– బీజేపీ ఏపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్
మన్యం జిల్లా : పార్వతీపురం సాగు, తాగునీటి సమస్య పరిష్కరిస్తా… ప్రతి గ్రామంలో బీజేపీ జెండా రెపరెపలాడాలి. బీజేపీ సింబల్ తో పోటీ చేసేందుకు బీజేపీ నేతలు ప్రణాళికలు రచించుకోవాలని బీజేపీ ఏపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ పిలుపునిచ్చారు. వైసీపీ ప్రభుత్వం విధ్వంసకర పాలన చేసింది… ఇందుకు కారకులైన వారిని చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి. ప్రశాంతమైన ఉత్తరాంధ్రలో అపరిచితులు విధ్వంసకర రచనలు చేస్తున్నారని ఆరోపించారు. ఇక్కడ జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో మాధవ్ మాట్లాడారు.
అపరిచితులు స్నేహం కారణంగా విజయనగరంలో ఉగ్రలింకులు బయటపడ్డాయి. అపరిచితులు వచ్చి ఉగ్రవాదులను తయారు చేస్తున్నారు. అపరిచితులు వస్తే ప్రశ్నించాలి.. ప్రశాంతంగా ఉండే ప్రాంతాలలో ఇలాంటి వారు ప్రవేశించి కుట్రలకు, కుతంత్రాలకు దారి తీసే విధంగా ప్రవర్తిస్తుంటారు. అలాంటి వారి పట్ల అప్రమత్తం గా ఉంటూ వారిని ఎదుర్కునేలా ప్రతి ఒక్క కార్యకర్త ఉండాలి. సారథ్యం కార్యక్రమంలో భాగంగా ఉతరాంధ్రకి రావడం సంతోషంగా ఉంది.
జిల్లాల్లో ఉండే బీజేపీ పార్టీ కార్యాలయాలు ప్రజా సమస్యలని తీర్చే పరిపాలన భవనాలు అయ్యేలా ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలి.. మోదీ కి అండగా మనమంతా నిలబడాలనే ఉద్దేశంతో రాష్ట్రం అంతా సారథ్యం కార్యక్రమంతో పర్యటిస్తున్నానని మాధవ్ తెలిపారు. ఈనెల 30 వతేదీన సంచార జాతులు సమ్మేళనం ఉంది. డి నోటిఫై ట్రైబ్ తో విజయవాడలో స్ఫూర్తి అనే పేరు తో భారీ సమ్మేళనం నిర్వహిస్తున్నాం. సంచార జాతులు సమస్యలు పరిష్కారం చేయడానికి బీజేపీ మాత్రమే కృషి చేస్తోందని మాధవ్ వివరించారు.