Suryaa.co.in

Telangana

తెలంగాణలో బీజేపీ తొలి దరఖాస్తు రవిప్రసాద్‌గౌడ్‌దే

రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసే అభ్యర్థుల నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. ఆ మేరకు పార్టీ నేతలు గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, సుభాష్‌చందర్జీ, దాసరి మల్లేశంతో కూడిన దరఖాస్తు స్వీకరణ కమిటీకి, తొలి దరఖాస్తు సికింద్రామాద్ నియోజకవర్గం నుంచి అందింది. ఆ ప్రకారంగా ఆ నియోజకవర్గానికి చెందిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పి.రవిప్రసాద్‌గౌడ్, తెలంగాణలో తొలి దరఖాస్తుదారుడిగా అందరి దృష్టినీ ఆకర్షించారు.

సికింద్రాబాద్ నియోజకవర్గ కన్వీనర్, బీజేవైఎం నగర ప్రధాన కార్యదర్శి వంటి పదవులు నిర్వహించిన రవిప్రసాద్, రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో సికింద్రాబాద్ బీజేపీ టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. తనకు పార్టీ నాయకత్వం అవకాశం ఇస్తే, పార్టీని గెలిపిస్తానని చెప్పారు. పార్టీకి తాను చేసిన సేవలు దృష్టిలో ఉంచుకుని, తన అభ్యర్థిత్వం పరిశీలించాలని రవిప్రసాద్ అభ్యర్ధించారు.

LEAVE A RESPONSE