గోవా: గోవా గవర్నర్ గా అశోక్ గజపతి రాజు ప్రమాణ స్వీకారం సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్, కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేతలు గవర్నర్ ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి హాజరయ్యారు. పివిఎన్ మాధవ్, భూపతిరాజు శ్రీనివాస వర్మ సంయుక్తంగా గవర్నర్ అశోక్ గజపతి రాజు ను సన్మానించారు. అనంతరం కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ తో కలిసి మాధవ్ గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ని మర్యాద పూర్వకంగా కలిసారు. కొద్దిసేపు ముగ్గురు భేటీ అయ్యారు.
గోవా రాష్ట్ర మర్యాదలతో ముఖ్య మంత్రి ప్రమోద్ సావంత్ భూపతిరాజు శ్రీనివాస వర్మ, మాధవ్ ను సత్కరించారు.