– నేనేమన్న ఉగ్రవాదినా?
జనగామ లో నిన్న టీఆర్ఎస్ కార్యకర్తల దాడి లో గాయపడ్డ బీజేపీ కార్యకర్తలను పాతమర్శించేందుకు బయలు దేరగా హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు.ఈ సందర్భంగా రాజాసింగ్ ఏమన్నారంటే.. మా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ఆదేశాలతో నేను జనగామ బయలుదేరుదామంటే నన్ను హౌజ్ అరెస్ట్ చేసినారు. నేనేమన్న ఉగ్రవాదినా? మా కార్యకర్తల్ని కూడా పరామర్శించకూడదా?
రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తోంది. పోలీసులే దగ్గరుండి టీఆరెస్ గుండాలతో బీజేపీ కార్యకర్తల్ని కొట్టిస్తున్నారు. కేసీఆర్ కు బీజేపీ ఎమ్యెల్యేలు, ఎంపీలంటే భయం పట్టుకుంది. అందుకే మేము బయటకు వస్తున్నామంటే చాలు పోలీసుల్ని పంపి హౌజ్ అరెస్ట్ చేయిస్తుండు. పోలీసుల్ని అడ్డముగా పెట్టుకుని పాలన చేయాలనుకుంటుండు. మమ్మల్ని హౌజ్ అరెస్టు కాదు, త్వరలోనే రాష్ట్ర ప్రజలు నీకు శాశ్వతంగా ఫామ్ హౌస్ అరెస్ట్ చేస్తారు… రెడీగా ఉండు.