Suryaa.co.in

Andhra Pradesh

ఉద్యోగులకు బిజెపి అండగా ఉంటుంది: కన్నా లక్ష్మీనారాయణ

గుంటూరు జిల్లా భారతీయ జనతాపార్టీ ఆధ్వర్యంలో లాల్ పురం రోడ్డునందు గల జిల్లా కార్యాలయంలో 73 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.ముఖ్యఅతిథిగా విచ్చేసిన బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు కన్నా లక్ష్మీనారాయణ జాతీయ జెండా ఎగుర వేశారు.

ఈ సందర్భంగా కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రజలందరికీ 73 వ గణతంత్ర దినోత్సవ
kannaశుభాకాంక్షలు తెలియజేస్తూ ఆకాంక్షలతో అయితే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని నిర్మాణం చేశారో మహాత్మాగాంధీ అంబేద్కర్ గారి కలలకు అనుగుణంగా ఈరోజు ప్రధాని నరేంద్ర మోడీ సంపూర్ణ భారత దేశ అభివృద్ధికి ఆయన చేస్తున్నటువంటి కృషికి ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరఫున మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.

కొత్త జిల్లాలను బిజేపి స్వాగతిస్తుంది. బిజెపి మ్యానిఫెస్టో లో కూడా జిల్లాల పెంపు అంశం పెట్టాం.అయితే జిల్లాల ఏర్పాటు అంశంపై కొంత చర్చ జరగాల్సి ఉంది.
ఉద్యోగులకు బిజేపి అండగా ఉంటుంది. గతంలో ఎన్నడూ లేని విదంగా పిఆర్సి ఉంది. వైసిపి ప్రభుత్వం ప్రతిది రివర్స్ లో నడుస్తుంది.జగన్ పాలన అంతా రివర్స్ పాలన అని విమర్శించారు.

ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు లీగల్ సెల్ చైర్మన్ జూపుడి రంగరాజు, బిజెపి రాష్ట్ర కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు కంతేటి బ్రహ్మయ్య, ప్రధాన కార్యదర్శి రాచుమల్లు భాస్కర్, అప్పి శెట్టి రంగ, పాల పాటి రవికుమార్,ఈదర శ్రీనివాసరెడ్డి, వనమా నరేంద్ర, భీమినేని చంద్రశేఖర్, పాండురంగ విఠల్, ఉయ్యాల శ్యాం వరప్రసాద్, అనుమొలు ఏడుకొండలు గౌడ్,బుజ్జిబాబు,కొక్కెర శ్రీనివాస్,ఆవుల రాము,రాజేష్ నాయుడు, బుల్లిబాబు,రామకృష్ణ, జితేంద్ర గుప్తా,రాష్ట్ర మీడియా కోకన్వీనర్ వెలగలేటి గంగాధర్, నమ్రత చౌదరి,నాగలక్ష్మి, ఏలూరి లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE