వచ్చే ఎన్నికల్లో బిజెపి దే గెలుపు

- భారతీయ జనతా పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల సారంగపాణి
సికింద్రాబాద్: తెలంగాణలో రాబోవు ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చరిష్మాతో నీతివంతమైన పాలనతో ప్రజలు బిజెపి వైపు మొగ్గు చూపుతున్నారని భారతీయ జనతా పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కంటెస్టెడ్ ఎమ్మెల్యే మేకల సారంగపాణి అన్నారు. జిల్లా పదాధికారులు డివిజన్ అధ్యక్షులతో అత్యవసర సమావేశం వైభవ్ ఫంక్షన్ హాల్ బౌద్ధ నగర్ లో నిర్వహించడం అయినది.
భారతదేశంలో 17 రాష్ట్రాలలో స్వయంగా మరో ఐదు రాష్ట్రాలలో మిత్రపక్షలతో కలిసి ప్రభుత్వాలు నడుస్తున్నాయని తెలంగాణలో ఈసారి ప్రజలు బిజెపిని ఆదరిస్తున్నారని అందుకు కార్యకర్తలు అందరూ కష్టపడి పనిచేసి ప్రజల సమస్యల పరిష్కారం కోసం పోరాడాలని సారంగపాణి తెలిపారు. ఇప్పటికే ఎస్ ఐ ఆర్ లో బిజెపి భాగస్వామ్యం అయిందని, నోటీసులు వచ్చిన మిగిలిన వారిని కూడా సరైన పత్రాలు సమర్పించి వారికి ఓటు హక్కు కల్పించే బాధ్యత కార్యకర్తలు తీసుకోవాలని మేకల సారంగా పని కోరారు. గణేష్ నిమజ్జన కార్యక్రమంలో కార్యకర్తలందరూ భక్తిశ్రద్ధలతో మండపాల నిర్వకులతో సహకరించి భక్తిశ్రద్ధలతో ఎలాంటి ఆటంకాలు ఇబ్బందులు కలగకుండా సహాయ సహకార కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని మేకల సారంగపాణి కోరారు.
ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న పార్లమెంట్ కన్వీనర్ రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. కార్పొరేషన్ ఎలక్షన్లు టార్గెట్ గా ప్రతీ కార్యకర్త బిజెపిని గెలిపిస్తారని అన్నారు. ఎస్ ఐ ఆర్ లో పది రోజులు అహర్నిశలు కృషి చేయాలని కోరారు. కొత్తవారిని మరియు 18 సంవత్సరాల నిండిన వారిని ఓటర్లుగా చేర్చాలని కోరారు. అలాగే పార్టీ కార్యక్రమాలను తప్పకుండా నిర్వహించాలని కోరారు.
ఈ సమావేశంలో నాగేశ్వర్ రెడ్డి, కనకట్ల హరి, శ్యాంసుందర్, శారదా మల్లేష్, అజయ్ నాయుడు, కన్నాభిరామ్, ప్రకాష్ గౌడ్, నాగారం శ్యామ్, డివిజన్ అధ్యక్షులు ఇవి నరేష్, ఉపేందర్ యాదవ్, కరుణాకర్, అరవింద్ కుమార్, సాయి ప్రసాద్ గౌడ్, సౌందర్య, నటరాజ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు
