– ముఖ్యఅతిథిగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డా
– బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి
హైదరాబాద్: 6 అబద్ధాలు 66 మోసాలు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఏడాది పాలన వైఫల్యాలపై సరూర్నగర్ స్టేడియం మైదానం(ఎల్.బి.నగర్)లో ఈనెల 7న మధ్యాహ్నం 3 గంటలకు బిజెపి ఆధ్వర్యంలో బహిరంగ సభ జరగనుంది.
ఈ బహిరంగ సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డా ముఖ్యఅతిథిగా పాల్గొననున్నారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షులు & కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి అధ్యక్షత వహిస్తారు. ఈ బహిరంగ సభలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి & బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్, బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు& పార్లమెంట్ సభ్యులు డికె అరుణ, బిజెపి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, బిజెపి పార్లమెంటరీ బోర్డు సభ్యులు, పార్లమెంట్ సభ్యులు డాక్టర్ కే లక్ష్మణ్, బిజెపి శాసనసభా పక్ష నాయకులు మహేశ్వర్ రెడ్డి, బిజెపి శాసనమండలి పక్ష నాయకులు ఏవీయన్ రెడ్డి, బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులు, పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, బిజెపి నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొంటారు.