– ‘ఉద్యమ ఆకాంక్షల సాధన సభ’లో కేసీఆర్ చేసిన ద్రోహంపై నిప్పులు చెరిగిన ఉద్యమ సహచరులు
– నాతోపాటు ఎంతోమందికి సీఎం, మంత్రి పదవుల ఆశ చూపి మోసం చేసిన కేసీఆర్ : మాజీమంత్రి చంద్రశేఖర్
-కేసీఆర్ ను నమ్మి రాజధానిలో 12 ఎకరాలు అమ్మి మోసపోయా : మాజీ ఎంపీ రవీంద్రనాయక్
-కేసీఆర్ కుటుంబంతో తెలంగాణకు పెను ప్రమాదం : మాజీమంత్రి విజయరామారావు
-అమరవీరుల స్థూపానికి మొక్కేందుకు కేసీఆర్ సిగ్గన్పించడం లేదా : మండలి మాజీ ఛైర్మన్ స్వామిగౌడ్
-కేసీఆర్ బదులు సీఎం పీఠంపై ఎవరున్నా ఇంటికో ఉద్యోగం వచ్చేది : సీహెచ్ విఠల్
-అమరవీరుల కుటుంబాలకు సాయం చేసేందుకు నిరాకరించిన కఠినాత్ముడు కేసీఆర్ : ఎమ్మెల్యే రఘునందన్ రావు
-సింగరేణి కార్మికుల ఆకాంక్షలను దెబ్బతీసిన కేసీఆర్ : బీజేపీ ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్
-దరువు ఎల్లన్న ఆధ్వర్యంలో కేసీఆర్ నైజాన్ని ఎండగట్టిన కళాకారుల బృందం
వారంతా తెలంగాణ ఉద్యమకారులు… నేటి ముఖ్యమంత్రి కేసీఆర్ తో కలిసి తెలంగాణ సాధన కోసం ఉద్యమించిన సహచరులు… వీళ్లలో నాటి తెలంగాణ పోరాటంలో ఆస్తులు కోల్పోయిన వాళ్లు కొందరు… రాజకీయ జీవితాలను ఫణంగా పెట్టిన వాళ్లు మరికొందరు…ఉద్యోగాలనే త్యాగం చేసిన వాళ్లు ఇంకొందరు… తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ ఉద్యమ నాయకుడు, బీజేపీ రాష్ట్ర నాయకులు జిట్టా బాలక్రిష్ణారెడ్డి ఆధ్వర్యంలో హైదరాబాద్ శివారులోని తట్టి అన్నారం వద్దనున్న ‘జే’ కన్వెన్షన్ లో నిర్వహించిన ‘అమరుల యాదిలో… తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల సభ’కు ఆయా ఉద్యమ నేతలంతా హాజరయ్యారు.
ఈ సందర్భంగా నాటి తెలంగాణ ఉద్యమ పోరాట స్ర్ముతులు నెమరేసుకున్నారు. అమరుల త్యాగాలను స్మరించుకున్నారు. అదే సమయంలో కేసీఆర్ తమకు చేసిన ద్రోహాలను, మోసాలను ఏకరవు పెడుతూ కేసీఆర్ నైజాన్నిబయట పెట్టారు. అధికారంలోకి వచ్చాక యావత్ తెలంగాణ ప్రజానీకానికి కేసీఆర్ చేస్తున్న మోసాలను ఎండగట్టారు. ప్రముఖ కళాకారుడు, తెలంగాణ ఉద్యమకారుడు దరువు ఎల్లన్న ఆధ్వర్యంలోని
కళాకారుల బ్రుందం కేసీఆర్ చేసిన మోసాలను పాటలు, డ్యాన్సుల రూపంలో ఎండగట్టారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్, ఎమ్మెల్యే రఘునందన్ రావుతోపాటు నాటి తెలంగాణ ఉద్యమకారులు, మాజీమంత్రులు డాక్టర్ ఏ.చంద్రశేఖర్, డాక్టర్ విజయరామారావు, శాసనమండలి మాజీ ఛైర్మన్ స్వామిగౌడ్, మాజీ ఎంపీలు ఏపీ జితేందర్ రెడ్డి, రవీంద్ర నాయక్, మాజీ ఎమ్మెల్యే మందాడి సత్యనారాయణరెడ్డి, టీఎస్పీఎస్సీ మాజీ సభ్యుడు సీహెచ్.విఠల్, బీజేపీ ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి
ఎస్.కుమార్, పాదూరి కరుణ, రావు పద్మ, సుభాష్ చందర్ జీతోపాటు పలువురు ప్రొఫెసర్లు, విద్యార్ధి సంఘాల నాయకులు హాజరై ప్రసంగిస్తూ కేసీఆర్ నైజాన్ని బట్టబయలు చేశారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన ఈ సభ సాయంత్రం పొద్దుపోయే వరకు కొనసాగింది. సభ ఆరంభం నుండి ముగిసే వరకున్న బండి సంజయ్ సభలోనే ఉండి వక్తలందరి ప్రసంగాలను ఆసక్తిగా విన్నారు. ఈ సందర్భంగా ఆయా నేతల్లో కొందరు చేసిన ప్రసంగాలు వారి మాటల్లోనే….
