– మీడియాతో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా దేశ ప్రజలారా.. బీజేపీ పార్టీ ఓట్లు చోరీ విషయంలో ఎన్నికల కమిషన్ కు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న రాహుల్ గాంధీ కి మద్దతుగా నిలవండని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన బుధవారం రాష్ట్ర కాంగ్రెస్ కార్యాలయం ఆంధ్రరత్న భవన్ లో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో మాట్లాడారు. కేంద్ర ఎన్నికల కమిషనర్ బీజేపీ, ఆర్ఎస్ఎస్ లు రాసిచ్చిన స్క్రిప్ట్ చదువుతున్నారని విమర్శించారు. ఇంకా, ఆయన ఏమన్నారంటే.. రాహుల్ గాంధీ అడుగుతున్న ప్రశ్నలపై ఎంక్వైరీ చేయడం లేదు.
అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఉండకూడదు అనేది బీజేపీ కుట్ర! రాహుల్ గాంధీకి ప్రధాని పదవి కొత్త కాదు.. ఆ ప్రధాని పోస్టు పుట్టిందే వాళ్ళింట్లో.
ఈసీని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. రాహుల్ గాంధీ కుటుంబం మీద బీజేపీ ది కక్ష సాధింపు. ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థల ద్వారా దొంగ ఓట్లు తయారు చేశారు. ఎలక్షన్ కమీషన్ కూడా ఆర్ఎస్ఎస్ స్క్రిప్ట్ రీడర్ అని చెప్పక తప్పడం లేదు. పాకిస్తాన్ లాంటి విధానాలు అమలు చేయాలనే కుట్ర బీజేపీ చేస్తోంది. ఓటుహక్కు మి చేతిలోంచి పోవాలనేదే బీజేపీ ఆలోచన ప్రజలారా గమనించండి. రాహుల్ గాంధీ ప్రయత్నాలకు తోడవండి.
ఆ పోస్టు ఆశ పెద్దగా వారికి ఉండదు. అలమరా ఎత్తుకెళ్ళిపోడు ఏ దొంగా.. ఏం అనుకుంటున్నారు కిరణ్ కుమార్ రెడ్డిగారూ.. ఏపీకి బీజేపీ తండ్రి, జగన్, చంద్రబాబు కొడుకులు…
ఏపీ పాలిటిక్స్ కల్లుదుకాణం దగ్గర కూచునే అన్నదమ్ముల్లా ఉంటుంది. బీజేపీ కల్లు దుకాణం.. అన్నదమ్ములు చంద్రబాబు, జగన్.. రాష్ట్ర విభజనకు లెటర్లు ఇచ్చింది చంద్రబాబు, జగన్. మా కాంగ్రెస్ లో అందరూ దమ్మున్నోళ్ళమే.. కోమటిరెడ్డి సోదరులు దమ్మున్న వాళ్ళే… చంద్రబాబు, జగన్ లు ఇద్దరూ బానిసలు. ఎలక్షన్ కమీషన్ బీజేపీ అడుగు జాడల్లో నడుస్తోంది. బీజేపీ, ఆర్ఎస్ఎస్ ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్నాయి. దేశ ప్రజల స్వేచ్ఛను అణగదొక్కే కుట్ర బిజెపి, ఆర్ఎస్ఎస్ చేస్తున్నాయి.
ప్రతీ ఒక్కరికీ ఓటు ద్వారా స్వతంత్రం, స్వేచ్ఛ రాజ్యాంగం కల్పించింది. ఎవ్వరూ ఊహించని విధంగా మూడోసారి మోదీ ప్రధాని అయ్యాక పలు అనుమానాలు వచ్చాయి. మోదీ ప్రధాని అవడానికి కారణమైన నలభైకి పైగా ఎంపీల ఓట్లు బోగస్ అని అనుమానం. అది నిజమా అబద్ధమా చెప్పాల్సిన బాధ్యత ఎన్నికల కమీషన్ ది..
భద్రతగా భావించే ఎలక్షన్ కమీషన్ తప్పు దారి పట్టింది. మారుమూల గ్రామాలలో, కనిపించని ప్రాంతాలలో దొంగ ఓట్లను నమోదు చేయించి గెలుపుకు ప్రణాళిక చేశారు. దొంగ ఓట్ల ద్వారా అధికారం లోకి వచ్చారు. ముఫ్ఫై, నలభై ఏళ్ళ నుంచీ ఇది జరుగుతోందని అనుమానం. వ్యూహాత్మకంగా బీజేపీ చేస్తున్న ప్రయత్నం.
దేశం మొత్తం ఈ దొంగ ఓట్ల ప్రక్రియ జరిగింది. రాహుల్ గాంధీ కుటుంబం మీద బీజేపీ ది కక్ష పూరితంగా వ్యవహరిస్తుంది. మూడోసారి బీజేపీ రావడానికి చేసిన కుట్ర దొంగ ఓట్లు. ఎలక్షన్ కమీషన్ బీజేపీ అడుగు జాడల్లో నడుస్తోంది. కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ హయాంలో మాజీ సీఎం. బీజేపీ స్క్రిప్ట్ చదవాలి కాబట్టి కిరణ్ కుమార్ రెడ్డి అదే చేశారు. కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీ లీడరా, ఎన్నికల కమీషనరా అర్థం కాలేదు. బీజేపీ ప్రముఖ్ ఇచ్చిన చిట్టీ తీసుకుని చదివాడు.. కిరణ్ కుమార్ రెడ్డి ఒక స్క్రిప్టు రీడర్. పురంధేశ్వరి ఎన్టీఆర్ కూతురైనా బీజేపీ స్క్రిప్టు చదవాల్సిందే.
ఈ సమావేశంలో ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ మస్తాన్ వలి, ఏపీసీసీ ఉపాధ్యక్షుడు కొలనుకొండ శివాజీ, ఏపీసీసీ ప్రధాన కార్యదర్శి (ఇన్ ఛార్జ్ అడ్మిన్ అండ్ ఆర్గనైజేషన్) ఎస్.ఎన్.రాజా, శ్రీ పరసా రాజీవ్ రతన్, గంగిశెట్టి ఉమా శంకర్, షేక్ ఖుర్షిదా, జిల్లా అధ్యక్షులు బొర్రా కిరణ్, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు నరహరశెట్టి నరసింహ రావు, అధికార ప్రతినిధి కాసరగడ్డ నాగార్జున, తదితరులు పాల్గొన్నారు.
–