Suryaa.co.in

Telangana

ప్రజల మధ్యన విభజన చిచ్చుకు బిజెపి కుట్ర

-మెజారిటీ ప్రజలను రెచ్చగొట్టేది రాజకీయ ప్రయోజనాల కొరకే
-మధ్యయుగం నాటి సంస్కృతి తెర మీదకు
-పెట్టుబడి దారుల చేతుల్లో మోడీ అమిత్ షా లు కీలుబోమ్మలు
-దేశ సంపదను కొల్లగొట్టి వారికి దోచి పెడుతన్నారు
-తెలంగాణా ప్రజలకు విజ్ఞత ఉంది
-దేశానికి గొప్ప చైతన్యాన్ని అందించిన సాయుధ పోరాటం
-రైతాంగమే ఆయుధాలు ధరించి చేసిన పోరు
-బిజెపి దుర్మార్గాలు ఈగడ్డ మీద సాగవు
-మేధావులు,కవులు కళాకారులు,విద్యార్ది యువత ఆలోచన చెయ్యాలి
-మంత్రి జగదీష్ రెడ్డి

ప్రజల మధ్యన విద్వెషాలు రెచ్చగొట్టి ప్రజలను విభజించే కుట్రలకు బిజేపి తెర లేపిందని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఆరోపించారు. మెజారిటీ ప్రజలను రెచ్చగొట్టేది బిజెపి రాజకీయ ప్రయోజనాల కొరకే నని ఆయన మండిపడ్డారు. ఈ మేరకు సోమవారం భోనగిరి యాదాద్రి జిల్లా కేంద్రం ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి,శాసన సభ్యులు ఫైళ్ల శేఖర్ రెడ్డి,గాధరి కిశోర్ లతో కలసి ఆయన మీడియా తో మాట్లాడారు.మధ్యాయుగం నాటి సంస్కృతిని తెరమీదకు తెచ్చేందుకు మోడీ,అమిత్ షా ల ద్వయం ప్రయత్నం చేస్తుందన్నారు.మేధావులు,కవులు,కళాకారులు,విద్యార్థి యువత అప్రమత్తంగా ఉండాలని ఆయన ఉద్బోధించారు. పెట్టుబడి దారుల చేతిలో మోడీ,అమిత్ షాలు కీలు బొమ్మల్లా మారారని ఆయన దుయ్యబట్టారు.దేశ సంపదను కొల్లగొట్టి పెట్టుబడి దారులకు అప్పనంగా అప్పగిస్తున్నారని ఆయన విరుచుకుపడ్డారు. తెలంగాణా ప్రజలు విజ్ఞులని వారి ఆటలు ఇక్కడ సాగవన్నారు.దేశానికి గొప్ప చైతన్యం కలిగించిన తెలంగాణా సాయుధ రైతాంగా పోరాటం జరిగింది ఈ గడ్డ మీదనే అని ఆయన గుర్తుచేశారు. రైతాంగమే ఆయుధాలు చెభుని చేసిన పోరాటం అని బిజెపి దుర్మార్గాలకు పులిస్టాఫ్ పెట్టకపోతే అటువంటి పోరాటం పునరావృతం అవుతుందని మంత్రి జగదీష్ రెడ్డి హెచ్చరించారు.

LEAVE A RESPONSE