ఉమ్మడి ఏపీలోనే సీఎం పదవి కోసం వెంపర్లాడిన కేసీఆర్ : మాజీ మంత్రి డాక్టర్ చంద్రశేఖర్
కేసీఆర్ కు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు సీఎం కావాలని వెంపర్లాడిండు. చంద్రబాబు సీఎంగా ఉండగా 60 ఎమ్మెల్యేలను చీల్చి ప్రత్యేక హెలికాప్టర్ల ద్వారా గవర్నర్ ను కలిసి ప్రభుత్వాన్ని పడగొట్టాలని కుట్ర చేసిండు. చంద్రబాబుకు ముందే విషయం తెలియడంతో కేసీఆర్ కుట్రకు అడ్డుకట్ట పడింది. తెలంగాణ ఉద్యమ సమయంలో నాతోపాటు ఎంతోమందికి ముఖ్యమంత్రి, మంత్రి పదవుల ఆశచూపి మోసం చేశాడు. దళితులందరికీ 3 ఎకరాల భూమిని పంపిణీ చేసే అవకాశం ఉన్నప్పటికీ… కేసీఆర్ వాటిని పంచేందుకు ఇష్టపడకుండా దళితులకు ద్రోహం చేస్తున్నడు. బీజేపీ అధికారంలోకి వస్తే ఇప్పటికీ అర్హులైన పేద దళితులందరికీ 3 ఎకరాల భూమిని పంపిణీ చేసే అవకాశం ఉంది. ఒకవేళ దళితులకు మూడు ఎకరాల భూమిని పంపిణీ చేయలేకపోయిన నాడు రాజకీయాల నుండి శాశ్వతంగా తప్పుకుంటా.
కేసీఆర్ వంటి రాస్కెల్.. నీచుడ్ని నేనెక్కడా చూడలే : మాజీ ఎంపీ రవీంద్రనాయక్
ముఖ్యమంత్రి కేసీఆర్ అంతటి నీచుడు, రాస్కెల్ ను నేనెక్కడా చూడలే. ఆయనను నమ్మి 12 ఎకరాల భూమిని అమ్మేసి డబ్బులిచ్చి మోసపోయిన. నాలాంటి ఎందరో నాయకుల రాజకీయ భవిష్యత్తును నాశనం చేసిన చోర్ కంది కేసీఆర్. సీఎం కేసీఆర్ అవినీతిని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎండగట్టారు. ఇకపై కేసీఆర్ బద్మాష్ పనులతోపాటు ఆయన అవినీతిపై బీజేపీ పెద్ద ఎత్తున పోరాటం కొనసాగించాలి.
కేసీఆర్ కుటుంబంతో తెలంగాణకు పెను ప్రమాదం : మాజీమంత్రి డాక్టర్ విజయరామారావు
కళ్లుతాగి ఉళ్లను తాకట్టు పెట్టినోళ్లను ఎంతోమందిని చూసిన. కేసీఆర్ అంతకంటే ఎక్కువ. మందుతాగి రాష్ట్రాన్ని బేరం పెడుతున్నడు. కోటి ఎకరాలకు సాగునీరందిస్తామని హామీనిచ్చి కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో వేల కోట్లు దోచుకుంటున్న నేత కేసీఆర్. ఇయాళ కేసీఆర్ కుటుంబంతో తెలంగాణకు పెను ప్రమాదం పొంచి ఉంది. రాష్ట్ర ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి.
బీజేపీ ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్ మాట్లాడుతూ…
సింగరేణి కార్మికుడు చెమట చుక్కతోనే ఈనాడు దక్షిణ తెలంగాణకు వెలుగులొస్తున్నాయి. తెలంగాణ ఉద్యమంలో వేలాది సింగరేణి కార్మికుల పాత్ర మరువలేనిది. అధికారంలోకొస్తే ఓపెన్ కాస్ట్ మైనింగ్ ను బంద్ చేసి కార్మికుల పిల్లలందరికీ ఉద్యోగాలిస్తానని హామీ ఇచ్చిన కేసీఆర్… ఉన్న ఉద్యోగాలను కుదించేశారు. ఉద్యమ ఆకాంక్షలను తీవ్రంగా దెబ్బతీశారు. 8 ఏళ్ల కేసీఆర్ పాలనలో 17 ఓపెన్ కాస్ట్ గనులను తీసుకొచ్చి వ్యవసాయ భూములను నాశనం చేస్తున్నారు. సింగరేణి కార్మికుల పిల్లలు ఉపాధి కోసం వలస చిన్నాచితకా పనులు చేయాల్సిన దుస్థితి. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే సింగరేణి కారిడార్ లో ప్రత్యేకమైన పరిశ్రమలను ఏర్పాటు చేయాలి. లక్షా 17 వేల ఉద్యోగాలను భర్తీ చేసేలా హామీ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రతి ప్రాంతంలో ఇలాంటి సభలను నిర్వహించాల్సిన అవసరం ఉంది.
తెలంగాణ జర్నలిస్టుల యానియన్ నాయకుడు కప్పర ప్రసాద్
అక్షరమే అగ్నికణమై తెలంగాణ ఉద్యమాన్ని నడిపించిన చరిత్ర తెలంగాణ జర్నలిస్టులది. తెలంగాణ వచ్చాక ఆంధ్రా మీడియా తొత్తుగా మారిన కేసీఆర్ తెలంగాణ జర్నలిస్టులను మోసం చేశారు. కేసీఆర్ మోసాలను బట్టబయలు చేస్తూ ప్రజలను చైతన్యం వైపు నడిపిస్తూ ఉద్యమిస్తున్న బీజేపీకి జర్నలిస్టులంతా అండగా ఉంటాం. మా అక్షరాలే ఆయుధాలుగా… మా మాటలే తూటాలుగా కేసీఆర్ ను దహించే వేసే రోజులు రాబోతున్నయ్. బండి సంజయ్ ఆధ్వర్యంలో బీజేపీ సైన్యంతో కేసీఆర్ పాలనకు చరమగీతం పాడటం ఖాయం