– పాల్గొన్న మంత్రి సత్యకుమార్, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్
పుట్టపర్తి: పుట్టపర్తిలో బీజేపీ శ్రేణుల శోభాయాత్ర, విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి, ధర్మవరం శాసన సభ్యుడు సత్య కుమార్ యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయనతో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పి.వి.ఎన్. మాధవ్, ఆదోని శాసన సభ్యుడు పార్థసారథి, జిల్లా అధ్యక్షుడు జీఎం శేఖర్, వేలాదిగా తరలివచ్చిన పార్టీ కార్యకర్తలు, మహిళా బృందాలు పాల్గొన్నారు.
పుట్టపర్తిలో సైమా హోటల్ నుండి ఆర్.వి.జె. ఫంక్షన్ హాల్ వరకు జరిగిన శోభాయాత్ర బీజేపీ ఆధ్యాత్మిక భావజాలానికి, సామూహిక క్రమశిక్షణకు ప్రతీకగా నిలిచింది. ఈ ఊరేగింపును పి.వి.ఎన్. మాధవ్, మంత్రి సత్య కుమార్ యాదవ్ ఉత్సాహభరితంగా జెండా ఊపి ప్రారంభించారు. ఈ యాత్ర ద్వారా పార్టీ కార్యకర్తల అంకితభావం, పార్టీ పట్ల విశ్వాసం స్పష్టంగా ప్రత్యక్షమైంది.
ఇదిలావుండగా, శోభాయాత్ర అనంతరం జరిగిన జిల్లా స్థాయి కార్యకర్తల సమావేశంలో సత్య కుమార్ యాదవ్ మాట్లాడారు. ధర్మవరం నుండి తెల్లవారుజామున నుండే కార్యక్రమానికి తరలివచ్చిన మహిళా కార్యకర్తలకు ఆయన ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిట్ర శివన్నారాయణ, బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్, బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు చంద్రమౌళి, బిజెపి జిల్లా ఇన్చార్జ్ బాలకృష్ణ యాదవ్, దళిత మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు గుడిసే దేవానంద్, యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు మిట్ట వంశి, పార్లమెంట్ సంయోజక్ హిందూపురం రమణమూర్తి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రమేశ్ రెడ్డి, తలుపుల గంగాధర్, పీటీ అంజినేయులు, జిల్లా ప్రధాన కార్యదర్శులు బి.అమర దేవేంద్ర, టి.హరికృష్ణ గౌడ్, సాకే ఓబులేసు, బిజెపి సీనియర్ నాయకులు, మహిళా నాయకురాలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.