Suryaa.co.in

Telangana

డీజీపీ ముట్టడిలో బీజైవైఎం రాష్ట్ర అధ్యక్షులు భాను ప్రకాశ్ కు తీవ్ర గాయాలు

-ఎమర్జెన్సీ వార్డుకు తరలించి అత్యవసర చికిత్స అందిస్తున్న వైద్యులు
-భానుతో సహా పలువురు బీజేవైఎం నాయకులకు గాయాలు
-పోలీసుల తీరుపై మండిపడ్డ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్
-న్యాయమైన డిమాండ్లపై ఆందోళన చేస్తే అమానుషంగా వ్యవహరిస్తారా? అంటూ ప్రశ్న
-కేసీఆర్ సర్కార్ కు పోయేకాలం దాపురించిందని వ్యాఖ్య

ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు న్యాయం చేయాలని కోరుతూ బీజేవైఎం నాయకులు చేపట్టిన ‘ఛలో డీజీపీ’ ముట్టడి కార్యక్రమం పోలీసులు రాక్షసంగా వ్యవహరించారు. డీజీపీ ఆఫీస్ లోకి వెళ్లేందుకు యత్నించిన బీజేవైఎం నాయకులను ఈడ్చి వేశారు. లాఠీ ఛార్జ్ చేశారు. ఈ సందర్భంగా పోలీసులకు, బీజేవైఎం కార్యకర్తలకు మధ్య తీవ్ర తోపులాటలో బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు భాను ప్రకాశ్ స్ప్రుహ తప్పి పడిపోయారు. అయినా పోలీసులు విచక్షణారాహితంగా భాను ప్రకాశ్ లాఠీలు ఝుళిపించారు. ఈడ్చుకెళ్లి వ్యాన్ లో పడేశారు. ఈ సంఘటనలో భాను ప్రకాశ్ కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే బీజేవైఎం నాయకులు గ్లోబెల్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. వెంటనే వైద్యులు ఎమర్జెన్సీ వార్డుకు భాను ప్రకాశ్ తరలించిన వైద్య చికిత్స చేయిస్తున్నారు. ఈ ఘటనలో భాను ప్రకాశ్ తోపాటు అరుణ్ కుమార్, పుల్లెల శివ సహా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి.

కరీంనగర్ పర్యటనలో ఉన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఈ విషయం తెలుసుకున్న వెంటనే బీజేవైఎం నాయకులకు ఫోన్ చేసి భాను ప్రకాశ్ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్ పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్ఐ, కానిస్టేబుల్ పరీక్షలో లక్షలాది మంది అభ్యర్థులకు జరిగిన అన్యాయాన్న సరిదిద్దాలని ఆందోళన చేస్తే అమానుషంగా వ్యవహరిస్తారా? అంటూ మండిపడ్డారు. పరీక్షలు కూడా సక్రమంగా నిర్వహించని చేతగాని కేసీఆర్ సర్కార్ ప్రశ్నించే వాళ్లను అణిచివేయడానికి యత్నిస్తోందన్నారు. కేసీఆర్ సర్కార్ కు పోయేకాలం దాపురించిందని, నిరుద్యోగుల ఉసరు తగలక తప్పదని పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి దాష్టికాల పై ప్రజల్లోకి వెళ్తాం
బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి & బిజెపి యువమోర్చా రాష్ట్ర ఇంచార్జ్ దుగ్యాల ప్రదీప్ కుమార్
బిజెపి యువమోర్చా ఆధ్వర్యంలో డీజీపీ కార్యాలయం వద్ద జరిగిన నిరసన కార్యక్రమంలో బిజెపి యువమోర్చా రాష్ట్ర అధ్యక్షులు భాను ప్రకాష్ కు తీవ్ర గాయాలు కావడం జరిగింది. ఎమర్జెన్సీ వార్డుకు తరలించి అత్యవసర చికిత్స అందిస్తున్న వైద్య బృందం సహాయంతో త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను.భాను ప్రకాష్ తో సహా పలువురు బిజెపి యువ మోర్చ నాయకులకు గాయాలు అయి ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారు.ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులకు న్యాయం జరగాలని నిరసన కార్యక్రమం చేపట్టిన బిజెపి యువమోర్చా నాయకులపై పోలీస్ యంత్రాంగం కర్కశంగా లాఠీచార్జ్ చేసి గాయాలపాలు చేయడం పట్ల తీవ్రంగా ఖండిస్తున్నాం.

అభ్యర్థుల యొక్క న్యాయమైన డిమాండ్లపై నిరసన కార్యక్రమం చేపట్టడం నేరం కాదు. రాష్ట్ర ప్రభుత్వం నిరంకుశ వైఖరికి రానున్న కాలంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.నిరసన కార్యక్రమాల పట్ల రాష్ట్ర ప్రభుత్వం దాస్టికాన్ని ప్రదర్శించడం తెలంగాణ సమాజం తీవ్ర ఆగ్రహంతో ఉన్నదన్న విషయాన్ని టిఆర్ఎస్ ప్రభుత్వం గ్రహించాలి. గతంలో ముఖ్యమంత్రి స్వయంగా పత్రికా విలేకరుల సమావేశంలో నిరసన కార్యక్రమాలు చేపడితే శాంతియుతంగా అరెస్టు చేయడం వదిలిపెట్టడం సర్వసాధారణం అన్న ముఖ్యమంత్రి నేడు నిరుద్యోగ యువతపై, రాజకీయ పార్టీల నాయకులపై పోలీసులను ప్రోత్సహించి లాఠీలతో దాడులు చేయించడం ఆయన అహంకారానికి నిరంకుశత్వానికి నిదర్శనం.

జరిగిన అన్యాయం పట్ల యువత, రాజకీయ పార్టీలు పోరాటాలను ఉద్యమాలను చేపడితే దాడులతో గాయపరచడం భయాందోళనకు గురి చేయడం రాష్ట్ర ప్రభుత్వానికి సర్వసాధారణమైంది.ప్రపంచంలో ఉన్నటువంటి నియంతలు, నిరంకుశ వాదులు నేలమట్టమైనట్టే రానున్న ఎన్నికలలో టిఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల ఆగ్రహజాలల్లో నేలమట్టమవుతుంది. ముఖ్యమంత్రి దాష్టికాల పై ప్రజల్లోకి వెళ్తాం. రాష్ట్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరి పైన ప్రజా వ్యతిరేక విధానాల పైన ఉద్యమాలను, పోరాటాలను భారతీయ జనతా పార్టీ తీవ్రతరం చేస్తుంది. దాడులకు భయపడేది లేదు.పోలీసులను ప్రోత్సహించి లాఠీలతో దాడులు చేయించి రాక్షసానందాన్ని పొందుతున్న ముఖ్యమంత్రి కి తెలంగాణ ప్రజలు గుణపాఠం చెప్తారు.

LEAVE A RESPONSE