– బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు కన్నా లక్ష్మీనారాయణ
రెండు సీట్ల తో ప్రారంభమైన బీజేపీ పార్టీ ఇప్పుడు నరేంద్ర మోదీ నాయకత్వంలో వరుసగా రెండు సార్లు అధికారంలోకి వచ్చిందని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. రాజీలేని దేశ రక్షణ బిజెపి పార్టీ సిద్ధాంతమన్నారు ప్రపంచంలోనే అత్యధిక సభ్యత్వం కలిగిన బిజెపి పార్టీ అన్నారు. ప్రతి ఒక్కరూ పార్టీ అభివృద్ధి కోసం కృషి చేయాలన్నారు.
భారతీయ జనతా పార్టీ 43 ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గుంటూరు జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు పాటిబండ్ల రామకృష్ణ అధ్యక్షతన, ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా పార్టీ కార్యాలయం వద్ద పార్టీ జెండాను జాతీయ కార్యవర్గ సభ్యులు కన్నా లక్ష్మీనారాయణ ఎగరవేశారు ఆ తర్వాత పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన స్క్రీన్లో ఢిల్లీ నుంచి మోడీ గారు పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడిన ప్రసంగాన్ని అందరూ కలిసి వీక్షించారు.
జనసంఘ్ నుంచి భారతీయ జనతాపార్టీ వరకు పనిచేసిన జూపూడి హైమావతి, వనమా పూర్ణచంద్ర రావు , కోట బ్రహ్మయ్య గారు శంకర్రావు , నేరెళ్ల మాధవరావు , సైదా రెడ్డి జూపూడి రంగరాజు సీనియర్ కార్యకర్తలను నాయకులను ఈ సందర్భంగా ఘనంగా సన్మానించారు.
అనంతరం పార్టీ కార్యాలయం నుంచి బయలుదేరి ఎత్తు రోడ్డు హిందూ కాలేజీ జిన్నా టవర్ రమేష్ హాస్పటల్ మీదుగా, రామనామ క్షేత్రంలోని భరతమాత విగ్రహం వరకు పాటిబండ్ల రామకృష్ణ ఆధ్వర్యంలో శోభాయాత్ర బైక్ ర్యాలీ చేపట్టడం జరిగింది.
భారతీయ జనతా పార్టీ 43 వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా గుంటూరు జిల్లా పార్టీ కార్యాలయం దగ్గర గుంటూరు జిల్లా అధ్యక్షుడు పాటిబండ్ల రామకృష్ణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులు కన్నా లక్ష్మీనారాయణ గుంటూరు పార్టీ కార్యాలయంలో బీజేపీ జండాను ఎగరవేశారు.జిల్లా అధ్యక్షులు పాటిబండ్ల రామకృష్ణ మాట్లాడుతూ నరేంద్ర మోదీ లాంటి నాయకుడు ఉన్న పార్టీ లో కార్యకర్తలు గా ఉండటం అదృష్టం గా భావిస్తున్నాను అన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి శనక్కాయల అరుణ,జూపుడి రంగరాజు,కాయితి సైదారెడ్డి, లేబర్ బోర్డ్ చైర్మన్ వల్లూరు జయప్రకాష్ నారాయణ, జిల్లా ప్రధాన కార్యదర్శులు చరకా కుమార్ గౌడ్ రాచుమల్లు భాస్కర్,అప్పిశెట్టి రంగా, నీలం ప్రసాద్, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు యడ్లపాటి స్వరూపరాణి, రమాకుమారి,అమ్మిశెట్టి ఆంజనేయులు,పాలపాటి రవికుమార్,ఈదర శ్రీనివాస్ రెడ్డి,వనమా నరేంద్ర,ఆవుల రాము, అనుమొలు ఏడుకొండలు గౌడ్,కన్నా రవిదేవరాజు,సురేష్ కుమార్ జైన్, నమ్రతా చౌదరి,కోలా రేణుకాదేవి,లాల స్వాతి, దుంప కరుణశ్రీ, తదితరులు పాల్గొన్నారు..