Suryaa.co.in

Telangana

నారాయణఖేడ్ బతుకులు మారాలంటే బిజెపిని గెలిపించాలి

-తొమ్మిదేళ్లలో నారాయణఖేడ్లో ఒక్క చెరువు తవ్వలేదు
-రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాగానే అర్హులందరికీ ఇల్లు, ఉచిత విద్య, వైద్యం
-తెలంగాణ ఉద్యమకారులు గోస పడుతుంటే కేసీఅర్ కుటుంబం జల్సాలు చేస్తోంది
-అనంతసాగర్, నారాయణఖేడ్ పట్టణంలో లో బిజెపి కార్నర్ మీటింగ్
-బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి జెనవాడే సంగప్ప
-మోడీ ప్రధానిగా ఉండడం మన అదృష్టం: డా.రవికుమార్ గౌడ్

తెలంగాణ ఉద్యమంలో నారాయణఖేడ్ మండలం అనంతసాగర్ నుంచి యువకులు పాల్గొని జైలు పాలైనారని వారికి వారి కుటుంబానికి ఏమి ఒరిగిందని బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి సంగప్ప ప్రశ్నించారు. నారాయణఖేడ్ పట్టణం, మరియు అనంతసాగర్ గ్రామంలో జరిగిన ప్రజాగోష బిజెపి భరోసా కార్నర్ మీటింగ్ లో డాక్టర్ రవికుమార్ గౌడ్ తో కలిసి సంగప్ప పాల్గొన్నారు.
తెలంగాణ వస్తే ఇంటింటికి ఉద్యోగం ఇస్తామని కేసీఆర్ మోసం చేశాడని సంగప్ప ఆరోపించారు. తెలంగాణ ఏర్పడ్డాక అన్ని వర్గాలు ముఖ్యంగా యువత రైతులు దళితులు మహిళలకు తీరని అన్యాయం జరిగిందని ఆయన అన్నారు.

ముఖ్యంగా 9ఏళ్ల తెలంగాణలో నారాయణఖేడ్ కు తీరని అన్యాయం జరిగిందని సింగప్ప ఆరోపించారు సిద్దిపేట గజ్వేల్ సిరిసిల్ల నియోజకవర్గాలకు ఏటా వేల కోట్ల రూపాయల నిధులు వెచ్చిస్తుంటే నారాయణఖేడ్ కి కనీసం అందులో పది శాతం కూడా కేటాయించలేదని సంగప్ప మండిపడ్డారునారాయణఖేడ్లో ఎప్పటికీ ప్రతి ఏటా నవంబర్ డిసెంబర్లో పల్లెలు ఖాళీ చేసి ప్రజలు వలస బాట పడుతున్నారని ఎందుకోసమేనా తెలంగాణ తెచ్చుకున్నదని సంఘటన ప్రశ్నించారు.

ఈ తొమ్మిదేళ్లలో నారాయణఖేడ్లో ఒక్క చెరువు తవ్వలేదు పల్లెటూర్లకి ఒక్క రోడ్డు వేయలేదు యువత కోసం ఒక ఫ్యాక్టరీ రాలేదని ఆయన పేర్కొన్నారు చదువుకున్న యువకులందరూ ఉద్యోగాలు లేక హైదరాబాద్ నిజాంబాద్ లో పానీ పూరీలు అమ్ముకుంటూ సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగాలు చేసుకుంటూ బతకాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు
తెలంగాణ వచ్చాక కేవలం కేసీఆర్ కుటుంబ సభ్యులకు పదవుల వచ్చయని, యువకులకు మాత్రం ఉద్యోగాలు రాలేదని చెప్పారు. వేల కోట్ల రూపాయల అవినీతి సొమ్ము ద్వారా కేసీఅర్ కుటుంబం, ఢిల్లీ లో సార వ్యాపారం, సింగపూర్, దుబాయ్ లో ఆస్తులు కంటున్నారని ఆయన అన్నారుబిజెపి అధికారంలోకి రాష్ట్రంలోని ఇల్లు లేని ప్రతి ఒక్క అర్హుడికి పక్కా ఇల్లు, పేదలందరికీ ఉచిత విద్య, వైద్యం అందిస్తామని సంగప్ప చెప్పారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న బిజెపి జహీరాబాద్ లోక్ సభ కన్వీనర్ డాక్టర్ రవికుమార్ మాట్లాడుతూ మన దేశానికి మోడీ గారు ప్రధానమంత్రిగా ఉండటం మన అదృష్టం అని అన్నారు.ఆయన వల్లనే ఈరోజు భారత్ ప్రపంచ గురువుగా వెలుగుతోందని అన్నారు. రాష్ట్రంలో కూడా బిజెపి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడబోతుందని ఆయన చెప్పారు.

బిజెపి బీసీ, ఎస్సీ, ఎస్టీలకు పెద్దపీట వేసే పార్టీ అని ఆయన పేర్కొన్నారు. కార్యకర్తలు నాయకులు కలిసికట్టుగా పనిచేసి రాష్ట్రం నుంచి కెసిఆర్ పాలనను పారదోలాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బిజెపి నారాయణఖేడ్ అసెంబ్లీ కన్వీనర్ రజనీకాంత్ ఎస్సీ మోర్చా రాష్ట్ర ఈసీ మెంబర్ సుధాకర్, పార్టీ సీనియర్ నేత సాయిరాం, శక్తి కేంద్రం ఇంచార్జ్ హనుమంతు సచిన్ రెడ్డి విభీషల్ రెడ్డి సంగమేశ్వర్ రెడ్డి సంజు పటేల్, రాజు గౌడ్, సగణాకర్, వెంకట్ రెడ్డి, సతీష్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE