబంధం లేని వ్యక్తులు ఇంత స్కామ్ కి పాల్పడిన వ్యక్తులపై చర్యలు ఉంటాయి. రాష్ట్ర రాజధాని నిర్మాణంలో బీజేపీ చిత్తశుద్ధితో ఉంది.
మోదీ శంకుస్థాపన, పునఃనిర్మాణ కార్యక్రమానికి విచ్చేశారు. అమరావతి కి అనుసరించేందుకు రైల్వే కనెక్టివిటీ ప్రయత్నాలు చేస్తున్నాం. 30వేల కోట్ల రూపాయలతో అమరావతిలో అనేక నిర్మాణాలకి కేంద్రం సహాయ సహకారాలు అందిస్తోంది. అమరావతి ఒక భవ్యమైన రాజధానిని నిర్మించేందుకు కేంద్రం కట్టుబడి ఉంది. ఢిల్లీ పర్యటనలో భాగంగా ఏపీ అభివృద్ధి కొరకు కేంద్ర మంత్రులతో అనేక అంశాలపై చర్చించాం. రాష్ట్రానికి తోడ్పాటు అందించటంలో మోదీ సైతం ముందుంటామని హామీ ఇచ్చారు. నామినేటెడ్ పదవుల్లో కూటమి నాయకులు కలిసి నిర్ణయాలు తీసుకుంటారు. సంప్రదాయానికి అనుకూలంగా సమన్వయంతో ముందుకి వెళ్తాం.
పాత్రికేయుల సమావేశంలో 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్, మైనారిటీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు షేక్ బాజీ, బీజేపీ అధికార ప్రతినిధి సాధినేని యామినీ శర్మ, ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు రొంగల గోపి శ్రీ నివాస్, సోషల్ మీడియా ఇంఛార్జి కేశవ్ కాంత్, ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు అడ్డూరి శ్రీ రాం తదితరులు పాల్గొన్నారు.