– పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ పిలుపు
అనంతపురం: స్థానిక ఎన్నికల్లో బీజేపీ గెలుపే ధ్యేయంగా పనిచేయాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన సారథ్యం కార్యక్రమంలో భాగంగా బుధవారం ఇక్కడ ఏర్పాటు చేసిన పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. స్థానిక ఎన్నికల్లో సాధారణ కార్యకర్తలు అసాధారణ ప్రతిభ ను చూపిస్తూ బీజేపీ గెలుపు కోసం పోరాడాలన్నారు. ప్రజల ఇంటి తలుపు తట్టి మీ ఇంటికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వచ్చారని చెప్పాలన్నారు.
నరేంద్ర మోడీ ఏవిధంగా వచ్చారంటే గ్రామాలకు గ్రామీణ సడక్ యోజన ద్వారా రోడ్లు వేయడం ద్వారా, రైల్వే స్టేషన్ లు అభివృద్ధి ద్వారా వచ్చారని, అదేవిధంగా ప్రతి ఇంటి కి రేషన్ ఉచిత బియ్యం, కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా రైతులు వద్ద కు, ప్రతి ఇంటి కి గ్యాస్, బ్యాంకు ఖాతాలు ఏర్పాటు ద్వారా ప్రతి ఒక్కరిని నరేంద్ర మోడీ కలిసారన్న విషయం వివరించాలన్నారు.
అనంతపురం అభివృద్ధి కి బీజేపీ మరింత ప్రయత్నం చేస్తోందన్నారు. దక్షిణ భారతదేశంలో తొలిసారిగా కిసాన్ రైలు ను అనంతపురం నుండి ప్రారంభించి న విషయం గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం లో ఎన్ డి ఎ అధికారంలోకి వచ్చిన తర్వాత రాయలసీమ అభివృద్ధి ప్రారంభం అయిందని, కేంద్రీయ విద్యాలయ ఏర్పాటు వంటి అంశాలను మాధవ్ గుర్తు చేశారు.